తొలకరి ఆశ

తొలకరి ఆశ | ఫణీంద్ర కుప్పిలి

నిర్జలీకరణతో..జీవం కోల్పోయి..
దేహమంతా నెర్రెలు బారి నిస్సహాయంగా..
నీటి చుక్కకై అంగలారుస్తున్న నేల తల్లికి..

తొలకరి తొలి వర్షపు చిరుజల్లులు
పారవశ్యంతో ఒళ్ళు పులకరింపు జేస్తుంటే..

దశాబ్దాల నిరాదరణతో..
గిట్టుబాటు కాని సేద్యంతో..
శోకించి శుష్కించిన రైతు..

తొలకరి తొలి వర్షపు చిరుజల్లులు
తన నేలని తాకగానే..
చేదు గతాన్ని మైమరచి..
ఏరువాకతో సాగిపోతున్నాడు..

11.06.2017

పాప్యులర్ పోస్టు

నాలోనే దారి | ఫణీంద్ర కుప్పిలి

గుండె లోతుల్లో | ఫణీంద్ర కుప్పిలి

డెత్ బెడ్ | ఫణీంద్ర కుప్పిలి