Posts

Showing posts from July, 2026
చీకటి వెలుగును చూసి ఫక్కున నవ్వింది... కనిపించేదంతా నిజం కాదు... మెరిసేదంతా బంగారం కాదు అని.. వెలుగు ప్రశాంతంగా బదులిచ్చింది.. కనిపించనిదంతా మాయ కాదు.. నిజం కనిపించాల్సిన అవసరమే లేదు అని.. -ఫణీంద్ర కుప్పిలి 18.07.2026

వర్షం-3 | ఫణింద్ర కుప్పిలి

  వ ర్షం-3 | ఫణింద్ర కుప్పిలి ఈసారి ఆకాశం మొఖం చాటేసింది దిక్కులేని రైతుపై పగబట్టి అత్త మీద కోపం దుత్త మీద చూపినట్టు మబ్బు ముసుగేసుకుంది మొండిగా.. "అలక మాని కురవవా..." అని కళ్లలో ఆశలు ఇంకిపోతుంటే అర్థిస్తున్నాడు రైతు.. దూరాన మెరుపు మెరిస్తే గుండె చిగురిస్తుంది దగ్గరయ్యేలోగా గాలి మాట విని మబ్బు వేరే దారి పడుతుంది.. నేలతల్లి పెదవులు దాహంతో పగుళ్లు బారగా పొలం గుండె ఒక్క స్పర్శ కోసం మౌనంగా తపిస్తోంది. ఆకాశం మాత్రం చినుకుకు బదులు నిర్దయగా తన ప్రకోపాన్ని చూపిస్తోంది.. విత్తనం నేల ఒడిలో జీవచ్ఛవంలా నిద్రిస్తూ చినుకు పిలుపు కోసం ఎదురుచూస్తుంటే.. రైతు గుండె అనునిత్యం ఆశ-నిరాశల నడుమ ఊపిరాడక కొట్టుకుంటోంది.. 28.07.2026

వర్షం -2 | ఫణీంద్ర కుప్పిలి

  వర్షం -2 | ఫణీంద్ర కుప్పిలి వర్షం నెమ్మదిగా చిన్న తుంపర్లుగా మొదలైంది.. అత్తవారింటిలో అడుగుపెట్టిన కొత్త పెళ్ళికూతురిలా.. అప్పటి వరకు చుక్క నీటికోసం అలమటించి నెర్రెలు బారిన నేల తల్లి మెల్లగా గుటకలు వేస్తోంది.. వర్షపు జల్లుతో పులకరించిన నేల కమ్మని మట్టి వాసన వెదజల్లుతోంది.. బామ్మ చేసిన చిక్కని ఫిల్టర్ కాఫీ కమ్మదనంలా మనసుని పరవశింపజేస్తోంది.. అంతలోనే... చిరు గాలికి చెట్ల కొమ్మలు ఊగాయి తల్లి ఒడిలో నిద్రపోతున్న బిడ్డను జోలపాడి ఓదార్చినట్లుగా... ఆకుల చివర వేలాడే నీటి బిందువులు కన్నీటి ముత్యాల్లా మెరిసాయి వేదనను వెలుగుగా మలచే ప్రకృతి తత్వాన్ని నేర్పాయి...  05.07.2026