అంతులేని వ్యధ-7

అంతులేని వ్యధ-7 || ఫణీంద్ర కుప్పిలి

            నేను అక్కడ జరుగుతున్న హడావుడిని చూడటంతో..ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది..రొప్పుతూ రూంలోకి వెళ్ళా..అక్కడ ఉన్న సిబ్బంది ఒక్కసారిగా నన్ను చుట్టి ముట్టారు..' సర్..మీకోసమే చూస్తున్నాం..ఎక్కడికి వెళ్లిపోయారు మీరు?? పేషంట్ పరిస్థితి అస్సలు బాలేదు..అర్జెంట్ గా ఐ.సి.యూ కి షిఫ్ట్ చేయాలి..లేదంటే ప్రమాదం..' అని గుక్క తిప్పకుండా విషయాన్ని చెప్పేసింది ఒక సిస్టర్..నేను అసలేం జరిగింది అని అడిగేలోపే...' మీరు అర్జెంట్ గా ఈ పేపర్స్ పైన సంతకం చేయండి..పేషంట్ పరిస్థితి ప్రమాదకరంగా ఉంది' అంటూ..ఒక కన్సెంట్ లెటర్.. పెన్నూ..నా చేతిలో పెట్టారు..' స్టాఫ్.. నేను అమ్మ వైపు ఒకసారి చూశాను.. నిజంగానే చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది.. నేను మారు మాట్లాడకుండా సంతకం పెట్టి ఇచ్చేశా..వెంటనే అమ్మని ఐ.సి.యూ కి షిఫ్ట్ చేసేశారు..

                     ఐ.సి.యూ లోకి నన్ను అనుమతించక పోవడంతో..అక్కడే బయట ఉన్న ఒక బెంచీపై కూలబడ్డా..నాకంతా అయోమయంగా ఉంది..అసలు నేను డిశ్చార్జి పనుల కోసం అమ్మకి చెప్పి ఇలా బయటికి వెళ్లి ఓ అరగంట కూడా అయిందో? లేదో.. అమ్మ పరిస్థితి ఒక్క సారిగా తలకిందులైంది.. అప్పటి వరకూ చక్కగా లేచి తిరిగిన అమ్మకి సడెన్ గా ఏమయిందో.. అసలు ఎంత ఆలోచించినా అర్థం కాలేదు..అమ్మని ఆ పరిస్థితుల్లో చూడటంతో నేను అసలు దాని గురించి ఆలోచించే స్థితిలో అప్పుడు లేను..అందుకే ' ఏది అవసరమో అది చేయండి..ఎలాగైనా అమ్మని బ్రతికించండి' అని డాక్టర్లని దాదాపు ఏడుపులాంటి గొంతుతో అర్థించాను..

         అటువంటి పరిస్థితుల్లో నేనే కాదు.. సాధారణంగా ఎవరూ కూడా అంతకు మించి చేయగలిగింది ఏమీ ఉండదు.. అసలు అతిపెద్ద సమస్య ఏంటంటే..సాధారణంగా మనకు ఆ మెడికల్ టెర్మినాలజీ పై అవగాహన ఉండకపోవడం.. పేషంట్ కి ఏమి జరుగుతుందో అన్న భయం.. ఎలాగైనా కాపాడుకోవాలన్న ఆరాటం.. ఇంచుమించుగా అందరిలోనూ ఇటువంటి బలహీనతే ఉంటుంది.. ఇక్కడే కార్పోరేట్ ఆసుపత్రుల యాజమాన్యం సొమ్ము చేసుకునేది..మన భయమే..వాళ్ళ బలం..పెట్టుబడి..అయితే మా అమ్మ విషయంలో..ఏదన్నా వాళ్లు కావాలనే చేశారో లేదా నిజంగానే సడెన్ గా బాలేదో..ఆ పాపం..పుణ్యం..ఆ పైవాడికే తెలియాలి..

            ఇలా నా మనసు పరి పరి విధాలా ఆలోచిస్తోంది...ఇంకోవైపు..లోపల అమ్మ పరిస్థితి ఎలా ఉందో అన్న భయం..బాధ నన్ను ఆకలి దప్పికలకి దూరం చేస్తోంది.. ఎవరో ఆసుపత్రి సిబ్బంది నా దగ్గరికి వచ్చి ' సర్..మీరు ఫలానా పేషంట్ తాలూకానా? ' అని మా అమ్మ పేరు చెప్పు అడగటంతో.. నేను ఈ లోకంలోకి వచ్చా.. ' హా..అవును.. నేనే..' అని చెప్పి..' మా అమ్మకి ఎలా ఉంది? అసలేమయింది..' అని ఆదుర్దాగా అడిగా.. దానికి అతను..' ఏమో నాకు తెలియదు సర్..నేను బిల్లింగ్ డెస్క్ నుండి వచ్చా..మాకు ఆ విషయాలు తెలియవు..' అని ఒక్క క్షణం ఆగి ' పేషంట్ కి ఐ.సి.యూ కి షిఫ్ట్ చేశారు కదా..ఆ అమౌంట్ విషయమే మాట్లాడటానికి వచ్చా సర్..' అని చెప్పాడు..నాకు ఇది వరకే అనుభవం ఉండటంతో.. కళ్లతోనే ' ఎంత పే చేయాలి' అని అడిగా..అతను ఒక స్లిప్ ని నా చేతిలో పెట్టి..' సాయంత్రం లోగా పే చేసేయండని..' చెప్పి వెళ్ళిపోయాడు.. ఇపుడు ఆ డబ్బులు ఎలా కట్టాలా?? మాట సాయానికి కూడా ఆమడ దూరంలో ఉండే బంధువుల్ని ఎలా అడగాలా??అని అనుకుంటూ..మా చెల్లెలి మామయ్య గారికి కాల్ చేశా..

12.03.2017

పాప్యులర్ పోస్టు

ఎన్ని'కల' భోజనంబు | ఫణీంద్ర కుప్పిలి

మొబైలోపాఖ్యానం

(అ)పుత్రస్య గతిర్నాస్తి..