జీవచ్ఛవం


జీవచ్ఛవం|ఫణీంద్ర కుప్పిలి


శరీరం నిండా గాయాలతో
మాంసపు ముద్దలా కూలబడిన
ఆ జీవచ్ఛవం...

కంటిబాయిల నుండి ఉబికి వస్తున్న కన్నీళ్ళు.
మనసు ముక్కలై ఏరులుపారుతున్న బాధ...
ఏడ్వడానికి సైతం ఓపికలేని దైన్యం...
సహజ న్యాయానికి విరుద్ధంగా...
తప్పొకడిది శిక్ష ఒకరికి...

భరతమాత,గోమాత..
ప్రకృతిలో ప్రతిదాంట్లో మాతృత్వాన్ని
మాటల్లో కీర్తించే మన సంస్కృతి...
పేరు గొప్ప..ఊరు దిబ్బ అని...

పువ్వులాంటి సుకుమారమైన
స్త్రీల మనసుల్ని మానభంగం చేసి
శరీరాల్ని ఛిద్రం చేసి
స్త్రీలని గొప్పగా కీర్తించగలిగే...
నయవంచక పురుషాధిక్య సమాజం..

అడుగు బయట పెడితే చాలు...
నిరంతరం వెంబడించి వేధించే...
అణువణువూ శోధించే మానవ నిఘానేత్రాలు..
అడుగడుగునా అడ్డుతగిలే మానవ మృగాళ్ళు...
అర్ధ రాత్రి కాదుకదా...
పట్టపగలు సైతం స్వేఛ్చగా తిరగలేని
ఏడుదశాబ్ధాల అర్థరాత్రి స్వాతంత్ర్యం...
మహిళల వస్త్రధారణపై విరుచుకుపడే
మగమహారాజులకి..
ఆరేళ్ళ పసిపాపలో చూసే అశ్లీలత ఏమిటో??

ఏదైన ఒక సంఘటన జరిగినపుడు..
హోరెత్తించే టివిల లైవ్ షోలు
కొవ్వొత్తు ర్యాలీలు...

మరలా..
యధేచ్చగా కొనసాగుతున్న..
మదమెక్కిన పశువికట్టహాసం...
అసలు మగాళ్ళు మృగాళ్ళుగా
మారడానికి గల మూలకారణమేంటి??
మూలాల్ని శోధించకపోతే...
మరో సంచలన వార్తతో తెల్లారుతుంది...
మరో గుండెపగిలే రోదనలతో పొద్దుగూకుతుంది...

  25.07.2016

పాప్యులర్ పోస్టు

ఎన్ని'కల' భోజనంబు | ఫణీంద్ర కుప్పిలి

(అ)పుత్రస్య గతిర్నాస్తి..

మొబైలోపాఖ్యానం