అంతులేని వ్యధ-6
అంతులేని వ్యధ-6 || ఫణీంద్ర కుప్పిలి
'టక్ టక్ ' మని బూట్ల శబ్ధం వినపడటంతో ఒక్క ఉదుటున లేచి కూర్చున్నా..చుట్టూ కలియజూశా.. ఎపుడు నిద్రపోయానో గుర్తులేదు..అమ్మ నిద్రలో అటూ ఇటూ కదుల్తోంది..రూంలోకి వచ్చిన సిస్టర్స్..అమ్మకి సెలైన్ మార్చి వెళ్లిపోయారు.. లేచి మొబైల్ చూస్తే..ఇంకా తెల్లవారడానికి చాలా సమయముంది.. ' ఇంతకీ డాక్టరు గారు ఎందుకు జాయిన్ చేయమన్నారు? ఏదైన పెద్ద సమస్య ఉందా?? ఇంకా ఎన్నాళ్లు ఉండాలి?? డబ్బు ఎలాఎలా సర్దుబాటు చేసుకోవాలి?? ఇలా కందిరీగల్లా బుర్రలో తిరుగుతున్నాయి..కనీసం టీ అన్నా తాగుదామంటే..ఆ సమయం ఎక్కడా దొరికే అవకాశం లేదు..ఇక చేసేది లేక గదిలో మూలుగుతూ వెలుగుతోన్న ట్యూబ్ లైట్ ని చూస్తూ..అలాగే ఓ మూలగా కూలబడ్డా..
తెల్లవారిన తర్వాత మళ్ళీ షరా మామూలే.. ఎవరెవరో వస్తున్నారు..సిస్టర్సుని ఏవేవో అడుగుతున్నారు. కనీసం నాతో ఓ మాటకూడా మాట్లాడకుండానే హడావుడిగా వెళ్ళిపోతున్నారు..అలాగే సాయంత్రం వరకూ గడిచిపోయినా..మా డాక్టరు గారి జాడ మాత్రం కానరాలేదు..ఎన్ని సార్లు అడిగినా.. అరిగిపోయినా టేపు రికార్డులా ఒకటే సమాధానం..' సార్..సర్జరీలో ఉన్నారు'..డాక్టర్ గారు కనీసం తిండి అన్నా బయట తింటున్నారో? లేకపోతే ఆపరేషన్ థియేటర్లోనే తింటున్నారో అర్థం కావటం లేదు..మొత్తానికి రెండురోజుల్లో ఆసుపత్రి సిబ్బంది నాతో మాట్లాడిన ఒకే ఒక్క మాట..' సర్, మీరు మొదట కట్టిన అమౌంట్ అయిపోయింది..ఇంకా అమౌంట్ పే చేయండి..'
ఓ పక్క అమ్మ.. 'నాకు బాగానే ఉంది.. డిశ్చార్జి ఇస్తే ఇంటికి వెళ్లిపోదాం..' అని నన్ను డాక్టర్ గారిని అడగమని ఒకటే పోరు పెడుతోంది..చివరికి ఎలాగైతేనేం..అమ్మకి అంతకు మునుపు సర్జరీ చేసిన డాక్టరు గారు వచ్చి..చాలా ఏళ్ళుగా మేము అతని దగ్గరే అమ్మకి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నందున..తీరిగ్గా కుశలు ప్రశ్నలు వేసిన తర్వాత..' మీ అమ్మ గారికి ఇపుడు బాగానే ఉంది..ఈరోజు సాయంత్రం డిశ్చార్జి రాసేస్తాను..ఇంటికి వెళ్లిపోండి' అని చెప్పి వెళ్ళిపోయారు..దాంతో అమ్మకి సెలైన్లు ఆపేసి..ఏదన్న తినడానికి పెట్టమన్నారు.. ఇంటికి వెళ్ళిపోతున్నామనే ఆనందంలో ' మా అమ్మ మరింత ఉత్సాహంగా ఉంది..' మేము తెచ్చుకున్న కొద్దిపాటి సామాన్లని సర్దుతోంది..
'అమ్మా..నేను బిల్లు కట్టడానికి కావాల్సిన అమౌంట్ సర్దుబాటు చేసుకుని వస్తా..' అని రూం బయట అడుగు పెట్టే లోగా..ఓ ఇద్దరు సిస్టర్స్ హడావుడిగా లోపలకి వచ్చి ఏదో ఇంజెక్షన్ ఇవ్వాలని అమ్నని బెడ్ పైన కూర్చోమన్నారు..నాకు సహజంగానే ఈ మందులు..వాటిపై ఉన్న క్యూరియాసిటీతో.. ఆ ఇంజెక్షన్లు దేనికి సంబంధినవి అని అడిగే లోపే..నా మాట పట్టించుకోకుండా..గోడకి కొట్టిన బంతిలా వెళ్లిపోయారు.. సాధారణంగా చేసిన ప్రతీ మెడిసిన్ తాలూకా వివరాల్ని అక్కడుండే ' కేస్ షీట్' లో నమోదు చేస్తారు..ఈసారి మాత్రం అలా నోట్ చేయకుండానే వెళ్లిపోయారు..ఇంకో ట్విస్ట్ ఏంటంటే చేసిన ఖాళీ వైల్ ని కూడా వెంట తీసుకుని వెళ్లిపోయారు..అయితే నేను డబ్బు ఏర్పాటులో టెన్షన్ గా ఉండటం వలన..దాని మీద ఎక్కువ దృష్టి పెట్టలేకపోయా...అమ్మకి ఓ పది నిమిషాల్లో బయటికి వెళ్లొస్తానని చెప్పి వెళ్లిపోయా..
బయట నుండి తిరిగొచ్చే సరికి.. రూంలో అంతా హడావుడిగా ఉంది.. డాక్టర్లు..సిస్టర్స్.. అంతా అటూ ఇటూ పరిగెత్తుతున్నారు..'ఠాగోర్' సినిమాలో హాస్పిటల్ సన్నివేశాన్ని తలపించేలా ఉంది...
09.03.2017