అంగడి

అంగడి|ఫణీంద్ర కుప్పిలి


సుడులు తిరుగుతున్న కన్నీళ్ళని
కళ్ళ కాటుక వెనుక దాచిపెట్టి..
మెలిపెడుతున్న బాధని..
మనసులోనే పాతరేసి..

పరిస్థితుల ఉరికంభానికి 
వేలాడుతున్న మనసుని..
మరోమారు ఉరి తీసి..

ఓ విరిగిన నవ్వును..
పాలిపోయిన మొహం పై రువ్వుకుని..
మరోసారి తన తనువుని కుదువ పెట్టడానికై..
తడి ఆరిన కళ్ళతో ఎదురు చూస్తోంది..


పాప్యులర్ పోస్టు

నాలోనే దారి | ఫణీంద్ర కుప్పిలి

గుండె లోతుల్లో | ఫణీంద్ర కుప్పిలి

డెత్ బెడ్ | ఫణీంద్ర కుప్పిలి