అంతులేని వ్యధ-3

అంతులేని వ్యధ-3 || ఫణీంద్ర కుప్పిలి

        ఇదివరకే చెప్పుకున్నట్లుగా నాన్న హఠార్మరణంతో.. అప్పటికే దీర్ఘకాలంగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న అమ్మ పరిస్థితి మరింతగా దిగజారింది.. దాంతో నేను ఇళ్ళు వదిలి ఎక్కడకీ వెళ్ళలేని పరిస్థితి నెలకుంది..అప్పటికే మా అమ్మ కోసం నెలల తరబడి సేవ చేసిన నా చెల్లెల్ని మరో మారు పిలవకపోయాను..మా అమ్మ అనారోగ్యం వలన బావ గారు తన కుటుంబ జీవితాన్ని కొంత వరకూ దూరం చేసుకోవాల్సి వచ్చింది.. అందువలన మరోసారి తనని ఇబ్బంది పెట్టలేకపోయా..

          అసలు నాన్నపై అంత ఒత్తిడికి కారణం కొంత వరకూ అమ్మ అనారోగ్యమే.. నాన్న ఉండేటపుడు ఒకరికొకరం కొంత తోడుగా ఉండేవాళ్ళం..ఒకరు డ్యూటీకి వెళితే..ఇంకొకరు ఇంటి వద్ద అమ్మని చూసుకునే వాళ్ళం.. అలాగే ఇకరు హాస్పిటల్ లో ఉంటే ఇంకొకరు డబ్బు వ్యవహారం చూసుకునే వాళ్ళం.. నేనూ..నాన్నా.. ఇద్దరమూ ప్రభుత్వోద్యోగాలు చేస్తున్నప్పటికీ...'రోగికి వచ్చిన జబ్బు కంటే వాళ్ళు వసూలు చేసే బిల్లు చూసి దిమ్మదిరిగిపోయే కార్పొరేట్ హాస్పిటల్స్ పుణ్యమా' అని తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు గురి అయ్యాం..ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో..నేను పెళ్ళి చేసుకునే సాహసం చేయలేదు.. ఎందుకంటే నేను ఎక్కడ మా అమ్మకి దూరం కావాల్సి వస్తుందో అని... నాన్న మాకు దూరమయ్యాక నా పరిస్థితి 'పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టయింది'...అన్నీ నేనొక్కడినే చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది... ఎటుచూసినా కనీసం మాట సహాయం చేసే వాళ్ళు కూడా కరువయ్యారు..

        అప్పటికే ఉన్న సెలవులన్నీ వాడేసుకోవడం వలన విధిలేని పరిస్థితుల్లో నేను ఉద్యోగానికి వెళ్ళాల్సి వచ్చింది.. ఎందుకంటే..నెల తిరిగే సరికి వేలల్లో ఉండే ఆసుపత్రి మరియు మందుల ఖర్చుల్ని భరించగలిగే స్థోమత లేకపోయింది..అలా అయిష్టంగానే.. తప్పనిసరి పరిస్థితుల్లో.. ఉదయాన్నే అమ్మకి కావాల్సినవి అన్నీ చేసిపెట్టి...అమ్మ మంచానికి అన్నీ అందుబాటులో ఉంచేవాడిని..వేసుకోవాల్సిన మందుల్ని చీటీ రాసి..టేబుల్ పెట్టి..నాకు కొంచెం అన్నం వండుకుని..గబ గబా స్కూల్ కి బయల్దేరే వాడిని.. నేను స్కూల్ కి వెళ్ళిపోతే 'నా' అనే వాళ్ళు ఇంట్లో లేకపోవడంతో.. అమ్మకి ఎపుడు ఎలా ఉంటుందో??ఎపుడు ఏ అవసరం వస్తుందో అనే బెంగ, నన్ను అనుక్షణం  వెంటాడుతూ ఉండేది..ఈ విధంగా అనుక్షణం మా అమ్మ అనారోగ్యం గురించి విపరీతమైన ఆందోళనతో...భారంగా రోజులు గడవ సాగాయి..

( ఎటువంటి క్లిష్టమైన పరిస్థితులని దాటి ప్రిపరేషన్ మొదలు పెట్టానో చెప్పడం కోసం )

26.02.2017

పాప్యులర్ పోస్టు

ఎన్ని'కల' భోజనంబు | ఫణీంద్ర కుప్పిలి

(అ)పుత్రస్య గతిర్నాస్తి..

మొబైలోపాఖ్యానం