మొబైలోపాఖ్యానం
మొబైలోపాఖ్యానం..| ఫణీంద్ర కుప్పిలి.
సాయంత్రం స్కూల్ అయ్యాక రోడ్డు పై దుమ్ము ధూళిలో.. ప్రారంభోత్సవానికి రావాల్సిన మంత్రి గారి కోసం ఎదురు చూసే కార్యకర్తల్లా.. బస్సు🚌 కోసం ఎదురు చూస్తుంటాం.. యధావిధిగా రావాల్సిన టైముకి ఒక గంట లేటుగా వచ్చి..హడావుడి చేసే మంత్రి గారిలా సై(హ)రన్ మోగించుకుంటూ మునుషుల మీదకి దూసుకొచ్చే మన ప్రగతి చక్రం(గదేలెండి మన ఎర్ర బస్సు)పైకి.. ఎక్కడున్నారో గానీ..వరదలప్పుడు విసిరే పోట్లల కోసం ఎగబడినట్లు.. ఒక్కసారిగా చుట్టుముట్టారు.. ఆ రష్ లో నా కళ్లాభరణాలతో (అదేనండీ కళ్ళద్దాలు🤓) బస్సేక్కే సాహసం చేయలేక.. సంవత్సరమంతా వెనకాల తిప్పించుకుని.. శివరాఖరున రాఖీ కట్టి..అన్నయ్యా అని పిలిచినపుడు.. మనకు జీవితం మీద కలిగే..విరక్తి 🤒లాంటి ఫీలింగ్ తో.. ఉస్సురమంటూ మరో బస్సుకై ఎదురు చూస్తూ నిల్చున్నా...
మొత్తానికి ఎలాగోలా ఒక డొక్కు క్యాబ్ పట్టుకుని..రాత్రి 7.30కి కాళ్ళీడ్చుకుంటూ కొంపకి చేరి..కాలింగ్ బెల్ నొక్కా.. సాధారణంగా.. తలుపు తీయగానే.. మెలకువగా ఉంటే..మా బుడ్డోడు.. 'డాడు..డాడు' (వాడికింకా సరిగా మాటలు రావు..)అంటూ పరిగెత్తుకుంటూ 🏃వచ్చి..నా మెడకు నిచ్చెనేస్తాడు..దాంతో పగలంతా అరవటం వలన వచ్చిన నిస్సత్తువ.. నిత్యం జర్నీలో చూసే నరకం..జండూ బామ్ యాడ్ లో 'పోయిందే.. ఇట్స్ గాన్'😀 అన్నట్లు..ఒక్క క్షణంలో మటు మాయమయిపోతుంది.. కానీ ఆరోజు మాత్రం వాడు సీరియస్ గా టీ.వీ చూసుకుంటున్నాడు.. మావాడు ఫిదా పాటలకు కాస్త ఎక్కువగానే 'ఫిదా' అయిపోయాడు.. సాధారణంగా ఆ పాటలు వచ్చేటప్పుడు..కొంచెం ఎక్కువ కాంసెంట్రేషన్😀 తోనే చూస్తాడు..అలా నన్ను చూడలేదేమో అనుకుని..వెళ్లి టీ. వీ కి అడ్డంగా నిల్చున్నా..
మావాడు నన్ను ఏమాత్రం కూడా పట్టించుకోకుండా.. పక్కకు జరిగి మరీ టీ.వీ ని చూసుకుంటున్నాడు..ఆఖరికి ఉండబట్టలేక.. వాడిని ఎత్తుకుని ముద్దు చేసి మరీ..వాడి అటెన్షన్ పొందాలన్న నా ప్రయత్నం..బురదలో పోసిన పన్నీరైంది.. మరో పక్క నేను పడుతున్న తిప్పల్ని చూసి నా శ్రీమతి పడీ పడీ నవ్వుతోంది.. దాంతో ఒక్కసారిగా నాలో కోపంతో కూడిన నిస్సత్తువ ఆవహించి.. అసలేమయింది వీడికి అని ఆలోచనలో మునిగిపోయా..
* * *
ఎప్పుడూ తలెత్తుకు తిరిగే నేను😂😂(..నేను కొంచెం హైటు తక్కువ లెండి)..ఈ జుకర్ బెర్గోడి పుణ్యమా అని..తలెత్తుకోకుండా చేసాడు..మొదట్లో..అలా ఓసారి గోడ(వాల్) మీదెక్కి..ఓ నాలుగు టపాల్ని..టప టపా లైకేసి..గోడ దూకి నా పని నేను చూసుకునే వాణ్ణి..రాన్రాను నాక్కూడా నా నస పైత్యాన్ని అంతా రంగరించి ఓ నాలుగు ముక్కలు రాసి జనాల మీదకి వదలాలనే దుర్బుద్ధి పుట్టింది.. ఇహ అంతే.. మూడు పోస్టులు..ఆరు కామెంట్లతో యమా బిజీగా గడిచిపోయేది..
ఇలా ఒక్క నిద్దట్లో తప్ప..హమేషా..శివుని మెడలో పాము లాగా😕..నా చేతిలో మొబైల్ దర్శనమిచ్చేది..నాడు పుస్తకం హస్త భూషణం.. నేడు ఫోను హస్త భూషణం లా తయారయింది..మొదట్లో బాగా ఓపిక పట్టిన నా శ్రీమతి..రానురాను నా ఈ ముఖపుస్తక వ్యసనంతో విసిగి వేసారి పోయి..చేతిలో మొబైల్ లాక్కుని పోయేది..అలాగే ఖాళీ సమయం దొరికితే చాలు మా బుడ్డోడితో ఆడుకునే నేను..మెల్లగా వాడితో టైం స్పెండ్ చేయటం మానేశా..బహుశా ఒకటి రెండు సార్లు కసిరుంటానేమో కూడా😟(ఏమో ఎందుకు అంటున్నాను అంటే..ఆలోకంలో పడితే..బాడీ ప్రెజెంట్.. మైండ్ ఆబ్సెంట్ అన్నమాట..)
ఈ జుకరోడికి తోడు..వాట్సాప్ ఒకటి నా ప్రాణం మీదకి.. అదేదో అంబానీలా..నేనొక వంద కంపెనీ బోర్డుల్లో..(అదేనండీ వాట్సాప్ గ్రూప్స్ లో😊) డైరెక్టర్(..మెంబర్)..అలాగే నాకంటూ నేను స్థాపించిన(..క్రియేట్) చేసిన గ్రూప్స్ కి మేనేజింగ్ డైరెక్టర్ ని(..అదేనండీ అడ్మిన్ ని☺️☺️).. దాంతో.. మార్నింగ్ లేస్తూనే కళ్ళు పులుముకుంటూ ఏ దేవుడి ముఖమో.. లేదంటే కనీసం అరచేతులెనో చూసుకోకుండా.. మొబైల్ లో స్టేటస్ తో మొదలెట్టి..తేదీ మారిన తర్వాత..తెలుగు 'డాన్' తలగడా కింద గన్ను పెట్టుకున్నట్లు మొబైల్ పెట్టుకుని.. మగతగా నిద్రపోయేవాడిని..
మరి మా ఆవిడే ట్రైయింగ్ ఇచ్చిందో😷..లేదంటే ఆడికే చిరాకు దొబ్బిందో కానీ.. మొగుడి మీద కోపాన్ని..చొక్కా మీద చూపించి..బండకేసి బాదినట్లు..😁 వారం రోజుల వ్యవధిలో..ముచ్చటిగా మూడు సెల్ ఫోన్లను..గోడకేసి బాదేశాడు.. నాగుండెకి వరసగా మూడు సార్లు స్ట్రోక్ వచ్చినంత పనైంది😱😱...కనీసం పేపర్ వెయిట్ గా నైనా పెట్టుకుందామనుకుంటే..చైనా వోడి ఫోన్లయి పాయే.. తుడిచి చేతికి ఎత్తడానికి కూడా బహు కష్టమయ్యేది.. ఇక మావాడి ఊపుని చూస్తుంటే..కనీసం ఓ సిక్సరన్నా కొట్టకుండా వదిలేలా లేడు😤..క్రిస్ గేల్ లా శివాలెత్తేలా అనిపించడంతో..ఆడికి దడిసి..మరో కొత్త ఫోను కొనే సాహసం చేయలేకపోయా..( నిజం చెప్పాలంటే.. క్రెడిట్ కార్డోడు సాహసించలేదు😀😀)..దాంతో కొన్నాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో '..గాండీవం లేని అర్జునుడి' లా 'అజ్ఞాతవాసి'గా గడిపా..
ఇదిగో మళ్లీ ఈమధ్యే..క్రెడిట్ కార్డోడు కాస్తా కనికరించడంతో ఓ కొత్త ఫోన్ ని కొనుక్కున్నా.. ఎపుడూ ఎటువంటి గార్డులూ వేయని నేను..మొట్ట మొదటి సారిగా..మన తెలుగు సినిమాలో హీరోగారి దెబ్బలకి ఒళ్ళంతా బ్యాండేజి కట్లతో మంచం పట్టేసిన రౌడీ వెధవల్లాగా..నా మొబైల్ ని రక రకాల గార్డులతో చుట్టేసా🤣🤣.. అలాగే దానికి నిరంతరం జెడ్ ప్లస్ సెక్యూరిటీ ని ఏర్పాటు చేశా..ఇదిగో వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడంతో.. చాలా రోజులుగా పేస్బుక్ కి దూరంగా ఉన్న నేను..మళ్లీ మన పైత్యంతో టపాల్ని గోడకి పిడకల్ని కొట్టినట్లు కొట్టి..జనాల మీదకి వదలాలి అని బలంగా డిసైడ్ అయి బాసికం వేసి కూర్చున్నా😁..
హంతే..మందుబాబు చాలాసార్లు మందు మానేసిన తర్వాత..మళ్లీ మొదలెట్టినపుడు.. 'మామా ఏక్ పెగ్ లా..'మాదిరి మళ్లీ ఫుల్లుగా ముఖపుస్తకంలో ఇన్వాల్వ్ అయి..మావాడిని నెగలేక్ట్ చేశా..ఈ మధ్య ఫుల్ టైము వాడికే కేటాయించడంతో..అలవాటు పడిన ప్రాణం కదా..ఇపుడు పట్టించుకోక పోయే సరికి బహుశా అలిగుంటాడని అర్థమయింది.. మా ఆవిడ ఎపుడూ అంటూ ఉంటుంది..ఈ మందు మానిపించడానికి 'డీ అడిక్షన్ సెంటర్లు' ఉన్నట్లు..ఈ పేస్బుక్..వాట్సాప్ ల అడిక్షన్ నుండి తప్పించే సెంటర్లు ఉంటే బావుండు అని😆😆..
బాగా ఆలోచిస్తే అదీ నిజమే..ఎందుకంటే మనలో చాలా మందిమి..ఈ మిధ్యా ప్రపంచంలో పడి..వాస్తవ ప్రపంచంలోని బంధాల్ని.. బాంధవ్యాలనీ.. మరిచిపోతున్నాము.. ఓ పది నిముషాలు దీనిపై తీవ్రంగా ఆలోచించి..మళ్లీ యధావిధిగా..ఈ టపాని పోస్ట్ చేసిన తర్వాత..రోజుకి మాగ్జిమం ఒక గంట మించి ఆన్ లైన్ ఉండనని..మన రాజకీయ నాయకులు ఎలచ్చన్లలో ఇచ్చిన హామీలా..మా ఆవిడకి మరోసారి హామీనిచ్చి😀😀..ఈ టపాని గోడకి కొడుతున్నా..
14.02.2018