వలస జీవులు..| ఫణీంద్ర కుప్పిలి
వలస జీవులు..| ఫణీంద్ర కుప్పిలి
కులం లేదు మతం లేదు
ప్రాంతీయ భాషాభేదం లేదు..
బ్రతుకు బాటలో
మెతుకు వేటలో
ఏటా కొన్ని కోట్ల మంది
నిశ్శబ్దంగా సాగిపోతూ ఉంటారు..
మహనగరాల నిర్మాణానికి
రక్తమాంసాలని ధారపోసే
నగర శివారులోని మురికి కూపాలోలు..
ఆధునిక నగరాల ప్రగతిలో
అలుపెరగక పనిచేసే మర జీవులు..
తమ గుర్తింపును పల్లెల్లో విడిచి వచ్చే
వలస జీవులు..
ఆధునికతను తమ వెంట మోసుకెళ్లే సాంస్కృతిక రాయబారులు..
11 మే, 2020.