మా హరీష్ గాడి పెళ్లిలో టీ గోల

 మా హరీష్ గాడి పెళ్లిలో టీ  గోల | ఫణీంద్ర కుప్పిలి 


మొన్న మా తమ్ముడు హరీష్ పెళ్ళిలో మా ఫ్యామిలీ గ్యాంగ్ మొత్తం కలిసింది.. మేముమాంచి ఎండలో వెళ్ళటం వలన కల్యాణ మండపం లోకి ఎంటరవ్వగానే కాస్తా చల్ల గాలితగలటం లో ప్రాణం లేచి వచ్చినట్లయింది ..  స్వింగ్ లో ఎవరిని పలకరించానో కూడాతెలియలేదు ..  పైన ఫుడ్ కౌంటర్ కి వెళ్లి  నాలుగు మెతుకులు కుక్కేసి మళ్ళీ కల్యాణమండపం దగ్గరికి చేరుకున్న.. కాస్త ఆత్మరావుడు  శాంతించడం తో మా వాళ్లతో మాటామంతీ  కలిపా..


ఎవరి గోల వాళ్ళదిలా  నచ్చినోళ్ళు నచ్చినోళ్లతో మాట్లాడుకుంటుంటే .. మా మణి గాడు(మాసూపర్ మేనల్లుడు ) మాత్రం  సూట్లు బూట్లు మార్చి మార్చి .. రక రకాల విన్యాసాలతో ఆడితంటాలు ఆడు పడుతున్నాడు.. 😁😁మరో పక్క మా మహిళా మణులు మొత్తం 'సౌత్ఇండియా ' మొదలుకుని 'కంకటాల వరకు దొరికిన రకరకాల చీరలకు.. గుండోడి 'లలితాజ్యువెలర్స్నుండి 'జాయ్ లు జోస్ జోరుని మోడలింగ్ చేయటం లో యమా బిజీ గాఉన్నారు .. వాల్లేసుకున్న నగా  నట్రాలు చుస్తే నాకప్పుడెప్పుడో అనంత పద్మనాభస్వామిరసహ్య నేల మాళిగల్లో బయటపడ్డ సొత్తు ఒకవైపు .. వాళ్ల  పెనిమిటిల(అదేనండీ హజ్బ్యాండులు ) దీనమైన ఫేసులు మరోవైపునా ఫేస్ తో సహారీల్స్ లా తిరిగాయి..


 మూలగా పెట్టిన  పెద్ద స్క్రీన్ వైపు ద్రుష్టి సారించా.. అంతే నా బుర్రలో రకరకాల వెబ్సిరీస్ లు.. రానా నాయుడులు తిరిగాయి.. 😵‍💫😵‍💫 పెళ్లి తర్వాతా మా హరీష్ తమ్మీ.. సాఫ్టువేరుకి  టాటా బై బై చెప్పేసి.. వెబ్ సిరీస్ లతో చెలరేగి పొతే బెస్ట్అనిపించింది..అంతలా ప్రీ వెడ్ షూట్ తో సెగలు తెప్పించాడు.. అంతలో మా చంద్ర మామతన లగేజీ తో సహా (అదేనండీ  ఆడి చిరు బొజ్జతో సహా)😍 ఎంట్రీ ఇచ్చాడు .ఆడొచ్చాకమొత్తం సీన్ మారిపోయింది.. ఎప్పుడూ శివుడి మేడలో నాగు పాములా నన్నుఅంటిపెట్టుకుని ఉండే మా ద్రుపద్ గాడిని మెల్లగా మా ఆవిడకి తగిలించేసి.. వచ్చి కల్యాణమండపం లో కూర్చున్నా.. 


పెళ్లి కొడుకు పెళ్లి కూతురు.. ఒకవైపు లైవ్ లో.. మరోవైపు స్క్రీన్ పై మాంచి బిజీ లో ఉంటే🥳.. మేము అంటే మా శ్రీదేవి పిన్నిరోజీ రోహిత్ చంద్ర మామానానీ మా బావ గారుమిగతా పిల్లి బిత్తిరి బ్యాచి అంతా కలిసి  చిన్న రౌండ్ టేబుల్ సమావేశం మొదలు పెట్టాం .. మా శ్రీదేవి తన సహజమైన శైలిలో సీరియస్ గా పేసు పెట్టి 😁.. వాళ్ళు.. పెళ్లి కొడుకు ఊరునుండి వైజాగ్ కి బస్సులో 🚌ఎలా "ఆడుతూ ..పాడుతూ.."వచ్చారో చెప్తుంటే మా అందరికినవ్వాగలేదు..  బస్సు డ్రైవరు ‘గంటకి గజం దూరం నడిపిన తీరు’ మమ్మల్ని కడుపుబ్బానవ్వించాయి..  ఒక్క ‘ఆడుతూ ..పాడుతూ..' కే  ఒక ఎపిసోడ్ సరిపోతుంది .. అన్నిటికంటే హైలైట్ మా బుల్లి మేనల్లుడు 'విహాన్ ' పూరి లోకి మటన్🐐 అడగటం..


ఇక్కడ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇంట్రో ఇవ్వాలి.. అదేనండి "యుగానికి ఒక్కడుపుడతాడు ..వాడు ట్రెండ్ ని ఫాలో అవ్వడు.. సెట్ చేస్తాడు .."🥳😁 అనే టైపు క్యారెక్టర్ మాశీను మామయ్య .. చాలా రోజుల తర్వాత ఆడిని చూసాక నాకు చాలా సేపు నవ్వాగలేదు.. ఎందుకంటే ఆడు ఎంత సంపాదించాడో లేదో తెలీదు కానీ.. ముందుకు మాత్రం కాస్తగట్టిగానే సంపాదించాడు.. అదేనండి చిన్న ‘బిందెసైజులో సంపాదించిన సిరి బొజ్జతో చిన్నసైజు సుబ్బి శెట్టి లా తయారయ్యాడు 😁😁.. ఆడి ఇంట్రో అంత  బలంగా ఎందుకుఇచ్చానంటే..  "ఆడుతూ..పాడుతూ.." కాన్సెప్ట్ కి ఆడే ఈవెంట్ ఆర్గనైజర్ .. ఇదనే కాదుదేన్నైనా 'బెస్టస్ట్గా..'సూపరెస్ట్'.. 🤣🙏గా ఆర్గనైజ్ చేయగల సత్తా ఉన్నోడు..ఇన్ని సూపర్లేటివ్ లు పెట్టానంటే .. ఈపాటికి  మీకు అర్ధమయ్యే ఉంటుంది..


ఇక  మధ్యాహ్నం తిన్నది అరిగించాలనో ఏమో గానీ..సాయంత్రం 'అలక సారెప్రోగ్రాం నిఆరు ఫర్లాంగులు అవతల ఫిక్స్ చేసాడు పెళ్లి కొడుకు.. మా ఆడవాళ్లు సైతం 'ఈవెనింగ్వాక్ ' అయిపోతుందని కాస్త స్పీడ్ గానే నడిచేసారు.. మా పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ పాతిక వేలుదగ్గర మొదలు పెట్టి చివరికి హిండిన్బర్గ్ దెబ్బకి కుదేలయ్యిన 'అదానీ ' స్టాక్స్ లాగాజర్రుమని ఐదు వేలకు జారిపోయారు..🤩🫣 ఇందులో కూడా స్వపక్షం లో విపక్షం లా మాశీను మామ కోవర్ట్  హస్తం లేకపోలేదు..  తర్వాత డీజే దెబ్బకి మా చెవుల తుప్పు… మావాళ్ళ తీన్మార్ స్టెప్పులకి అక్కడి సిమెంట్ రోడ్ల క్లీనింగు ఆటోమేటిక్ గా అయిపోయాయి..


బ్రతుకు జీవుడా అంటూ అంతా  మెల్లగా కాలీడ్చుకుంటూ తిరిగి కల్యాణ మండపానికిచేరుకొని.. దొరికింది దొరికినట్టు కుమ్మేసి ఒకచోట మళ్ళీ  అంతా కూలబడ్డాం.. 'ఉండవల్లిసరదా 'రామోజీచావుకొచ్చినట్లు .. మా హరీష్ గాడి పెళ్లి మా 'నిద్రకు'వచ్చింది.. శివరాత్రినాడైనా జాగారం చెయ్యలేదు కానీ.. ఈరోజు తప్పేట్టు లేదని డిసైడయ్యి మళ్ళీ తొట్టి గ్యాంగ్అంతా  చోట సిట్టింగ్ వేసాం.. 


పొద్దున్న నుండి సూరీడన్న ఫుల్ బ్రైట్నెస్🌞🔥 తో దంచికొట్టడం తో మా మాడులు  పగిలిపొగలు వస్తున్నాయి.. దాంతో బయటికి వెళ్లి టీ తాగుదాం అనే ప్రపోజల్ ని మా నానీ(నానీఅంటే చిన్నోడు అనుకునేరు ..అతనో అమెరికన్ రిటర్ను సాఫ్టువ్వేరు ఇంజినీర్ ) పెట్టడంతో.. అర్థరాత్రి టీ కోసం కారులో రోడ్డున పడ్డాం.. ఎక్కడ చూసినా.. అయితే మందు షాపులు🥃🍺లేదా మంచింగ్ బళ్ళు🍢.. కారు ఫ్యూయల్ బొ..  తప్పితే..ఎక్కడా నాలుగు టీ చుక్కలుదొరకలేదు.. దాంతో విపరీతమైన డిజప్పాయింట్మెంటు తో మళ్ళీ కల్యాణ మండపానికిచేరుకున్నాం.. నాకు తెలిసి మన ‘రాహుల్ బాబా’ ఎంపీ పదవి పోయినప్పుడు కూడా మాఅంత డిజప్పాయింట్ అయ్యుండడు ..


 టైములో మా 'సూపరెస్టు'🥰 మామా సీన్ లోకి ఎంటరయ్యాడు .. ఎలాగైనా టీతాగాల్సిందే అన్న మా మహా సంకల్పానికి ఉపిరిలూదుతూ  మాతో పాటు మొత్తం ఆడలేడీస్ బ్యాచ్ ని రెచ్చ గొట్టీసాడు.. అంతే లేడీస్ బ్యాచ్  మా మణి గాడిని.. ఒక స్కార్పియోలోకి ఎక్కించేసి .. మమ్మల్ని మాత్రం 'అతడుసినిమాలో ఒకే సుమోలో పాతిక మందిరౌడీల్ని కుక్కేసినట్లు.. మమ్మల్ని అందరినీ ఆల్టో కార్లో కుక్కేసాడు..👿


 'సమరసింహారెడ్డి ' సినిమా స్టైల్లో టీ కోసం ఛేజింగ్ మొదలు పెట్టాం.. మా శీను మామాడ్రైవింగ్ ఎక్సపీరియెన్స్ మొత్తమ్ బయటికి తీసి.. కారుని గుంత గొయ్య అని చూడకుండాయాక్సిలరేటర్ ని తొక్కుతున్నాడు.. అసలే మాకు లాగా కారుకి కాస్తా ఏజ్ బారు కావడంతో.. మా మామ ధాటికి కారు గజగజ వణుకుతూ.. 'నన్నొదిలెయ్ మహాప్రభూ ' అంటూ అరచిగీపెడుతోంది..  మా రవి బావకి వయస్సు మరియు హోదా రీత్యా  ముందు సీటుకేటాయించాము.. మా  చంద్ర మామ బ్యాక్ సీటు సెంటర్ లో మంచి నిబ్బరంగాకూర్చున్నాడు.. మనమసలే బక్క చిక్కిన ప్రాణి కావడంతో ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకునిబిక్క చచ్చి.. మనోడి దెబ్బకి కారు ఉండలు (అదేనండీ మన శీకాకుళం  యాసలో చక్రాలు ) డోర్లు ఎక్కడ ఊడొస్తాయో అని మనసులోనే  వచ్చీ రాని 🥱ఆంజనేయ దండకాన్నిచదువుకోవడం మొదలెట్టాను ..


అపుడు అనిపించింది నిజంగా దేవతలు అమృతం కోసం కూడా ఇంతగా యావపడుండరు అని..  రేంజి సంకల్పం  సివిల్స్ మీదో పెట్టుంటే.. ఖచ్చితంగా సింగిల్ డిజిట్ర్యాంకు వచ్చేసుండేదని.. మొత్తానికి ఎలాగోలా  పది పదిహేను కిలోమీటర్లు వెళ్లి ఆర్టీసీబస్టాండుకు చేరుకున్నాం.. అక్కడ టీ బంకు కనిపించేసరికి ..  స్నానం మధ్యలో యురేకాఅని పరిగెత్తిన ఆర్కేమెడీసు 🥱🥱లా గుడ్డలు చింపుకొని మరీ పరిగెత్తాలనిపించింది.. అంతే ..  టీ  చేసే వాడివైపు ఎంతో ఆరాధనగా చూస్తూ .. వేడి కుడితి 🫖లాఉన్నప్పటికీ..ఒకటికి రెండు టీలు తాగేసాం.. 


రామాయణం లో పిడకల వేటలా  మేము ఎంతగా ఇన్వాల్వ్ అయిపోయాం అంటే .. ఈపెల్లికోసం ఎంతో దూరం నుండి వచ్చిన మా లేడీస్ బ్యాచ్.. చివరికి పెళ్లి ముహూర్తందాటిపోయినా పర్లేదు అన్నంతుగా డేడికేట్ అయిపోయారు .. పెళ్లి ముహూర్తానికి టైముఅయిపోతుండటంతో.. మేము పూర్తిగా మా  శీను మామకి సరెండర్ అయిపోయాం.. నీట్ఎగ్జామ్ కి టైము అయిపోతుంటే పరుగుపరుగున చేరుకునే స్టూడెంట్ లా.. మొత్తానికిఎలాగోలా  కరెస్ట్  టైముకి కల్యాణ మండపం  చేరుకొని.. 

మా హరీష్ గాడి కళ్ళలో చివరిసారిగా  ఆనందాన్ని సంతృప్తిగా చూసి తరించాం.. 😁😁


గమనిక : మళ్ళీ మొత్తం రాయలేను.. జబర్దస్త్ ఎపిసోడ్ కు  ముందు వేసే స్లైడుచదువుకోండి ..


10.05.2023

పాప్యులర్ పోస్టు

ఎన్ని'కల' భోజనంబు | ఫణీంద్ర కుప్పిలి

(అ)పుత్రస్య గతిర్నాస్తి..

మొబైలోపాఖ్యానం