Posts

Showing posts with the label అవీ..ఇవీ..
కరోనా కొమ్ముల్ని వంచామని సంబరపడేలోగా.. మరో రూపంలో కోరలు చాస్తోంది ఈ మాయల మరాఠీ.. ఇక ఈసారి చప్పట్లతో పనయ్యేలా లేదు తప్పెట గుళ్ళు ఆడాల్సిందే..
నా జీవితంలో ప్రతీ ఉదయం ఎంతో స్వచ్ఛంగా, సంతోషంగా అనిపిస్తుంది.. నేను చేసే ప్రతీ పనినీ ఎంతో బాధ్యతగా, ఆనందంగా చేస్తాను.. నా జీవితాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దిన ఆమెకి.. నేను ప్రతీ రాత్రి నిద్రకు ఉపక్రమించేముందు మనస్ఫూర్తిగా అభినందిస్తాను.. వీటన్నింటి వెనుక ఉన్న 'ఆమె' ఎవరో కాదు.. ఇందులో ఎటువంటి రహస్యం లేదు.. అనుక్షణం నన్ను ఓపిగ్గా భరిస్తూ, సహిస్తూ చిరునవ్వుతో నట్టింట నడియాడే నా 'మహాలక్ష్మి'కి పెళ్లిరోజు శుభాకాంక్షలు..

సౌండ్ లెస్..లైట్ లెస్.. పొల్యూషన్ లెస్.. లోకాస్ట్..నో కాస్ట్ దీపావళి శుభాకాంక్షలు

సౌండ్ లెస్..లైట్ లెస్.. పొల్యూషన్ లెస్.. లోకాస్ట్.. నో కాస్ట్ దీపావళి శుభాకాంక్షలు.. - ఫణీంద్ర కుప్పిలి _______________________________________                  మనం పర్యావరణం గురించి తెగ బెంగేట్టుసుకుని.. ఎడతెరిపి లేకుండా ఉపన్యాసాలిచ్చేసి.. సుద్దులు బుద్దులు చెప్పేవారంతా.. నిత్యజీవితంలో తెలిసో, తెయకుండానో పర్యావరణానికి చేస్తున్న హాని అంతా ఇంతా కాదు... ఇంట్లో..బస్సుల్లో, కార్లలో, ట్రైన్లలో.. క్లాస్ రూముల్లో.. సినిమా హాల్లో.. రెస్టారెంట్ లో..ఇలా ప్రతీ చోటా.. విచ్చలవిడిగా ఏ.సి లను వాడేసి..ప్రతీ పనికీ ఓ ఎలక్త్రికల్ ఉపకరణం వాడేయటం వలన.. విద్యుచ్ఛక్తి అవసరాలు పెరిగి.. విద్యుత్తు ఉత్పత్తి వలన జరిగే కాలుష్యం..మరీ ముఖ్యంగా ధర్మల్ విద్యుత్ వలన.. అలాగే పాలీథీన్ కవర్లు.. సూపర్ మార్కెట్ లో సరుకులు కోనటం దగ్గర నుండి..వేడి వేడి వేడి సాంబారు ఇడ్లీ దాకా .. ప్రతీదీ పాలిథిన్ కవర్లలోనే.. మనకు రైతు బజారుకి కూడా సంచి పట్టుకెళ్ళాలంటే నామోషి.. అలాగే మనం రోజుకొక గాడ్జెట్ వాడి పడేస్తుంటే గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్న ప్లాస్టిక్ మరియు ఎలక్ట్రానిక్ చెత్త.. మన...

ధనం మూలం ఇదం జగత్..

ధనం మూలం ఇదం జగత్.. | ఫణీంద్ర కుప్పిలి                          '..ఆ..డబ్బుదేముంది..'  '..మనిషి బ్రతకడానికి డబ్బు అవసరం కానీ..డబ్బే ప్రధానం కాదు..' 'ఆ..డబ్బున్నోడు కూడా తినేది పిడికెడు మెతుకులే కదా..పోయేది ఆరడుగుల జాగాలోనే కదా ..' అంటూ దీర్ఘాలు పోయే వారిని చాలా మందిని రోజూ చూస్తుంటాం.. కానీ నిజ జీవితంలో మాత్రం మనలో చాలా మంది ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తుంటాం.. కారణం ఎవరెన్ని స్టేట్మెంట్లు ఇచ్చినా..ఎన్ని సుద్దులు చెప్పినా..   '..చేతిలో కాసు లేకపోతే..దమ్మిడీ కి కూడా కొరగాము..' అందుకే ఒక పెద్దాయన అన్నాడు...'భూమి తన చుట్టూ తాను తిరుగుతూ..డబ్బున్నోడి చుట్టూ తిరుగుతోంది..' అని.. అదేదో సినిమాలో హీరో గారు..అనామకుడి సమాధి ఆరడగుల మట్టి దిబ్బ అయితే.. ఒక పెద్దమ్మది అరవై ఎకరాల్లో ఉందని..గుక్క తిప్పుకోకుండా చెప్పినట్లు.. ఎన్ని అనుకున్నా..'పైసా మె పరమాత్మా హై..' రూపాయి రూపాయి నువ్వేం చేయగలవు అంటే.. అన్నదమ్ముల్ని విడదీయగలను..చివరికి కన్నవారిని సైతం మట్టుబెట్టగలను అనేది...రోజూ పత్రిక పతాక శీర్షికలే సాక్షి...

తలకో మొక్క..ఊరికో వనం

తలకో మొక్క..ఊరికో వనం | ఫణీంద్ర కుప్పిలి గత నాలుగు రోజులుగా ఎక్కడ చూసినా .. “నిప్పులు కక్కుతున్న సూరీడు..భానుడి ప్రతాపానికి విలవిల లాడుతున్న జనాలు..” లాంటి మంచి టైమింగ్, రైమింగ్ ఉన్న క్యాప్షన్లతో జనాల్ని ఊదరగొదుతున్నారు.. అయినా ఎంతసేపూ..సూరన్నని ఆడిపోసుకునే బదులు..అసలు భానుడి ఈ ప్రతాపానికి కారణం ఎవరని? ఏ ఒక్కరూ ఆలోచించరే... మనం అభివృద్ధి పేరుతో కనబడిన ప్రతి చెట్టుని తెగ నరికేసి..అంగుళం ఖాళీ లేకుండా కాంక్రిటుతో  పరిచేసి.. కనుచూపు మేరలో కనీసం పచ్చ గడ్డిని మొలవనివ్వకుండా చేసేయడమే కాకుండా.. కారుల్లో..బైకుల్లో తెగ తిరిగేసి.. రోజంతా ఏ.సిలు ఫ్రిజ్ లు..మోటార్లు.. హీటర్లు.. ఒకటేంటి నానా రకాలుగా వాడేసి.. వాతావరణాన్ని వోల్ మొత్తంగా బొగ్గు పులుసుతో నింపేసి.. మన నెత్తిన మనమే కుంపటిని రాజేసుకుని.. ఇపుడు ఏ.సి రూంలో తీరిగ్గా కూర్చుని.. ”అబ్బ..ఈ వేడిని భరింలేకపోతున్నాం..” అంటూ దీర్ఘాలు పోవడం మరీ విడ్డూరం.. వెనకటికొకడు..” పచ్చదనం-ప్రాముఖ్యత పై మీటింగ్ ని..పదెకరాల తోటని నరికైనా సరే..భారీగా పెడతానని మంగమ్మ శపదం చేసాడంట..” ఇలా మనం కోట్ల టన్నుల కొలది భూవాతావరణాన్ని బొగ్గ...