పాపం ఓటరు


పాపం ఓటరు..| ఫణీంద్ర కుప్పిలి


శతాబ్దాల బానిసత్వాన్ని తెంచుకుని..
తన ఓటుతో..తల రాతను తిరగ రాసేస్తాననుకుని..
తెగ సంబర పడిపోయిన సగటు ఓటరు..
తెల్లోడు తగిలించి పోయిన..
విభజించి పాలించు సిద్ధాంతాన్ని త్రికరణ శుధ్ధిగా
పాటిస్తున్న మన నల్ల దొరలు..
కులాలుగా.. మతాలుగా..
ప్రాంతాలుగా..వేష భాషలుగా..
చివరికి తినే తిండితో సహా..
అందరినీ విడదీసి..దేశభక్తి పేరుతో కలిపేసి..
అంకెలలో అభివృద్ధిని..
ఉపన్యాసాల్లో దేశభక్తిని..
పొంగి పొర్లించే (అ)రాచకీయ నాయకులూ..
ఫెళ ఫెళ లాడే హామీలతో..
అమలు కానీ పథకాలతో..
నమ్మకాన్ని వమ్ము చేసి 'హ్యండ్' ఇచ్చింది ఒకరైతే..
బొట్టు పెట్టి మరీ చెవిలో పువ్వు పెట్టింది మరొకరు..
అందాల మెక్కించడానికి సిద్ధంగా ఉన్నా..
అంది పుచ్చుకోలేని అసమర్థ మేధావులు..
పాపం సగటు ఓటరు..
అనుక్షణం తాను ఓడిపోతూ..
ప్రజాస్వామ్యాన్ని గెలిపిస్తున్నాడు..
11.02.2018


పాప్యులర్ పోస్టు

ఎన్ని'కల' భోజనంబు | ఫణీంద్ర కుప్పిలి

(అ)పుత్రస్య గతిర్నాస్తి..

మొబైలోపాఖ్యానం