అంతులేని వ్యధ-2
అంతులేని వ్యధ-2 || ఫణీంద్ర కుప్పిలి
ఎపుడైతే గ్రూప్-1 కి ప్రిపేర్ కావాలని నిశ్చయించుకున్నానో..ఇక అప్పటి నుండి ప్రతీ క్షణం లక్ష్యాన్నే శ్వాసించా..అయితే అప్పటి వరకూ మా కుటుంబంలో గానీ..మా చుట్టు ప్రక్కల గ్రామాల్లో గానీ గ్రూప్స్ సాధించడం కాదు కదా కనీసం ఇంటర్వ్యూ దశకి చేరిన వారు కూడా లేరు..దానితో ఎటువంటి గైడెన్స్ కి అవకాశం లేకుండా పోయింది..అయినా కూడా నేనేమి నిరాశ చెందకుండా సొంతంగానే ప్రిపరేషన్ మొదలు పెట్టా..సిలబస్ లోని అంశాలకి సంబంధించి మెటీరియల్ సేకరణే అతి పెద్ద అవరోధంగా మారింది..కానీ కొన్ని వందల గంటలు కష్ట పడి వీలైనంత ప్రామాణికమైన నోట్సుని సిద్ధం చేసుకున్నా..
ఒకవైపు నా ప్రిపరేషన్ సాగుతుండగా.. మరోవైపు కాలనీలో వివిధ రకాల పరీక్షలకి సిద్ధమవుతున్న వారికి మా ఇంటి వద్ద వీలైనంత గైడెన్స్ ఇచ్చే వాడిని.. దాంతో మా అమ్మనాన్నల చనిపోయిన తర్వాత ఇంట్లో కమ్ముకున్న భయంకరమైన ఒంటరితనం, ఒక రకమైన శూన్యత తొలిగి మళ్ళీ ఇల్లు సందడిగా మారింది...అయితే ఈసారి బంధుమిత్రులతో కాకుండా..నా స్టూడెంట్స్తో.. నిరంతరం ఏదో ఒక సబ్జెక్ట్ విషయమై చర్చ జరుగుతూనే ఉండేది..దీని వలన నాకు ఉపయోగకరంగా ఉండటంతో పాటు..వాళ్ళకీ ప్రయోజనకారిగా ఉండేది..ఈ విధంగా ఓపక్క ఉద్యోగం చేస్తూనే..ఖాళీ సమయంలో నా ప్రిపరేషన్ కొనసాగించేవాడిని..
ఇది ఇలా కొనసాగుతుండగా..మా బంధువులలో నా పెళ్ళి..ఓ హాట్ టాపిక్ గా మారింది..ఏ శుభకార్యానికి వెళ్ళాలన్నా భయపడే వాడిని..మాట్లాడే వాళ్ళకి అయితే కొదవు లేదు గానీ..నిలబడి చేసే వాళ్ళు లేక..కొన్నాళ్ళు వాయిదా వేసుకున్నా..ఈలోగా నా మెయిన్సు పరీక్షలు సమీపించడంతో.. పూర్తి స్థాయిలో ప్రిపరేషన్ పైన దృష్టి సారించాను..సొంతంగానే ప్రిపేర్ అవడంతో ఎటువంటి ఒత్తిడి,అంచనాలు లేకుండా పరీక్షల్ని రాసి ఫలితాలకై ఎదురు చూడసాగాను.. అయితే నేను పడ్డ శ్రమకి నా తల్లిదండ్రుల దీవెనలు తోడై.. మొదటి ప్రయత్నం లోనే ఇంటర్వ్యూ కి సెలెక్టు కావడంతో..తరువాత దశకి సమయత్తమయ్యాను...
నా ఈ ప్రయాణం లో నా విద్యార్థులు ఎంతగానో సహకరించారు..వారందరికీ ఎంతగానో రుణపడి ఉన్నాను..అయితే నాతో పాటుగా వివిధ పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయిన వాళ్ళలో కొంతమందికి ప్రభుత్వోద్యోగాలకి ఎంపిక కావడం..నాకు మరింత బలాన్ని ఇచ్చింది..
24.02.2017