Vegetarians only

Vegetarians only..| ఫణీంద్ర కుప్పిలి

గత నాలుగు రోజులుగా అద్దె ఇల్లు కోసం వైజాగ్ పట్టణంలో గల్లీ గల్లీ తిరుగుతున్నా.. నిజంగా ఒక పోస్ట్ మెన్ కూడా నేను తిరిగినంతగా తిరగదేమో.. ఫ్లాట్ సంగతి దేవుడెరుగు కానీ.. నేటికీ..అదీ సిటీలో బాగా చదువుకుని..పెద్ద పెద్ద ఉద్యోగాలు వెలగబెడుతున్న వారు సైతం ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారో బాగా తలకెక్కింది..

టు-లెట్ బోర్డ్ చూసి..అద్దెకిస్తారేమో అని ఫోన్ చేస్తే..ఒకడు మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు ? మీ అమ్మా నాన్నల మీతో ఉంటారా? అని ఒకడు అడిగితే..ఇంకొకడు మీరు ఏ ఉద్యోగం చేస్తారు? ప్రయివేటా? గవర్నమెంటా? అని వాకబు చేస్తాడు.. మరికొంతమంది..తెగ మోహమాటాన్ని నటిస్తూ.. నాపేరుని అడగటం ద్వారా..నేను ముస్లిం కాదని నిర్ధారించుకుంటాడు.. ( మనం ఎపుడూ గెడ్డంతో 👹 దర్శనం ఇవ్వటం వలన కాబోలు)..
మరొకడు.. నా ఇంటి పేరు బట్టి ఏ కులంలో తెలుసుకునే ప్రయత్నంలో పడతాడు..నిజానికి పెళ్లి సంబంధానికి కూడా అన్ని డిటయల్స్ ఆడగరేమో..

అసలుకే ఇల్లు వెతకలేక చస్తుంటే.. మధ్యలో ఈ వాస్తు గోడవొకటి..ఏ పేసింగ్? ఎన్ని కిటికీలున్నాయి? ఎన్ని ద్వారాలున్నాయి? ఎలెక్కలు గోలకి తెగపడినవి కొన్ని..అప్పటికే బాగా విసిగి వేసారిపోయి ఉన్న నాకు..అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్న ఏరియాలో ఒక ఇల్లుని చూసా.. అదృష్ట వశాత్తు..ఆ ఇంటి పేసింగ్ కూడా నాకు సరిపోతుందంట.. హమ్మయ్య..ఇక ఇల్లు చూడటమే లేటు..రెంటు కాస్త ఎక్కువైనా సరే.. దిగిపోదామని నేను బలంగా డిసైడ్ అయిపోయా.. చేసిన మొదటి సినీమాకే..నోబెల్ బహుమతి(...??😁😁😁😁) అచ్చినంత ఆనందమేసింది..ఆ స్వింగ్ లో అక్కడి వాచ్ మెన్ చెప్పిన విషయం నా చెవికెక్క లేదు.. మొత్తానికి ఆ ఫ్లాట్ కీస్ తీసుకుని..ఇల్లు మొత్తం కలియ తిరిగి చూసా.. మా ఆవిడ నా చెవిలో ఏదో రొద పెడుతున్నప్పటికీ పట్టించుకోకుండా.. ఏ సామాన్లు ఎక్కడా పెట్టాలో కూడా డిసైడ్ చేసేసుకున్నా..

చివరికి ఎంతో ఆనందంగా ఓనర్కి ఫోన్ చేసి.. ' ఎపుడు అడ్వాన్సు ఇమ్మంటారు' అని ఎంతో అదుర్దాగా అడిగా.. అవతలి ఆడ గొంతు..'ఇంతకీ మీరు టు-లెట్ బోర్డుని సరిగ్గా చూసారా..' అని అడిగింది.. ఆ చూశానండీ.. ' అదేమన్నా.. ఏ భాషలో చదివినా ఆర్త్గం కానీ సర్వీస్ కమిషన్ పేపరా?' అని నాలో నేను గొణుక్కుంటూ కళ్ళద్దాలని 😎సరి చేసుకుని .. టూ-లెట్ బోర్డు వైపు జూమ్ చేసి తీక్షణంగా చూసా..' ఒక్కసారిగా నా గుండె భళ్ళున పగిలింది💔💥..' చిన్న అక్షరాలలో.. ఇన్సూరెన్స్  బ్రోచర్లో కండిషన్లు అప్ప్లై అని పువ్వు గుర్తు పెట్టినట్లు..' vegetarians only..' వెక్కిరించింది..డైరెక్ట్ గా ఫలానా కులం వారికే అద్దెకిస్తాం అని రాయటానికి సంస్కారం(..😀 ఉంటే..) అడ్డొచ్చి...ఇలా శుచి ,శుభ్రతల పేరుతో కలరింగ్ ఇవ్వటం అన్నమాట...మనకేమో ముక్క లేకపోతే..ముద్ద దిగదాయే..' అయినా నా తిండితో ఆళ్ళకి పనేంటో.. అని ఉసూరమంటూ.. నా డొక్కు బండికి 😖కిక్కు కొట్టి..ఇంటి ముఖం పట్టాను..

P.S : నేను చెప్పిన ఫ్లాట్స్ లో ఓనర్స్ ఉండరు.. అలాగే ఆ ఫ్లోర్ లో మిగతా వాళ్లు అంతామాంసాహారులే.. ఎవరికీ ఎటువంటి ఇబ్బందీ లేదు..

పాప్యులర్ పోస్టు

ఎన్ని'కల' భోజనంబు | ఫణీంద్ర కుప్పిలి

(అ)పుత్రస్య గతిర్నాస్తి..

మొబైలోపాఖ్యానం