అభివృద్ధి పొరలు
అభివృద్ధి పొరలు| ఫణీంద్ర కుప్పిలి
నాలుగు మెతుకులు కోసం
రెండు అక్షరం ముక్కల కోసం
అలమటిస్తున్న అభాగ్యుల ఆక్రందనలు..
హోరెత్తిస్తున్న అభివృద్ధి మంత్రోచ్చారణలో
అరణ్య రోదనలుగా మిగులుతున్నాయి..
నేలని నమ్ముకుని బతికే అన్నదాత..
ఆ నేలలోనే నిశ్శబ్దంగా కలిసిపోతుంటే..
అభం శుభం ఎరుగని చిన్నారులు
కళ్ళు తెరవక ముందే కన్ను మూస్తుంటే..
వెలిగిపోతోందన్న భారతావని
అంకెల అభివృద్ధి తళుకు బెళుకులు
నాకు కనిపించడం లేదు..
బహుశా నాకంటికి ఇంకా..
అభివృద్ధి భ్రమల పొరలు కమ్ముకోలేదేమో..
నాలుగు మెతుకులు కోసం
రెండు అక్షరం ముక్కల కోసం
అలమటిస్తున్న అభాగ్యుల ఆక్రందనలు..
హోరెత్తిస్తున్న అభివృద్ధి మంత్రోచ్చారణలో
అరణ్య రోదనలుగా మిగులుతున్నాయి..
నేలని నమ్ముకుని బతికే అన్నదాత..
ఆ నేలలోనే నిశ్శబ్దంగా కలిసిపోతుంటే..
అభం శుభం ఎరుగని చిన్నారులు
కళ్ళు తెరవక ముందే కన్ను మూస్తుంటే..
వెలిగిపోతోందన్న భారతావని
అంకెల అభివృద్ధి తళుకు బెళుకులు
నాకు కనిపించడం లేదు..
బహుశా నాకంటికి ఇంకా..
అభివృద్ధి భ్రమల పొరలు కమ్ముకోలేదేమో..