సముద్రం.. | ఫణీంద్ర కుప్పిలి
సముద్రం.. | ఫణీంద్ర కుప్పిలి
వెండి వెన్నెల వేళ..
అల్లరి చందమామతో సయ్యాటలాడుతూ
ఎంతో సొగసుగా ఊసులెన్నో చెబుతుంది!
ప్రేమికుల శ్వాసల్లోని వెచ్చదనాన్ని..
తన పైరగాలిలో వెదజల్లుతూ
మనసులను గమ్మత్తుగా కట్టిపడేస్తుంది!
సమస్త జీవకోటినీ.. అంతులేని రహస్యాల్ని
తన అగాధ గర్భంలో దాచుకుని..
పైకి మాత్రం నిష్కామ యోగిలా
ఎంతో గంభీరంగా కనిపిస్తుంది!
కానీ..
దాన్ని అలుసుగా తీసుకుని
మానవుడు గీత దాటిన మరుక్షణం..
రాకాసి అలలతో అమాంతం విరుచుకుపడుతుంది!
తనతో తలపడిన ప్రతీ శక్తినీ
తన ప్రవాహంలో కలిపేసుకుంటుంది!
అప్పటిదాకా జోలపాడిన అలలతోనే
క్షణంలో మృత్యురాగం ఆలపిస్తుంది!
07.06.2026