సముద్రం | ఫణీంద్ర కుప్పిలి
సముద్రం | ఫణీంద్ర కుప్పిలి అది అనంత సృష్టికి అద్దం.. విశ్రాంతి ఎరుగని ఒక నిరంతర చలనం.. ఉవ్వెత్తున ఎగసి పడే ప్రతి అల.. వైఫల్యాన్ని చూసి వెనకడుగు వేయదు.. పడి లేచే ప్రతి కెరటం.. ఓటమిని ఎదిరించే పోరాట పటిమను వీడదు.. తీరాన్ని తాకి వెనుదిరిగే ప్రతి తరంగం.. "నేను మళ్ళీ వస్తాను" అనే ఆశావహ సంతకం.. రేపటి సూర్యుడిపై అచంచలమైన నమ్మకంతో సాగర గర్భం చేసే ఒక నిశ్శబ్ద నిరీక్షణం.. పైపైన కనిపించే అశాంతి అలజడులను దాటితే.. తన అంతరాళంలో దాచుకున్న అనంత సంపదను.. ప్రకృతి దాచిన కోటానుకోట్ల సృష్టి రహస్యాలను ధైర్యవంతుల ముందే ఆవిష్కరిస్తుంది ఈ కడలి.. 18.04.2026