అంతులేని వ్యధ-5
అంతులేని వ్యధ-5 || ఫణీంద్ర కుప్పిలి
అమ్మ ఆరోగ్యం కొంచెం కుదుటు పడిన తర్వాత..ఓసారి క్యాజువల్ చెక్ అప్ కోసం ఇంతకు ముందు ట్రీట్మెంట్ చేసిన కార్పోరేట్ ఆసుపత్రి లోని సర్జన్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నా..కేవలం కన్సల్టేషన్ కోసమే కాబట్టి.. ఇరువైపులా కారుని బాబాడుగకి మాట్లాడుకుని బయలుదేరా.. అమ్మ చక్కగా కారు ఆసుపత్రిలోకి నడుచుకుంటానే వచ్చింది..మా నంబర్ వచ్చినపుడు డాక్టర్ గారి దగ్గరికి అమ్మని తీసుకుని వెళ్ళా..
ముందుగా అన్నీ చెకప్ చేసిన తర్వాత..అంతా బాగుంది..ఇంకొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు..మరేం భయం లేదు అంటూ ధైర్యం చెప్పిన డాక్టర్ గారు..' ఓ రెండు ఫ్లూయడ్లు ఎక్కించి పంపించేస్తా..ఓ రెండు గంటలు తర్వాత మళ్ళీ వచ్చి చూస్తా' అని చెప్పి వెళ్ళిపోయారు.. నేను సరే ఏముందిలే..మహా అయితే సాయంత్రం వరకే కదా అని చెప్పి..చెల్లించాల్సిన డబ్బుని చెల్లించి..అమ్మ దగ్గరే కూర్చున్నా..ఓ రెండు గంటల్లో వచ్చి చూస్తానన్న డాక్టర్..రాత్రి అవుతున్నా..కనిపించలేదు..ఆసుపత్రి సిబ్బందిని వాకబు చేస్తే..' సార్..సర్జరీలో ఉన్నారనే సమాధానం..' చివరికి చేసేది లేక..బాడుగకి మాట్లాడుకున్న కారు అతన్ని.. డబ్బు చెల్లించేసి పంపించేశా.. కేవలం కన్సల్టేషన్ నిమిత్తం వెళ్ళడంతో..రాత్రి ఉండటానికి ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు లేకుండా వెళ్ళాం..చివరికి అక్కడున్న స్టాఫ్..' ఏదో సమస్య ఉందంట..ఇన్ పేషంట్ జాయిన్ చేయమని డాక్టర్ గారు చెప్పారు' అని చెప్పడంతో నేను షాక్ తిన్నా.. ఎందుకంటే కేవలం ఓ రెండు ఫ్ల్యూయడ్లు ఎక్కిస్తే..కొంచెం తేలికగా ఉంటుందని చెప్పి ఉంచిన డాక్టర్ చివరికి వచ్చి చూడకుండానే జాయిన్ చేయమనడంతో..విధిలేని పరిస్థితుల్లో చేతిలో ఉన్న డబ్బుని కట్టేసి..రూం వెళ్ళాం..
అంతే..అసలు ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితి.. ఎవరెవరో వస్తున్నారు..ఏవేవో శాంపుల్స్ తీసుకుంటున్నారు..ఏవేవో ఇంజెక్షన్లు చేస్తున్నారు కానీ ఎవరూ ఏ విషయమూ చెప్పటం లేదు..రాత్రి పది దాటినా కూడా మా డాక్టర్ గారి జాడ లేదు...మొత్తానికి రాత్రి పదకొండున్నరకి ఒక పెద్ద డాక్టర్ వచ్చి..' ఇక నుండి మీ అమ్మకి నేను ట్రీట్మెంట్ ఉస్తాను..ఓ రెండు రోజులు అబ్జర్వేషన్ లో ఉంచాలి.. మీరు డబ్బు ఏర్పాటు చేసుకోండి '..అని చెప్పి.'సార్.. అసలేమయింది?' అన్న నా మాట సగంలో ఉండగానే..హడావుడిగా వెళ్ళిపోయాడు..అసలేం జరుగుతుందో? చక్కగా నడిచి వచ్చిన అమ్మని ఎందుకు బలవంతంగా జాయిన్ చేసి ఉంచారో?? అర్థం కాక అయోమయ పరిస్థితుల్లో ఉన్నాం..నేను కొంచెం తేరుకుని..డబ్బు ఏర్పాటులో మిత్రులకి ఫోన్ చేయడం మొదలు పెట్టా..వవిపరీతమైన ఒత్తిడికి లోనుకావడంతో అసలు ఎప్పుడు నిద్రపోయానో?? ఎలా నిద్రపోయానో కూడా గుర్తులేదు..అలాగే అమ్మ మంచానికి ఆనుకుని వాలిపోయా..
P.S : అన్ని ఆసుపత్రులూ..అందరు వైద్యులూ.. అలా ఉంటారని కాదు..కేవలం నేను నా అనుభవాన్ని మాత్రమే చెబుతున్నా..
05.03.2017