మా హరీష్ గాడి పెళ్లిలో టీ గోల | ఫణీంద్ర కుప్పిలి మొన్న మా తమ్ముడు హరీష్ పెళ్ళిలో మా ఫ్యామిలీ గ్యాంగ్ మొత్తం కలిసింది .. మేము మాంచి ఎండలో వెళ్ళటం వలన కల్యాణ మండపం లోకి ఎంటరవ్వగానే కాస్తా చల్ల గాలి తగలటం లో ప్రాణం లేచి వచ్చినట్లయింది .. ఆ స్వింగ్ లో ఎవరిని పలకరించానో కూడా తెలియలేదు .. పైన ఫుడ్ కౌంటర్ కి వెళ్లి ఓ నాలుగు మెతుకులు కుక్కేసి మళ్ళీ కల్యాణ మండపం దగ్గరికి చేరుకున్న .. కాస్త ఆత్మరావుడు శాంతించడం తో మా వాళ్లతో మాటా మంతీ కలిపా .. ఎవరి గోల వాళ్ళదిలా నచ్చినోళ్ళు నచ్చినోళ్లతో మాట్లాడుకుంటుంటే ...
గుండె లోతుల్లో | ఫణీంద్ర కుప్పిలి గుండె లోతుల్లో బాధ సుడులు తిరుగుతోంది.. మనసు అట్టడుగు పొరల కింద అణిచిపెట్టిన ఆలోచనల సుడిగుండాలు.. వింత అలజడుల్ని సృష్టిస్తున్నాయి.. ఏదో సాధించాలనే తపన మనసుని అస్థిమితంగా చేస్తుంటే.. ఏమీ సాధించలేని నిస్సహాయత నాలో నిర్వేదాన్ని మిగిలిస్తోంది.. లేని స్థిత ప్రజ్ఞతను అరువు తెచ్చిపెట్టుకుని.. ఓ ప్లాస్టిక్ నవ్వుని ముఖాన పులుముకుని.. ఆశా మొహాల బందీగా.. చిక్కులు పడిన ఆలోచనల ముడుల్ని ఓపికగా విప్పే సహనం కోల్పోయి.. ఆలోచనల తుట్టని ముక్కలు ముక్కలుగా తెగ తెంపులు చేసి.. తెగిపడిన ఆలోచనలను తిరిగి ఒక గూడులా అల్లే ప్రయత్నం చేస్తుంటే.. నా అస్తిత్వం అడుగుల కింద జారిపోతోంది.. నీడలు కూడా నన్ను వదిలి పారిపోతున్నాయి.. నేనని చెప్పుకునే హక్కు కోల్పోయి.. శూన్యంలో తేలుతున్న శవం లాగా.. జీవన్మరణాల మధ్య అనంత మధ్యాహ్నంలో నిలిచిపోయాను.. ఈ తుఫాను తీరుతుంది.. మనసు మళ్ళీ ప్రశాంతత వైపు పయనిస్తుంది.. అప్పుడు ఈ రోజు బాధలు రేపటి బలానికి సూచికలవుతాయి.. నిలువుగా నిలబడాలని చేసే ప్రయత్నంలోనే అసలైన జీవిత పరమార్...
డెత్ బెడ్ | ఫణీంద్ర కుప్పిలి ఆస్తులు.. అంతస్తులు.. బంధాలు.. బాంధవ్యాలు.. భయాలు.. భావోద్వేగాలు.. రాగ భావ ద్వేషాలు.. భవ బంధాల్ని తెంచుకుని.. అన్నింటికీ అతీతంగా.. నిజమైన విరాగిలా.. శ్మశానం అంచున ప్రాణంతో పడున్న శవంలా.. నిస్తేజంగా, నిర్లిప్తం గా అనంత శూన్యం లోకి చూస్తూ.. వ్యక్తపరచని భావాలు.. మరిచిపోయిన క్షణాలు.. చేయాలనుకున్న పనులు.. ప్రేమించాల్సిన మనసులు.. నిన్ను వెంటాడుతూ.. వేధిస్తాయి.. చివరికి ఆరోజు రానే వస్తుంది.. ఇహ లోక పాత్రకి స్వస్తి పలికి.. పరలోక యాత్రకు పయణమవుతావు.. ఆకాశం విరిగిపడదు.. భూమి బ్రద్దలవదు.. సాగర కెరటాలు ఆగిపోవు.. తారలు నేలకొరగవు.. కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది.. మనిషి పరుగులుతీస్తూనే ఉంటాడు.. చాలామంది నిన్ను మర్చిపోతారు.. అతి కొద్దిమంది నిన్ను తలుస్తారు.. అమితంగా ప్రేమించేవారు నిన్ను కొలుస్తారు.. నీవు రెక్కలు ముక్కలు చేసుకుని కూడబెట్టినదంతా పరులపాలవుతుంది.. నీవు చేసిన మంచి చెడులే మిగుల్తాయి.. నిన్ను సమాజంలో మనిషిగా నిలబెడతాయి.. 19.07.2021