Posts

Showing posts with the label నా సమీక్ష
 అవకాశాలు అనేవి అందమైన గులాబీలు వంటివి.. ఓర్పు సహనంతో ముందుకెళ్తే వాటిని మనం సద్వినియోగం చేసుకోగలుగుతాం.. ఆలోచన లేకుండా అత్యుత్సాహం కనపరిస్తే..  సమస్యల సుడిగుండంలో చిక్కుకుంటాం..
 మనకంటే ఎక్కువ కష్టపడే వాళ్ళని.. మనకంటే ఎక్కవ నిజాయితీపరుల్ని.. మనకంటే ఎక్కువ దయార్ద్ర హృదయాన్ని కల్గిన వాళ్ళని చూసి మనం అసూయ పడితే..  మన అసూయ మంచిదే..
ఏదైనా కొత్తగా మొదలు పెట్టటం అనేది.. కొత్త బూట్లు వేసుకోవడం లాంటిది..  మొదట్లో అసౌకర్యంగా ఉన్నా..  చేస్తున్నకొద్దీ సౌకర్యవంతంగా మారుతుంది..

'వాసు'తో "కాసేపు"

'వాసు'తో  "కాసేపు" ***************                               ఫేస్బుక్కు సంభాషణలలో అనుకోకుండా ఒకసారి ’వాసు’ అనే కవి గురించి చదవటం జరిగింది.ఆ తర్వాత నేను అతని కవిత్వం గురించి మరింత తెలుసుకునే ప్రయత్నంలో  "న్యాయపతి శ్రీనివాస రావు గారు ’వాసు’ అనే కలం పేరుతో సుమారు ఒక దశాబ్ధం క్రితం "కాసేపు" పేరుతో ఒక కవితా సంకలనాన్ని వెలువరించినట్లు తెలుసుకుని ’వాసు’ గారికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టడం, ఆమోదించడం చకచకా జరిగిపోయాయి.  ఎలాగైనా "కాసేపు" ని చదవాలనే నాకోరికను ఒకానొక సంభాషణల సందర్భములో వెలిబుచ్చడం, ఆయన వెనువెంటనే నాకు ఒక కాపీని ఎంతో అభిమానంతో పంపించడం జరిగింది..ఆ పుస్తకం ఎపుడెపుడు చదువుదామా అనే ఆత్రంలో ఉన్న నేను మా ఇంటికి వచ్చాక కూడా ఒక నాలుగు రోజులవరకు కనీసం పుస్తకాన్ని చూడలేకపోవడం నాలో ఆసక్తిని మరింత పెంచింది...ఇక ’కాసేపు" నాచేతికొచ్చాక ఏమాత్రం ఆలశ్యం చేయకుండా అక్షరంమక్షరం ఆబగా చదువుకున్నా.                  గురుతుల్యులు శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడి గారి ...