నా జీవితంలో ప్రతీ ఉదయం
ఎంతో స్వచ్ఛంగా, సంతోషంగా అనిపిస్తుంది..
నేను చేసే ప్రతీ పనినీ
ఎంతో బాధ్యతగా, ఆనందంగా చేస్తాను..
నా జీవితాన్ని ఎంతో అందంగా
తీర్చిదిద్దిన ఆమెకి..
నేను ప్రతీ రాత్రి నిద్రకు ఉపక్రమించేముందు
మనస్ఫూర్తిగా అభినందిస్తాను..
వీటన్నింటి వెనుక ఉన్న 'ఆమె' ఎవరో కాదు..
ఇందులో ఎటువంటి రహస్యం లేదు..
అనుక్షణం నన్ను ఓపిగ్గా భరిస్తూ, సహిస్తూ
చిరునవ్వుతో నట్టింట నడియాడే నా
'మహాలక్ష్మి'కి పెళ్లిరోజు శుభాకాంక్షలు..

పాప్యులర్ పోస్టు

ఎన్ని'కల' భోజనంబు | ఫణీంద్ర కుప్పిలి

(అ)పుత్రస్య గతిర్నాస్తి..

మొబైలోపాఖ్యానం