అంతులేని వ్యధ-7
అంతులేని వ్యధ-7 || ఫణీంద్ర కుప్పిలి నేను అక్కడ జరుగుతున్న హడావుడిని చూడటంతో..ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది..రొప్పుతూ రూంలోకి వెళ్ళా..అక్కడ ఉన్న సిబ్బంది ఒక్కసారిగా నన్ను చుట్టి ముట్టారు..' సర్..మీకోసమే చూస్తున్నాం..ఎక్కడికి వెళ్లిపోయారు మీరు?? పేషంట్ పరిస్థితి అస్సలు బాలేదు..అర్జెంట్ గా ఐ.సి.యూ కి షిఫ్ట్ చేయాలి..లేదంటే ప్రమాదం..' అని గుక్క తిప్పకుండా విషయాన్ని చెప్పేసింది ఒక సిస్టర్..నేను అసలేం జరిగింది అని అడిగేలోపే...' మీరు అర్జెంట్ గా ఈ పేపర్స్ పైన సంతకం చేయండి..పేషంట్ పరిస్థితి ప్రమాదకరంగా ఉంది' అంటూ..ఒక కన్సెంట్ లెటర్.. పెన్నూ..నా చేతిలో పెట్టారు..' స్టాఫ్.. నేను అమ్మ వైపు ఒకసారి చూశాను.. నిజంగానే చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది.. నేను మారు మాట్లాడకుండా సంతకం పెట్టి ఇచ్చేశా..వెంటనే అమ్మని ఐ.సి.యూ కి షిఫ్ట్ చేసేశారు.. ఐ.సి.యూ లోకి నన్ను అనుమతించక పోవడంతో..అక్కడే బయట ఉన్న ఒక బెంచీపై కూలబడ్డా..నాకంతా అయోమయంగా ఉంది..అసలు నేను డిశ్చార్జి పనుల కోసం అమ్మకి చెప్పి ఇ...