ముక్కుపిండి వసూలు
ముక్కుపిండి వసూలు | ఫణీంద్ర కుప్పిలి
ఒక ప్రముఖ బార్ & రెస్టారెంట్ లో ఒక ఇద్దరు వస్తాదులు పని చేస్తుంటారు.. ఆ బార్ యజమాని అక్కడికొచ్చే కస్టమర్లకు ఒక ఛాలెంజ్ పెడతాడు.. దానిలో గెలిచిన వారికి పెద్ద మొత్తంలో బహుమతిని అనౌన్స్ చేస్తాడు..
ఆ ఛాలెంజ్ ఏంటంటే..తన దగ్గరున్న ఆ ఇద్దరు వస్తాదులు..ఒక నిమ్మకాయని కోసి..దాని రసాన్ని పూర్తిగా పిండేస్తారు..ఆ తర్వాత అక్కడున్న కస్టమర్లు లో ఎవరైనా సరే.. ఆ రసం పిండేసిన తొక్కల నుండి..కనీసం ఒక్క చుక్క నిమ్మ రసాన్ని పిండగలిగినా..వాళ్లు ఆ ఛాలెంజ్ లో గెలిచినట్లే.. అలా గెలిచిన వారికి సన్మానంతో పాటు..ఆ బహుమతిని ప్రదానం చేస్తారు..
నిత్యం అనేక మంది..ఆ ఛాలెంజ్ లో గెలవాలని ప్రయత్నించి..విఫలమవుతుంటారు..కేవలం అందులో పాల్గొనడాని కోసమే..ఆ బార్ ని సందర్శించే వారు కోకొల్లలు..ఇలా చాన్నాళ్ళు..ఆ ఛాలెంజ్ ని ఎవరూ సాధించలేక వెనుదిరిగారు..
ఒక రోజు సాయంత్రం..ఆ ఛాలెంజ్ లో పాల్గొనడానికి ఒక ముసలాయన వస్తాడు.. అందరూ..అతన్ని చూసి విపరీతంగా గేలి చేస్తారు..ఎంతోమంది మహామహులు.. గెలవలేకపోయారు.. ఈ పెద్దాయనేంటి సాధించగలడు అని..కానీ అతను ఇవేమీ పట్టించుకోకుండా.. పోటీలో పాల్గొనడానికి సిద్ధపడతాడు..ఆ ఓనర్ సైతం..ఒక ఎంటర్టెయిన్మెంట్లా ఉంటుందని పాల్గొనమంటాడు..
ఆ పెద్దాయన లేచి.. నెమ్మదిగా ముందుకు వెళతాడు.. ముందుగా ఒక నిమ్మకాయని..ఆ వస్తాదులిద్దరూ.. పూర్తి బలం ఉపయోగించి.. నిమ్మరసాన్ని పిండేసి..ఆ పెద్దాయన చేతికిస్తారు.. నెమ్మదిగా తన చేతిలోకి ఒక నిమ్మ చక్కని తీసుకుంటాడు.. వృద్దాప్యం వలన..అతని చేతులు నెమ్మదిగా వణకడం మొదలవుతుంది..
అతని చేతులు వణకడం చూసి..అక్కడున్న వారు మరింతగా అరచి గోల చేస్తుంటారు..కానీ అతను మాత్రం పూర్తి విస్వాసంతో.. నిమ్మచెక్కని చేత్తో పిండటం మొదలు పెడతాడు.. ఒక్కసారిగ్గా ఆక్కడున్న వారంతా నిశ్శబ్దమైపోతారు..
ఆశ్చర్యకరంగా..అతను పిండుతున్న నిమ్మ చెక్క నుండి..ఒకటి కాదు..రెండు కాదు..నాలుగైదు చుక్కల నిమ్మరసం కారుతుంది..దానిని చూసి.. సంభ్రమాశ్చర్యాలకు గురైన అక్కడి వారంతా.. గట్టిగా చప్పట్లతో అతన్ని అభినందించడం మొదలు పెడతారు..
ఇంతకీ అంతమంది సాధించలేనిది ఈ పెద్దాయన ఎలా పిండగలిగాడో తెలుసుకోవాలని అందరూ ఉవ్విళ్లూరసాగారు..'వయసులో ఉండగా..అతనో పెద్ద వస్తాదేమో..' అని కొందరు గుసగుస లాడసాగారు.. అపుడు..ఆపెద్దాయన మాట్లాడటం మొదలు పెట్టాడు..' మీలో చాలా మంది అనుకుంటున్నట్లుగా..నేనేమీ బాడీ బిల్డర్ ని కాదు..' అని ఆగి మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు..
'..ఇంతకు ముందు..నేను ప్రభుత్వ పన్నుల శాఖలో.. అధికారిగా పని చేసి రిటైర్ అయ్యా.. సర్వీసులో ఉండగా జనాల ముక్కు పిండి..పన్నులు వసూలు చేయడం తో పోల్చితే..ఇదేమంత పెద్ద విషయం కాదు..' అని చెప్పడంతో..అవాక్కవడం అక్కడున్న వారి వంతు అయింది..