గుండె లోతుల్లో | ఫణీంద్ర కుప్పిలి
గుండె లోతుల్లో | ఫణీంద్ర కుప్పిలి గుండె లోతుల్లో బాధ సుడులు తిరుగుతోంది.. మనసు అట్టడుగు పొరల కింద అణిచిపెట్టిన ఆలోచనల సుడిగుండాలు.. వింత అలజడుల్ని సృష్టిస్తున్నాయి.. ఏదో సాధించాలనే తపన మనసుని అస్థిమితంగా చేస్తుంటే.. ఏమీ సాధించలేని నిస్సహాయత నాలో నిర్వేదాన్ని మిగిలిస్తోంది.. లేని స్థిత ప్రజ్ఞతను అరువు తెచ్చిపెట్టుకుని.. ఓ ప్లాస్టిక్ నవ్వుని ముఖాన పులుముకుని.. ఆశా మొహాల బందీగా.. చిక్కులు పడిన ఆలోచనల ముడుల్ని ఓపికగా విప్పే సహనం కోల్పోయి.. ఆలోచనల తుట్టని ముక్కలు ముక్కలుగా తెగ తెంపులు చేసి.. తెగిపడిన ఆలోచనలను తిరిగి ఒక గూడులా అల్లే ప్రయత్నం చేస్తుంటే.. నా అస్తిత్వం అడుగుల కింద జారిపోతోంది.. నీడలు కూడా నన్ను వదిలి పారిపోతున్నాయి.. నేనని చెప్పుకునే హక్కు కోల్పోయి.. శూన్యంలో తేలుతున్న శవం లాగా.. జీవన్మరణాల మధ్య అనంత మధ్యాహ్నంలో నిలిచిపోయాను.. ఈ తుఫాను తీరుతుంది.. మనసు మళ్ళీ ప్రశాంతత వైపు పయనిస్తుంది.. అప్పుడు ఈ రోజు బాధలు రేపటి బలానికి సూచికలవుతాయి.. నిలువుగా నిలబడాలని చేసే ప్రయత్నంలోనే అసలైన జీవిత పరమార్...