సౌండ్ లెస్..లైట్ లెస్.. పొల్యూషన్ లెస్.. లోకాస్ట్..నో కాస్ట్ దీపావళి శుభాకాంక్షలు

సౌండ్ లెస్..లైట్ లెస్.. పొల్యూషన్ లెస్..
లోకాస్ట్.. నో కాస్ట్ దీపావళి శుభాకాంక్షలు..

- ఫణీంద్ర కుప్పిలి
_______________________________________

                 మనం పర్యావరణం గురించి తెగ బెంగేట్టుసుకుని.. ఎడతెరిపి లేకుండా ఉపన్యాసాలిచ్చేసి.. సుద్దులు బుద్దులు చెప్పేవారంతా.. నిత్యజీవితంలో తెలిసో, తెయకుండానో పర్యావరణానికి చేస్తున్న హాని అంతా ఇంతా కాదు... ఇంట్లో..బస్సుల్లో, కార్లలో, ట్రైన్లలో.. క్లాస్ రూముల్లో.. సినిమా హాల్లో.. రెస్టారెంట్ లో..ఇలా ప్రతీ చోటా.. విచ్చలవిడిగా ఏ.సి లను వాడేసి..ప్రతీ పనికీ ఓ ఎలక్త్రికల్ ఉపకరణం వాడేయటం వలన.. విద్యుచ్ఛక్తి అవసరాలు పెరిగి.. విద్యుత్తు ఉత్పత్తి వలన జరిగే కాలుష్యం..మరీ ముఖ్యంగా ధర్మల్ విద్యుత్ వలన.. అలాగే పాలీథీన్ కవర్లు.. సూపర్ మార్కెట్ లో సరుకులు కోనటం దగ్గర నుండి..వేడి వేడి వేడి సాంబారు ఇడ్లీ దాకా .. ప్రతీదీ పాలిథిన్ కవర్లలోనే.. మనకు రైతు బజారుకి కూడా సంచి పట్టుకెళ్ళాలంటే నామోషి..

అలాగే మనం రోజుకొక గాడ్జెట్ వాడి పడేస్తుంటే గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్న ప్లాస్టిక్ మరియు ఎలక్ట్రానిక్ చెత్త.. మనం పబ్లిక్ ట్రాన్సుపోర్ట్ ని వదిలి పడవల్లాంటి పెద్ద పెద్ద కార్లలో.. విలాసంగా మోడ్రన్ మహారాజుల్లా  దర్పాన్ని  వెలగబెట్టటంతో విపరీతంగా పెరిగిపోతున్న వాయు కాలుష్యం.. వీటన్నిటినీ వదిలేసి సవత్సరానికి ఓపాలి జరుపుకునే దీపావళి మీద విసుర్లు విసరడం ఎంత సబబో??.మరికొంత మంది..ఇలా డబ్బుల్ని కాల్చేయటం ఏంటి? ఎంత వృధా.. ఆ డబ్బుని పేదోళ్ల సంక్షేమం కోసం ఉపయోగించ వచ్చు కదా అని గుండెలు బాదేసుకుని.. ఉపాన్యాసాలను దంచే వాళ్లంతా.. వృధా అని మాటకు ఎంతో విస్తృత అర్థం ఉందని గమనించాలి.. ఇళ్ళని.. ఒళ్ళుని గుల్ల చేసే మద్యపానం నుండి.. వినోద రంగం వరకూ.. అంతా వృధానే.. హాయిగా ఏమూలో  మూడంకేసుకు కూసుని.. ఏ పుస్తకాన్నో..సదూకుంటే.. పెద్ద ఖర్చు లేకుండానే కాలక్షేపం అయిపోతుంది..

ఇంకొంతమంది దీపావళి అంటే దీపాల వరుస.. అందువలన దీపాలు ఎలిగిస్తే సరిపోతుంది.. పూర్వం అలాగే జరుపుకునే వారని సెలవిస్తున్నారు... ఆ పూర్వం వరకూ ఎందుకూ?? నా చిన్నప్పుడు అంతా నడిచి లేదా సైకిల్ మీద తిరిగేవారు.. ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు.. మరి ఇపుడు అన్నింటికీ మిషన్లు వాడేసి, బళ్లు,కార్లలో తెగ తిరిగేసి మళ్ళీ ఎంచక్కా వాకింగులకు..ఏ.సి  ఫిట్ నెస్ సెంటర్లకీ..ఏ.సి కార్లలో  ఎళ్ళిపోతున్నారు...

అందువలన శివరాఖరుగా సెప్పొచ్చేదేటంటే.. ఆ నరకాసురుడు అండ్ కో.. ఇస్టోరీ లను పక్కన పెడితే.. సంవత్సరానికోపాలి.. అందరూ సక్కగా... ఆనందంగా... సకుంటుంబ సమేతంగా.. బాణాసంచా కాల్చి..కొంచెం జాగ్రత్తగా ఉండి.. అవేవో విషపూరిత వాయువుల్ని వెలువరించే టపాసులు ఉన్నాయంట.. ఆటిని కాస్త అవాయిడ్ చేసి.. మన సుప్రీం కోర్టు జేసిన రూల్సుని జరా పాటిస్తూ.. హ్యాపీగా దీపావళి జరుపుకోవాలని నా ఆకాంక్ష...

మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు...

ఇంకా శివరాఖరుగా.. విమర్శించడం తప్పా? మా 'బావ' స్వాతంత్ర్యాన్ని దెబ్బ తీస్తున్నారు..అని ఫీలయ్యే వాళ్ళకి..ఓ మనవి.. అయ్యా.. మీరు విమర్శించండి..కానీ విమర్శించడమే పనిగా పెట్టుకుని మాత్రం విమర్శించకండి.. ఎవరి మనో 'బావలు' ఆయినా దెబ్బతింటే.. ఛమించేయండి..

అమంగళం (అ)ప్రతిహతమగు గాక..

పాప్యులర్ పోస్టు

ఎన్ని'కల' భోజనంబు | ఫణీంద్ర కుప్పిలి

(అ)పుత్రస్య గతిర్నాస్తి..

మొబైలోపాఖ్యానం