వ్యాలంటైన్స్ డే..| ఫణీంద్ర కుప్పిలి
వ్యాలంటైన్స్ డే..| ఫణీంద్ర కుప్పిలి సినిమాలు లేవు.. షికార్లు లేవు.. కానుకలు లేవు.. కౌగిలింతలు లేవు.. కతలు లేవు.. కవిత్వాలు లేవు.. ఇద్దరి కళ్ళు మౌనంగా సంభాషించుకుంటున్నాయి.. రెండు మనసులు ఆత్రంగా పెనవేసుకున్నాయి.. సరదాలు..సరాగాలు.. విందులు..వినోదాలు.. ఉన్నా..లేకపోయినా.. కష్టాలు.. కన్నీళ్లు.. ఒడిదుడుకులు ఎన్ని ఉన్నా.. జీవిత చరమాంకం వరకు.. అంతులేని ప్రేమ అనునిత్యం గుభాళించాలని.. త్రికరణ శుద్దిగా ఆకాంక్షిస్తూ.. హ్యాపీ వ్యాలంటైన్స్ డే 'మహా..'