ధనం మూలం ఇదం జగత్..
ధనం మూలం ఇదం జగత్.. | ఫణీంద్ర కుప్పిలి
'..ఆ..డబ్బుదేముంది..' '..మనిషి బ్రతకడానికి డబ్బు అవసరం కానీ..డబ్బే ప్రధానం కాదు..' 'ఆ..డబ్బున్నోడు కూడా తినేది పిడికెడు మెతుకులే కదా..పోయేది ఆరడుగుల జాగాలోనే కదా ..' అంటూ దీర్ఘాలు పోయే వారిని చాలా మందిని రోజూ చూస్తుంటాం..
కానీ నిజ జీవితంలో మాత్రం మనలో చాలా మంది ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తుంటాం.. కారణం ఎవరెన్ని స్టేట్మెంట్లు ఇచ్చినా..ఎన్ని సుద్దులు చెప్పినా.. '..చేతిలో కాసు లేకపోతే..దమ్మిడీ కి కూడా కొరగాము..' అందుకే ఒక పెద్దాయన అన్నాడు...'భూమి తన చుట్టూ తాను తిరుగుతూ..డబ్బున్నోడి చుట్టూ తిరుగుతోంది..' అని..
అదేదో సినిమాలో హీరో గారు..అనామకుడి సమాధి ఆరడగుల మట్టి దిబ్బ అయితే.. ఒక పెద్దమ్మది అరవై ఎకరాల్లో ఉందని..గుక్క తిప్పుకోకుండా చెప్పినట్లు.. ఎన్ని అనుకున్నా..'పైసా మె పరమాత్మా హై..' రూపాయి రూపాయి నువ్వేం చేయగలవు అంటే.. అన్నదమ్ముల్ని విడదీయగలను..చివరికి కన్నవారిని సైతం మట్టుబెట్టగలను అనేది...రోజూ పత్రిక పతాక శీర్షికలే సాక్షి..
బాబోయ్..ఇప్పటికే బోలెడు బరువైన విషయాల్ని మీమీదకి వదిలేసా..ఇగ ఉంటా..
శివరాఖరుగా ఒక మాట..
డబ్బు గురించి చర్చించడమంటే..
మొన్నామధ్య మన మోడీ గారు..
పెద్ద నోట్ల రద్దుతో... దేశం లోని నల్లధనాన్ని
ఒక ఉదుటున తుడిచి పెట్టేసినారా? లేదా?
అనే డిస్కషన్ లాంటిదే..
ఒక ఉదుటున తుడిచి పెట్టేసినారా? లేదా?
అనే డిస్కషన్ లాంటిదే..
ఒక్కటి మాత్రం నిజ్జంగా నిజం..
డబ్బు సంతోషాన్ని ఇస్తుందో లేదో తెలీదు గానీ..
కొండంత ధైర్యాన్ని మాత్రం ఇస్తుందనేది..
కొండంత ధైర్యాన్ని మాత్రం ఇస్తుందనేది..
పర్సు నిండా నోట్లుంటే..
మనకుండే ఆ కాన్ఫిడెన్సే వేరప్పా..
మనకుండే ఆ కాన్ఫిడెన్సే వేరప్పా..
03.07.2018