నా మనసు
నా మనసు | ఫణీంద్ర కుప్పిలి
నైరాశ్యం కమ్ముకున్న
నా మనసులోని ఆలోచనలు..
దారం తెగిన గాలిపటంలా..
ఒక గమ్యమంటూ లేకుండా సంచరిస్తున్నాయి..
అనుకోకుండా రేపటి ఆశల
పచ్చని చిగురు కొమ్మకి తగుల్కొని..
సగమాకాశంలో
కొట్టుమిట్టాడుతున్నాయి..
ఇంతలో..
చిమ్మ చీకటిని చీల్చుకుంటూ
వచ్చి పలకరించిన
ఉదయ భానుడి లేత తొలి కిరణాన్ని
ఆలంబనగా చేసుకుని
అనంతమైన విశ్వ వీధిలో
మునుముందుకు దూసుకుపోవాలని..
ఇపుడు ఆత్రంగా ఎదురు చూస్తోంది
నా మనసు..
27.05.2017
నైరాశ్యం కమ్ముకున్న
నా మనసులోని ఆలోచనలు..
దారం తెగిన గాలిపటంలా..
ఒక గమ్యమంటూ లేకుండా సంచరిస్తున్నాయి..
అనుకోకుండా రేపటి ఆశల
పచ్చని చిగురు కొమ్మకి తగుల్కొని..
సగమాకాశంలో
కొట్టుమిట్టాడుతున్నాయి..
ఇంతలో..
చిమ్మ చీకటిని చీల్చుకుంటూ
వచ్చి పలకరించిన
ఉదయ భానుడి లేత తొలి కిరణాన్ని
ఆలంబనగా చేసుకుని
అనంతమైన విశ్వ వీధిలో
మునుముందుకు దూసుకుపోవాలని..
ఇపుడు ఆత్రంగా ఎదురు చూస్తోంది
నా మనసు..
27.05.2017