జారుడు మెట్లు
జారుడు మెట్లు| ఫణీంద్ర కుప్పిలి ఈమధ్య కాలంలో ఆఫీసులో పని ఒత్తిడి కారణంగా.. రోజూ సాయంత్రం బయలుదేరేసరికే చీకటి పడుతోంది.. కానీ ఆరోజు ఏదో మా బంధువుల ఫంక్షన్ ఉంది..ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి.. ఆఫీసు నుండి తొందరగా ఇంటికి రమ్మని గత వారం రోజులుగా నా శ్రీమతి పోరు పెడుతోంది.. దాంతో బాస్ దగ్గర పర్మిషన్ తీసుకుని.. కొంచెం తొందరగా ఇంటికి బయలుదేరాను.. ఆఫీసు సిటీకి కొంచెం దూరంలో ఉండటంతో పెద్దగా ట్రాఫిక్ ఉండదు.. అందువలన ఇంటికి వీలైనంత ఎర్లీగా చేరుకోవాలని.. చిన్నప్పుడు మా లెక్కల మాష్టారు.. మా చెవిని మెలిపెట్టినట్లు.. గట్టిగా బండి యాక్సిలరేటర్ నులిపా.. అంతే బండి మూడంకెల స్పీడ్ ని అందుకుంది.. అయితే సంచి లాభం.. చిల్లు లాగేసినట్లు.. సిటీలోకి ఎంటర్ అవుతూనే.. ఒక్కసారిగా బండి స్పీడ్ సింగిల్ డిజిట్ కి పడిపోయింది.. ఆ ట్రాఫిక్ ని చూస్తుంటే.. బద్ధకంగా ఒళ్ళు విరుచుకుని.. ముందుకు సాగుతున్న కొండచిలువలా.. బారులు తీరిన వాహనాలు మెల్లగా ముందుకు కదు...