స్వర్గం-నరకం
స్వర్గం-నరకం | ఫణీంద్ర కుప్పిలి
తాను ఖర్చు పెట్టే ప్రతీ రూపాయికి గరిష్టంగా లాభం పొందాలని.. ప్రతీ చిన్నదానికీ విపరీతంగా క్యాలిక్యులేషన్లు వేసి.. డిస్కౌంట్ కోసం ఆషాఢంలో బట్టలు కొనుక్కునే ఒక మధ్య తరగతి సుబ్బారావు.. హఠాత్తుగా ఓరోజు మంచాన పడ్డాడు..తాను పోతానని తెలిసీ.. చివరి క్షణంలో 'హరీ' అంటూ చచ్చాడు..
సాధారణంగా తన జీవితకాలంలో.. పుణ్యాన్ని కొనుక్కునే స్థోమత లేక పోవడంతో పాటు..తన ఎదుగు బొదుగూ లేని జీవితంతో విరక్తి చెంది..చాలా సార్లు దేవుడిని చెడ మడా తిట్టడం వలన..ఇటీవల కాలంలో స్విస్ బ్యాంకులో గుట్టలు గుట్టలుగా పేరుకు పోయిన నల్ల కట్టలు మాదిరి, సుబ్బారావు పాపం కూడా కొండలా పెరిగిపోయింది..
దాంతో పాపుల చిట్టాపద్దు చూసే చిత్ర గుప్తుడు..ఈమధ్య తరగతి మహా పాపి.. పాపాల చిట్టా విప్పేసరికి.. అప్పటికే అదిరిపోయే బాహుబలి కలెక్షన్లలా పెరిగిపోతున్న పాపుల రికార్డ్ కి ఒకింత విజయగర్వంతో మీసం మెలేసిన యముడు.. అర్జెంట్ గా ఆ పాపిని ఉన్నపళంగా తీసుకు రమ్మని ఆర్డర్ ఏసేయడంతో 'యమ కింకరులు మన సుబ్బారావు ని తీసుకెళ్లడానికి ప్రత్యక్షమయ్యారు..
కానీ చచ్చే ముందు.. 'హరీ' అంటూ మరీ చావడంతో.. అప్పటి వరకు చేసిన పాపాలన్నీ.. 'ప్రభుత్వం మారగానే ఒక్క కలం పోటుతో రద్దయిపోయే సి.బి.ఐ కేసుల్లాగా..' అన్ని పాపాలు రద్దయిపోయి.. 'స్వర్గం ఎంట్రన్స్ టెస్ట్' లో ఆల్ లోకాల టాప్ ర్యాంకు సాధించేసాడు.. ఆ ఘనత మాదే నంటూ ఒకే రోజు పలువురు అచ్చేసుకోవడం మరో తంతు.. దాంతో సదరు సుబ్బారావు ని స్వర్గానికి తీసుకెళ్లడానికి 'దైవదూతలూ' ప్రత్యక్షమైపోయారు..
ఈ హఠాత్పరిణామం తో బిక్క చచ్చిన 'సుబ్బారావు ఆత్మ'☺️ ..స్వర్గం..నరకాలలో ఎక్కడికెళ్ళాలో తేల్చుకోలేక తటపటాయించసాగింది.. అప్పటికే పైన తిరుగుతున్న చాలా మందిని కన్సల్ట్ చేసి.. బెస్ట్ ఆఫర్ కోసం తెగ క్యాలిక్యులేషన్లు వేసుకున్న తర్వాత.. ఒకసారి రెండింటినీ చూసి.. అపుడు డిసైడ్ చేసుకుంటానని.. షాపులో సేల్స్ మ్యాన్ కి చెప్పిన స్టైల్లో లో వారిద్దరికీ చెప్పాడు..చేసేదేమీ లేక అందుకు వాళ్ళు ఒప్పుకున్నారు..
తన చిన్నప్పటి నుండీ అందరూ విపరీతంగా భయపెట్టే 'నరకం' ఎలా ఉంటుందో ముందుగా చూస్తానని చెప్పడంతో యమ కింకరులు సుబ్బారావుని నరకం ఎంట్రన్స్ దగ్గరికి తీసుకుపోయారు.. ఏదేదో ఊహించుకుంటూ వెళ్లిన సుబ్బారావుకి అక్కడ.. మాంచి మాస్ మసాలా పాటలతో.. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ రోజు సినిమా హాళ్ల ముందుండే పండగ వాతావరణాన్ని చూసే సరికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది.. ఆదివారం సాయంకాలం రామకృష్ణ బీచ్‌లో లా...ఇసుక వేస్తే రాలనంత జన సందోహం అక్కడ కనపడేసరికి..అసలు అక్కడే ఉండిపోదామనుకున్నాడు.. కానీ తన మధ్య తరగతి మెంటాలిటీ కొద్దీ.. ఇక్కడే ఇంత ఫెస్టివ్ మూడ్ ఉంటే..తన చిన్నప్పటి నుండి కథలు కథలుగా వింటూ వస్తున్న స్వర్గం ఇంకెంత గ్రాండ్ గా వుంటుందో అని అనుకుంటూ.. "ఇపుడు స్వర్గానికి వెళదాం" అని చెప్పడంతో.. మన సుబ్బారావు ని స్వర్గం దగ్గరికి తీసుకుపోయారు దైవ దూతలు..
విపరీతమైన ఎక్స్పెక్టేషన్లతో రిలీజ్ రోజు సినిమా కెళితే.. సగంలోనే బాదుడు తట్టుకోలేక.. బ్రతుకు జీవుడా అంటూ బామ్ తో బయకొచ్చినోడి లాగా.. స్వర్గం ఎంట్రన్స్ చూసి తీవ్రమైన డిప్రెషన్ కి గురయ్యాడు సుబ్బారావు...
ఏషియన్ పెయింట్స్ కాకపోవడంతో వెలిసిపోయాయా అన్నట్లున్న పాత గేట్లు.. ఎన్నో యుగాలుగా డ్యాన్స్‌లు చేసి చేసి ముసలైపోయి.. నడుము నొప్పితో కదలలేకుండా మూల చేరిన రంభ.. ఉర్వసి.. మేనకలు🤣🤣 ..ఎవరైన పెద్దోళ్ళు పోయినపుడు వారం రోజులపాటు దూరదర్శనులో విసిగించే నస మ్యూజిక్కు..
వోల్ మొత్తంగా..డిపాజిట్ కోల్పోయిన రాజకీయనాయకుడి ఇల్లులా బోసిపోయి ఉంది.. దాంతో చచ్చినా కూడా "చావని" మధ్యతరగతి మెంటాలిటీ.. మన సుబ్బారావు లో నాగు పాములా బుసకొట్టడంతో.. మరలా తనదైన స్టైల్లో క్యాలిక్యులేషన్లు వేసుకున్న తర్వాత.. ఫైనల్ గా నరకానికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు.. రేయింబవళ్లు చదివి ఐ.ఐ.టి లో సీటు సాధించిన మన చైనా బ్యాచ్ కుర్రోడిలా ఒకింత విజయ గర్వంతో.. టిప్ టాప్ గా తయారయి నరకంలోకి అడుగు పెట్టాడు..
గేటు దాటి కొంత దూరం లోపలకెళ్లే సరికి అక్కడ సీనియర్లు..ఫ్రెషర్స్ ని ర్యాగింగ్ చేస్తున్నట్లుగా.. భయంకరమైన దృశ్యాలు కనపడే సాగాయి.. ఇంకాస్త లోపలకెళ్లేసరికి.. మన అపరిచితుడు సినిమాలో చూపించినట్లుగా 'కుంభీ పాకం',
'క్రిమి జంభో' లాంటి సీన్లు కనబడే సరికి.. తన కళ్లు.. తనని మోసం చేశాయని తెలుసుకున్న సుబ్బారావు..' ఇది మోసం.. దగా అని అరవడం తో..' పక్కనే నడుస్తున్న యమకింకరులు.. 'ఇందులో మోసమేముంది? లక్ష కడితే..ఏడాది తిరక్కుండానే రెండు లక్షలు ఇస్తామంటే.. ఎగబడి కట్టేస్తారు.. అలాంటిది... మేమేదో మా బిజినెస్ కోసం ఆపాటి బిల్డ్ అప్ ఇస్తే ఓ అరచి గోలచేస్తున్నావ్..' అని చెంప ఛెళ్లు మనిపించడంతో.. కరెంట్ షాక్ కొట్టిన కాకిలా గిల గిలా కొట్టుకుని కింద పడ్డాడు సుబ్బారావు😁🤣
'క్రిమి జంభో' లాంటి సీన్లు కనబడే సరికి.. తన కళ్లు.. తనని మోసం చేశాయని తెలుసుకున్న సుబ్బారావు..' ఇది మోసం.. దగా అని అరవడం తో..' పక్కనే నడుస్తున్న యమకింకరులు.. 'ఇందులో మోసమేముంది? లక్ష కడితే..ఏడాది తిరక్కుండానే రెండు లక్షలు ఇస్తామంటే.. ఎగబడి కట్టేస్తారు.. అలాంటిది... మేమేదో మా బిజినెస్ కోసం ఆపాటి బిల్డ్ అప్ ఇస్తే ఓ అరచి గోలచేస్తున్నావ్..' అని చెంప ఛెళ్లు మనిపించడంతో.. కరెంట్ షాక్ కొట్టిన కాకిలా గిల గిలా కొట్టుకుని కింద పడ్డాడు సుబ్బారావు😁🤣