అంతులేని వ్యధ-4
అంతులేని వ్యధ-4 || ఫణీంద్ర కుప్పిలి
దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అమ్మ...నాన్న చనిపోయే నాటికి కొంత కోలుకోవడంతో.. హమ్మయ్య.. అని ఊపిరి పీల్చుకునే లోపే నాన్న హఠాత్తుగా మమ్మల్ని విడిచి వెళ్ళిపోవడంతో మా కుటుంబ భవిష్యత్తు ఒక్కసారిగా తల్లక్రిందులైంది.. ఓపక్క బాధ్యతలన్నీ నేను సంభాళించుకునే లోపే అమ్మ మళ్ళీ మంచం పట్టింది..'గోరు చుట్టుపై రోకలి పోటు' చందాన ..నేను మరింతగా మానసిక ఒత్తిడికి లోనయ్యాను..
ఒకవైపు అమ్మని ఎలాగైనా దక్కించుకోవాలనే అలోచనలతో నిరంతరం నేను సతమతమవుతుంటే.. మరోవైపు మా అమ్మ నిరంతరం నాన్న ఆలోచనలతో మరింతగా కృంగిపోసాగింది.. ఎంతగా ప్రయత్నించినా...అమ్మని ఆ మానసిక కుంగుబాటు నుండి బయటపడేయలేకపోయా.. మరో వైపు తీవ్రమైన మానసిక ఒత్తిడీ, సరైన తిండి,నిద్ర కరువు అవటం వలన నా ఆరోగ్యం దెబ్బతింది..నా జీవితం ఇలా కావటానికి తన అనారోగ్యమే కారణంగా భావించి..తను లేకపోతేనే..నేను జీవితంలో పెళ్లి చేసుకుని స్థిరపడతాననే ఒక అపోహని..అమ్మ.. మనసులో బలంగా నాటేసుకుంది...' మనోవ్యాధికి మందు లేదు' అన్నట్లుగా.. దాంతో ఎన్ని మందులు వాడినా..ఎన్ని హాస్పిటల్స్ కి తిప్పినా ప్రయోజనం లేకుండా పోయింది..
అయితే నేను మాత్రం పట్టువిడవకుండా... 'అమ్మా... నీకు బాగైతే..హాయిగా ఉందాం..పెళ్ళి కూడా చేసుకుంటా...అలాగే నాన్న కోరిక మేరకు నేను ఏదన్నా ఉన్నతోద్యోగానికి ప్రయత్నం చేస్తా' అని పదే పదే చెప్పడంతో.. అమ్మ ఆలోచనా విధానంలో కొంత మార్పు వచ్చి..మెల్లగా కోలుకో సాగింది..అమ్మకి మాట అయితే ఇచ్చా కానీ..పెళ్లి ప్రయత్నాలని ఏదో విధంగా తప్పించుకునే వాణ్ని..దానికీ కారణం లేకపోలేదు.. ఎందుకంటే కొంతమంది నాతో ' మీ అమ్మని ఊళ్ళో వదిలేసి..నువ్వు టౌను వచ్చేస్తానంటే..మా అమ్మాయినిస్తాం..' అని అనడంతో..మనుషులపై పూర్తిగా విరక్తి పుట్టి పెళ్ళి ప్రయత్నాలని విరమించుకున్నా...
సరే అమ్మకి ఇచ్చిన మాట ప్రకారం ఏదన్నా పోటీపరీక్షలకి ప్రిపేర్ అవుదామని.. మెల్లగా ఆ ప్రయత్నాలు మొదలు పెట్టా..అదేంటో చిత్రంగా...అమ్మ మెల్ల మెల్లగా కోలుకోవడం మొదలు పెట్టింది..లేచి తనపనులు తాను చేసుకోడమే కాకుండా..నేను ఎంత వద్దని బ్రతిమలాడినా ..నాకు సైతం వండి పెట్టేది..మెల్లగా నేను చదువుపై దృష్టి సారించా..ఎలాగైనా అమ్మా నాన్నల కలని నిజం చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నా.. ఇలా నా జీవితంలో మళ్లీ మంచి రోజులు రాసాగాయి..అయితే అనుకోకుండా జరిగిన ఒక సంఘటన..నా ఆశల సౌధాన్ని కుప్పకూల్చేసింది..
P.S : కొంతమంది మిత్రులు ఆరోపించినట్లుగా..నేను ఎవరి సానుభూతిని ఆశించి..నాకథని రాయడం లేదు..కేవలం ఒకరిద్దన్నా స్పూర్తి పొందుతారనే సదుద్దేశంతో మాత్రమే రాస్తున్నా..మిత్రులు అర్థం చేసుకుంటారాని భావిస్తూ...
01.03.2017