చిత్తు చేసిన మత్తు
చిత్తు చేసిన మత్తు | ఫణీంద్ర కుప్పిలి
ఎటు చూసినా నైరాశ్యపు చీకట్లు కమ్ముకుని ఉన్న ఆ చిన్న గదిలో..ఒక మూలగా ఉన్న కుక్కి మంచం పై ఒక శవంలా పడున్న మనిషి మెల్లగా మూలుగుతున్నాడు.. కనీసం ఏడవడానికి సైతం శక్తి లేక దీనంగా ఆ మంచం వైపు నిస్తేజంగా చూస్తున్నాయి ఓ జత నడి వయసు కళ్ళు.. బాగా మాసిపోయిన ఆ గోడలపై కొన్ని వస్తువులు గత వైభవానికి మూగ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.. అతను బాధతో మూలుగుతున్నప్పటికీ.. తాను ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి..ఇలా ఎడ తెరిపిలేకుండా కొనసాగుతున్న నిశ్శబ్ధాన్ని చేదిస్తూ..' అమ్మా..' అన్న అరుపు లాంటి పిలుపుతో ఒక్కసారి ఉలిక్కిడిన ఆమె..తన శక్తినంతా కూడదీసుకుని బలవంతంగా లేచి..పెరటి వైపు పరిగెత్తింది..
చినిగిన బట్టలతో.. సరైన తిండిలేక వయసుకు తగిన ఎదుగుదల లేక.. బలహీనంగా..మొత్తం ఒళ్ళంతా దుమ్ము పేరుకుపోయి..ఎంతో దయనీయంగా కనిపిస్తోన్న..ఓ పన్నెండేళ్ల పిల్ల..ఒక ఆవుని గుంజకి కట్టే ప్రయత్నంలో.. దాన్ని ఆపలేక క్రిందపడి..బాధతో కేకలేస్తోంది..ఆమె పరుగెత్తికెళ్లి తొక్కేయబోతున్న కూతుర్ని పక్కకునేట్టే ప్రయత్నం చేసింది..దెబ్బ తగిలిన ఆ పిల్లని తన గుండెలకు హత్తుకుని ఒక్కసారిగా కన్నీళ్లపర్యంతమైంది..
ఆ పిల్ల అంత బాధలోను..అమాయకంగా తన తల్లిని అడుగుతోంది..'..అమ్మా..నేను మళ్ళీ ఎపుడు బడికి వెళ్తాను..' అని..ఏమి సమాధానం చెప్పాలి తెలీక..'.దెబ్బ తగిలిందా తల్లీ..పద ఏదన్నా తిందువు కానీ.. పొద్దున్నుంచి ఏటీ తినలేదు..ఒట్టి కడుపుతో ఉన్నావు..' అంటూ మాటమార్చే ప్రయత్నం చేసింది..అప్పటికైతే.. ఎలాగో దాటవేసింది గానీ.. తన కూతురి ప్రశ్న..బుర్రలో జోరీగలా తిరుగుతోంది.. ఒక్కసారిగా గతం తన కళ్ల ముందు కదలాడింది..
* * * *
తన భర్త పెద్దగా చదువుకోనప్పటికీ.. తనకున్న ఐదెకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ..ఓ నాలుగు ఆవుల్ని పెంచుకుని.. వాటి పాలను ఊరిలో అమ్ముతూ..హాయిగా బ్రతికేవాడు.. స్వతహాగా మంచి మనస్తత్వమున్న వ్యక్తి కావడంతో.. ఊర్లో అందరికీ నోట్లో నాలుకలా మెలిగేవాడు..అంతే కాకుండా తన తల్లిదండ్రులు కూడా నచ్చడంతో.. పెళ్లికి తలూపింది..చక్కగా ఇద్దరు పిల్లలతో హాయిగా సాగిపోతున్న కాపురం చూసి విధి కి కన్ను కుట్టిందెమో.. ఎపుడూ పొలమూ.. ఇల్లు.. పిల్లలు తప్పితే వేరే లోకం తెలియని అతను.. స్నేహితులతో కలిసి సరదాగా పండగలకి..పబ్బాలకి తాగడం మొదలు పెట్టాడు..
మొదట్లో తాగినపుడల్లా..మొగుడితో గొడవ పడేది....'ఎందుకు మావా? కొత్తగా ఈ తాగుడు అలవాటు? పిల్లలు కూడా పెద్దోళ్ళు అవుతున్నారు..' అని అనేది.. అతను మాత్రం '..నేనేమన్నా రోజూ తాగుతున్నానా? ఎపుడో సరదాగా తప్పితే.. నువ్వేం భయపడకే..నేనేమీ తాగుబోతుని అయిపోను..' అంటూ కసురుకునేవాడు.. లోలోపల ఎక్కడ తాగుడికి బానిస అయిపోతాడో అన్న భయం ఉన్నప్పటికీ.. తననీ.. పిల్లల్నీ ఎంతో ప్రేమగా చూసుకునే వాడు కావడం తో..తాను అతిగా ఊహించుకుని భయపడుతున్నానేమో అని సర్ది చెప్పుకునేది..
కొన్నాళ్ళకి పండగలు..పబ్బాలకి తాగడం కాస్తా..ఏ చిన్న సందర్భం వచ్చినా తాగడం మొదలు పెట్టాడు.. తాగినపుడల్లా తను ఎంతగానో బాధపడేది. అయితే పిల్లల ముందు తగువులాడుకోవడం మంచిది కాదని తనలో తానే బాధపడేది..తన బాధని చూసైనా తన మొగుడు తాగుడు మానేస్తాడని.. మెల్లగా సరదా కాస్తా అలవాటుగా మారడంతో.. రోజూ ఇంటికి పూటుగా తాగొచ్చి పడుకునేవాడు..ఒక వైపు దొరికిన కాడికి అప్పుచేసి తాగుడికి తగలెయ్యడంతో పాటు మరోవైపు ఏటికేడు వ్యవసాయం కూడా కలిసి రాకపోవడంతో ఊరంతా అప్పులు పాలయ్యారు..అయితే పాల వ్యాపారంతో ఎలాగోలా కూటికి, గుడ్డకి లోటు లేకుండా ఇంటిని మెల్లగా నెట్టుకొస్తోంది..
వేలకోట్ల రూపాయల్ని ఎగ్గొట్టినోళ్ళను.. చూసి చూడనట్లు వదిలేసే బ్యాంకులు.. వ్యవసాయం కలిసిరాక అప్పును తీర్చలేకపోయిన రైతుని మాత్రం అమానుషంగా వేధిస్తూ ఉండటంతో.. ఆ బాధని తట్టుకోలేక.. వడ్డీలు కట్టుకోలేక.. కొంతమంది రైతులు ఆత్మహత్యలకు సైతం పాల్పడటం మనం రోజూ చూస్తున్నదే..
ప్రభుత్వ పథకాలను సైతం నేతలు.. సొంతోళ్లకే దోచిపెట్టడంతో.. చిన్న రైతు ఎప్పటిలాగే వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాలలో చిక్కుకోవలసి వస్తోంది..
అయితే ఆదృష్టం కొలదీ ఇతనికి కొంచెం భూమి ఉండటంతో..ఆత్మాభిమానం చంపుకోలేక.. ఆ పొలంలో కొంత భాగాన్ని అమ్మి అప్పులు తీర్చాడు..
ప్రభుత్వ పథకాలను సైతం నేతలు.. సొంతోళ్లకే దోచిపెట్టడంతో.. చిన్న రైతు ఎప్పటిలాగే వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాలలో చిక్కుకోవలసి వస్తోంది..
అయితే ఆదృష్టం కొలదీ ఇతనికి కొంచెం భూమి ఉండటంతో..ఆత్మాభిమానం చంపుకోలేక.. ఆ పొలంలో కొంత భాగాన్ని అమ్మి అప్పులు తీర్చాడు..
బాధ్యతల్ని పూర్తిగా వదిలేసిన తన భర్త.. బాధల పేరుతో.. పూర్తిగా తాగుడికి బానిసయ్యాడు.. చూస్తుండగానే.. తన కలల సౌధం కుప్పకూలిపోతోంది.. చివరికి ఇల్లు కూడా గడవని పరిస్థితి తలెత్తడంతో.. తాను కూలీ పనులకు వెళ్లడం మొదలు పెట్టింది.. తన మొగుడు తాగి.. రోజూ లేనిపోని రభస చేస్తుండేవాడు.. దాంతో పిల్లలు సైతం తండ్రికి దూరం కాసాగారు.. తన భర్త ఇక తాగుడు మానడనే విషయం అర్థమయ్యేసరికి.. కనీసం పిల్లల్ని అయినా బాగా చదివించి.. ప్రయోజకుల్ని చేయాలని..వాళ్ళని బడికి పంపించి..ఇంటి పని..ఆవుల కింద చేసుకుని..కూలీ పనికెళ్ళేది..ఎలాగో భారంగా నెట్టుకొస్తున్న ఆ ఇంటికి మరో పెద్ద దెబ్బ.. భర్త అనారోగ్యం రూపంలో పంజా విసిరింది..
విపరీతంగా తాగటం వలన.. ఆరోగ్యం పూర్తిగా చెడిపోవడంతో..ఆసుపత్రుల చుట్టూ తిరగవలసి వచ్చింది..ఉన్న ముక్క..చెక్కని సైతం అమ్ముకోవలసి వచ్చింది..అయినా కూడా తిరిగి మాములు మనిషి కాలేదు.. పూర్తిగా మంచం పట్టేశాడు.. ఇపుడు మొగుడి కింద కూడా అన్ని పనులు చేయవలసి రావడంతో..ఆమె ఆరోగ్యం కూడా మెల్లగా క్షీణించ సాగింది..
దాంతో విధిలేని పరిస్థితుల్లో..ఇద్దరు పిల్లల్ని బడి మానిపించేసి..కొడుకుని ఒకరి వద్ద పనికి కుదిర్చింది..కూతుర్ని మాత్రం తనకి సాయంగా ఇంట్లోనే ఉంచుకుంది.. హాయిగా ఆడుతూ.. పాడుతూ.. బడికెళ్లి చదువుకోవాల్సిన వయస్సులో.. తన మొగుడి వ్యసనం తనని నిస్సహాయ స్థితిలోకి నెట్టేసింది..
'..అమ్మా..నన్ను ఎప్పటి నుంచి మళ్ళీ బడిలోకి పంపిస్తావ్?..' అని ఆ చిన్న పిల్ల గట్టిగా ఏడుస్తూ అడగడంతో.. తెలివి తెచ్చుకుని తాను ఈలోకం లోకి వచ్చింది.. పిల్లల విషయంలో తాను ఒక నిర్ణయానికి రావడంతో..ఇపుడు తన మొహంలో అంతకు ముందున్న నిరాశ నిస్పృహలు కొంత వరకు దూరమయ్యాయి.. 'నిన్ను..అన్నయ్యని.. తొందరలోనే బడికి పంపిస్తాను..'అని చెప్పడంతో..ఆ చిన్నారి కళ్ళు ఆనందంతో ఒక్కసారిగా మెరిశాయి..
6 ఆగష్టు, 2017.