జారుడు మెట్లు
జారుడు మెట్లు| ఫణీంద్ర కుప్పిలి
ఈమధ్య కాలంలో ఆఫీసులో పని ఒత్తిడి కారణంగా.. రోజూ సాయంత్రం బయలుదేరేసరికే చీకటి పడుతోంది.. కానీ ఆరోజు ఏదో మా బంధువుల ఫంక్షన్ ఉంది..ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి.. ఆఫీసు నుండి తొందరగా ఇంటికి రమ్మని గత వారం రోజులుగా నా శ్రీమతి పోరు పెడుతోంది.. దాంతో బాస్ దగ్గర పర్మిషన్ తీసుకుని.. కొంచెం తొందరగా ఇంటికి బయలుదేరాను.. ఆఫీసు సిటీకి కొంచెం దూరంలో ఉండటంతో పెద్దగా ట్రాఫిక్ ఉండదు.. అందువలన ఇంటికి వీలైనంత ఎర్లీగా చేరుకోవాలని.. చిన్నప్పుడు మా లెక్కల మాష్టారు.. మా చెవిని మెలిపెట్టినట్లు.. గట్టిగా బండి యాక్సిలరేటర్ నులిపా.. అంతే బండి మూడంకెల స్పీడ్ ని అందుకుంది.. అయితే సంచి లాభం.. చిల్లు లాగేసినట్లు.. సిటీలోకి ఎంటర్ అవుతూనే.. ఒక్కసారిగా బండి స్పీడ్ సింగిల్ డిజిట్ కి పడిపోయింది.. ఆ ట్రాఫిక్ ని చూస్తుంటే.. బద్ధకంగా ఒళ్ళు విరుచుకుని.. ముందుకు సాగుతున్న కొండచిలువలా.. బారులు తీరిన వాహనాలు మెల్లగా ముందుకు కదులున్నాయి..
ఒకప్పుడు..ఆ ఏరియా సిటీకి అవుట్ స్కర్ట్స్ గా ఉండేది..దాంతో..పెద్ద పెద్ద చెట్లతో.. విశాలమైన రోడ్లతో.. చాలా ఆహ్లాదకరంగా ఉండేది.. సిటీ బాగా పెరగడంతో.. ఇపుడు.. ఆ ప్రాంతం మొత్తం.. కాంక్రీటుతో నిండిపోయింది.. వాహనాలు విపరీతంగా పెరిగిపోవడంతో.. రోజూ అటు నుండి వెళ్లడమంటే.. ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని చేదించడమే.. అందుకే సాధారణంగా నేను చిన్న గల్లీలగుండా బండిని పోనిస్తాను.. కానీ ఈమధ్య ఆఫీసు లో పని ఒత్తిడి పెరగడంతో.. ఇంటికి బాగా లేట్ గా బయలుదేరుతున్నా.. దాంతో సిటీలో కొంచెం ట్రాఫిక్ తక్కువగా ఉంటోంది.. అందువలన మెయిన్ రోడ్డు గుండానే వెళ్లిపోతున్నా..
కానీ ఈరోజు సాయంత్రం పీక్ అవర్స్ కి దొరికిపోవడంతో.. చేసేది లేక పక్కనున్న చిన్న సందులోకి బండిని పోనిచ్చా..నేను వెళ్ళే త్రోవలో .. ఏదైనా టెంపుల్,చర్చి లేదా మసీదు..ఏది కనిపించినా.. దణ్డం పెట్టుకోవడం అలవాటు.. ఎంత ట్రాఫిక్ లో ఉన్నా కూడా.. ఓసారి దేవుణ్ణి పలకరించకపోతే.. మనసులో ఏదో వెలితిగా ఉంటుంది.. ఆ గల్లిలో ఓ చర్చి ఉంటుంది.. రోజూ వెళ్ళేటప్పుడు.. ఓసారి జీసస్ ని తలుచుకోవడం అలవాటు.. ఆరోజు కూడా చర్చి దగ్గరకు వస్తానే.. దండం పెట్టుకుందామని అటువైపుగా చూసా.. అక్కడ గేటుకి ప్రక్కన వేలాడదీసిన ఒక పెద్ద ఫ్లెక్సి ని చూడగానే.. ఒక్క క్షణం స్థాణువు అయిపోయాను.. రోడ్డు మధ్యలోనే బండి ఆపి..ఆ ఫ్లెక్సి లోని వైపు చూడసాగాను.. ఎంతో ఆహ్లాదకరంగా నవ్వుతున్న ఒక యువకుని ఫోటో.. అయితే..' శ్రద్ధాంజలి' అనే అక్షరాల్ని చూడగానే.. మనసంతా బరువుగా మారింది..వెనక నుండి..బండి హారన్ గట్టిగా మ్రోగడంతో..చేసేది లేక బలవంతంగా ముందుకు కదిలా..
ఎలాగోలా ఇంటికి చేరుకుని..నీరసంగా వెళ్లి సోఫాలో కూలబడ్డా.. అప్పటికే..ఫంక్షన్ కోసం రె'ఢీ’ గా ఉన్న నా శ్రీమతి.." తొందరా రమ్మన్నాను కదా..ఏంటి ఇంత లేట్ గా వచ్చారు? ముందు వెళ్లి అర్జెంట్ గా ఫ్రెష్ అయ్యి రండి.. ఈలోగా టీ తీసుకొస్తా.."అని ఇంచుమించుగా ఆజ్ఞాపించి... వంటిట్లోకి వెళ్లిపోయింది.. నేను మాత్రం అవేమీ పట్టిచుకోకుండా.. కళ్ళుమూసుకుని గతంలోకి జారిపోయాను..
* * *
చుట్టూ పచ్చని కొండలూ..చెట్లు చేమల మధ్య.. విశాలమైన ఆవరణలో..ఒక పెద్ద స్కూలు.. పిల్లలందరూ..సాయంత్రం పూట సరదాగా ఆడుకుంటున్నారు..ఒక బక్క పలుచని కుర్రాడు.. ఉంగరాలు జుట్టుతో చలాకీగా పరుగెడుతున్నాడు.. ఆ కుర్రాడే రాజు.. ఒక్క ఆటల్లోనే కాదు.. చదువులోనూ.. పాటల్లోనూ.. డ్యాన్సుల్లోనూ... అన్నింటిలో ముందుండే వాడు..
నేను..రాజు..అదే స్కూల్లో..ఆరు నుండి పన్నెండో తరగతి వరకూ కలసి చదువుకున్నాము.. ఒకే కంచం..ఒకే మంచం.. జంట పక్షుల్లా తిరిగే వాళ్ళం.. చాలా మంది మా స్నేహాన్ని చూసి కుళ్ళుకునే వాళ్ళు.. మరికొంతమంది మమ్మల్ని విడదీసే విఫలయత్నాలూ చేసారు.. అలా తొమ్మిదో తరగతి వరకు.. సరదాగా సాగిపోయింది.. పదో తరగతికి వచ్చేసరికి.. మా వాడు నన్ను కొంచెం అవాయిడ్ చేయడం మొదలు పెట్టాడు.. నేను మొదట్లో బాధ పడినప్పటికీ.. సర్లే అని సరిపెట్టుకునే వాడిని.. నేను లెక్కల్లో కొంచెం పూర్.. మావాడు లెక్కల్లో టాపర్.. దాంతో మనోడితో లెక్కలు చెప్పించుకోవాలని ఆశపడేవాడిని.. కానీ మనోడు ఉన్నట్టుండి..సడెన్ గా మాయమయిపోయేవాడు.. నేను మేథ్స్ రెమిడియల్ తరగతులకు అటెండ్ అయ్యే వాడిని.. దాంతో ఎపుడో..హాస్టల్లో పడుకునేటపుడు తప్ప.. కలవడానికి టైము ఉండేది కాదు..అయితే..నేను మనోడి ప్రవర్తనలో ఏదో తేడా ఉన్నట్టు గమనించినప్పటికీ.. అది ఏంటని తెలుసుకునే సమయం ఉండకపోవడంతో.. పైగా పబ్లిక్ పరీక్షలు దగ్గర పడుతుండటంతో పట్టించుకోకుండా వదిలేసా..
కానీ పరీక్షల సమయానికి పూర్తిగా మారిపోయాడు.. చదువులోనూ కొంత వెనకబడ్డాడు.. ఎవరో జూనియర్ అమ్మాయితో మనోడు లవ్ లో ఉన్నట్లు.. గుసుగుస లాడుకుటుంటే.. విషయమేంటో తెలుసుకుందామని.. ఆరోజు నాకు ఒంట్లో బాగాలేదని చెప్పి క్లాస్ ఎగ్గొట్టి.. మనోడిని పట్టుకున్నా.. " రాజు.. నేను విన్నది నిజమేనా? " అని డైరెక్ట్ గా అడిగే సరికి.. మనోడు ఎదో తప్పు చేసినోడిలా తలదించుకుని.." ఆ.. నిజమే..నేను మొదట్లో అందరితో ఉన్నట్లు గానే తనతో కూడా ఫ్రెండ్లీ గానే ఉండేవాడిని..కానీ ఒకరోజు ఉన్నట్లుండి సడెన్ గా..ఐ లవ్ యూ చెప్పింది రా .." అంటూ చెప్పుకుపోసాగాడు..' ..మరి ఈవిషయం ఇన్నాళ్లు నాకెందుకు చెప్పలేదు..' అని గద్దించే సరికి.. ' నువ్వేమంటావో..అని చెప్పలేదు.. సారీ రా..అయినా అదేంటో అలా జరిగిపోయింది..' '..ఇపుడు తను లేకుండా నేను బ్రతకలేనురా..' అంటూ ఏవేవో.. తన గురించి చెప్పసాగాడు.. సరేలేరా..ఈ నాలుగు రోజులూ.. కాస్త స్టడీస్ మీద కాన్సంట్రేట్ చెయ్..' అని ఏదో పొడిపొడిగా ఓ రెండు మాటలు మాట్లాడి వెళ్లిపోయా.. ఎందుకంటే వాడికి స్టడీస్ గురించి చెప్పే స్థాయి నాకు లేదు..
పదో తరగతి పరీక్షలు అయిపోయాక.. అందరం ఎవరింటికి వాళ్ళు వెళ్లిపోయాం.. అప్పట్లో ఇప్పుడున్నంత కమ్యూనికేషన్ ఉండేది కాదు..పైగా మనోడు టౌనులో ఉండేవాడు..నేను ఒక పల్లెటూరి లో ఉండటంతో.. మా ఊరికే ఫోన్ సౌకర్యం కూడా లేదు..దాంతో మిత్రులం అపుడపుడు ఉత్తరాలతో పలకరించుకునే వాళ్ళం.. ఒకటిరెండు సార్లు నేను టౌనుకి వెళ్లినప్పటికీ మనోడిని కలవలేకపోయా..ఈలోగా రిజల్ట్స్ రావడం.. నేను కూడా ఫస్ట్ డివిజన్ లో పాసయిపోయి అందరినీ ఆశ్చర్యం లో ముంచేసా.. నాకు మొదటి నుండి లెక్కలంటే భయం కావడం వలన..నేను బై.పి.సి లో .. రాజు యం.పి.సీ లో జాయిన్ అయ్యాము..
మా ఇద్దరి గ్రూప్స్ వేరే కావడంతో.. వాడి క్లాస్ విషయాలు.. నాకు తెలియడం ఇంకా తగ్గింది.. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా నాకు అర్థమయింది.. అది ఏంటంటే.. వాడు ఆ అమ్మాయి ప్రేమలో మునిగి తేలి.. చదువుని నిర్లక్ష్యం చేస్తున్నాడని.. కానీ మనోడు సహజంగానే మంచి తెలివైన వాడు కావడంతో.. హైదరాబాద్ లో మంచి రెప్యుటేషన్ ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫ్రీ సీటు సంపాదించాడు.. ఆ మరుసటి సంవత్సరం.. ఆ అమ్మాయి కూడా అక్కడే ఒక ప్రయివేటు ఇంజనీరింగ్ కాలేజీ లో జాయిన్ అయింది.. ఇక మనోడి ఆనందానికి హద్దులు లేకుండాపోయాయి.. అలాగే.. అన్ని సంవత్సరాలు.. క్రమశిక్షణ కి ప్రాణం పెట్టె ఆ రెసిడెన్షియల్ స్కూల్ లో చదవటం వలన.. బయటికి వచ్చి.. సిటీలో రూమ్ తీసుకుని ఉండటంతో.. ఇక పట్టపగ్గాలు లేకుండా పోయాయి.. ఒక ప్రక్క ఆ అమ్మాయితో షికార్లు..మరో వైపు.. ఫ్రెండ్స్ తో మందు పార్టీలు.. ఇలా..ఆ నాలుగు సంవత్సరాలు.. మూడు షికార్లు.. ఆరు పార్టీలు గా ఎంతో ఆనందంగా గడిపేశాడు.. నేను ఎప్పుడన్నా వాడితో ' ఎందుకురా లేని అలవాటు చేసుకుని.. నీ కెరీర్ నీ , ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటావు?' అని అడిగితే..'నీకు తెలీదు లేరా.. ఇంజనీరింగ్ లో ఇవన్నీ కామన్..' అంటూ టాపిక్ మార్చేసేవాడు..
'..ఏవండీ..ఏంటి ఇంకా అలాగే సోఫాలో పడుకుని ఉన్నారు..ఇప్పటికే లేట్ అయింది..' అన్న.. మా ఆవిడ కేకలాంటి గర్జనకి..తుళ్లుపడి.. ఈలోకం లోకి వచ్చా..కళ్ళు తెరిచి చూసే సరికి..' ఎదురుగా అపర కాళిక లా దర్శనం ఇచ్చింది...పూనకం వచ్చిన దానిలా..కోపంతో ఊగిపోతోంది.. నాకు నా భవిష్యత్తు కనిపించసాగింది.. ఇక లాభంలేదనుకుని.. బలవంతంగా లేచి.. బాత్రూం లోకి నడిచా..
బ్యాక్గ్రౌండ్ స్కోర్ లాగా '..చెప్పిన టైముకి ఇంటికి రారు.. పైగా ఎపుడూ..ఏదో లోకంలో ఉంటారు.. ఇంట్లో మనుషులున్నారన్న సంగతే పట్టదు..' ఇలా మాఆవిడ తిట్ల దండకం సాగుతోంది..గబగబా రెడీ అయి.. మా వాళ్ళని తీసుకుని ఫంక్షన్ కి వెళ్లినప్పటికీ..'..రాజు గురించిన ఆలోచనలే మనసులో తిరుగుతున్నాయి..' మధ్య మధ్యలో.. మా ఆవిడ హుంకరింపులతో.. తెలిసిన వాళ్ళని చూసి..బస్సు తప్పిపోయినోడి నవ్వుని.. ముఖానికి పూసుకుని మ్యానేజ్ చేశా..చివరికి బ్రతుకుజీవుడా అని కొంపకి చేరేసరికి తేదీ మారిపోయింది..
కళ్ళుమూసుకుని పడుకున్నానే కానీ. నిద్ర రావడం లేదు..రాజుకి సంబంధించిన ఆలోచనలే ముసురుకుంటున్నాయి...
* * *
మెల్లమెల్లగా రాజు జీవితం గాడి తప్పసాగింది.. సరదాగా మొదలైన మందు.. సిగరెట్లు కాస్తా వ్యసనంగా మారిపోయాయి... మందు తాగడానికి రొజూ ఏదో ఒక కారణం చెప్పేవాడు..ఒక రోజు హ్యాపీగా ఉన్నాననీ..ఇంకొరోజు తనతో ఏదో జరిగిన గొడవ చెప్పి.బాధలో తాగుతున్నానని.. ఇలా ఆడి జీవితం రోజూ బారు.. బీరు గా మారిపోయింది..దాని ఫలితం.. ఇంజనీరింగ్ పూర్తయ్యేసరికి.. కొండలా పేరుకుపోయిన బ్యాక్లాగ్స్.. దాంతో క్యాంపస్ సెలెక్షన్ మిస్ అయిపోయాడు.. ఇక అప్పటినుండి.. ఆ అమ్మాయితో తిరగటమే ఫుల్ టైం జాబ్ అయిపోయింది మనోడికి.. తాను ఇంజనీరింగ్ పూర్తి చేయగలిగినా... క్యాంపస్ సెలెక్షన్ లు లేకపోవడంతో.. అక్కడే ఎం.టెక్ జాయిన్ అయింది..అప్పటికే ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడంతో.. ఇంటి నుండి పంపే డబ్బు సరిపోక.. అవకాశం ఉన్నచోటల్లా అప్పులు చేయసాగాడు.. ఎప్పుడన్నా..వాడితో..' ఒరేయ్..ఎందుకురా అలా టైం వేస్ట్ చేసుకుంటావు? దేనికన్నా ప్రిపేర్ కావచ్చు కదా.. ఉద్యోగం లో చేరితే కనీసం.. డబ్బులుకన్నా ఇబ్బంది ఉండదు కదరా..' అని చెప్పే వాణ్ణి..అప్పటికే నేను ఉద్యోగం సంపాదించడం వలన..వాడికి ఆ మాత్రమైనా చెప్పగలిగే వాణ్ణి..
ఇక తప్పని సరి పరిస్థితుల్లో.. ఒక పక్క బ్యాక్లాగ్స్ క్లియర్ చేస్తూనే..మరోవైపు.. ఇంటర్ క్వాలిఫికేషన్ తో ఒక చిన్న ప్రభుత్వోద్యోగం లో జాయిన్ అయ్యాడు.. అయితే.. అది తన నేటివ్ టౌన్ లో అవ్వటం వలన సిటీని.. ఆ అమ్మాయిని విడిచిపెట్టి వెళ్ళాక తప్ప లేదు.. కానీ ఆ అమ్మాయి ధ్యాసలో ఆ ఉద్యోగాన్ని సైతం సరిగా చేయలేకపోయాడు.. మరోవైపు..ఆమె ఖర్చులు సైతం మనోడే భరిస్తుండటంతో.. తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురయ్యాడు... దాంతో మెల్లగా ఆ ఫ్రస్ట్రేషన్.. ఆ ఆమ్మాయిపై చూపించసాగడు.. మనోడు తనకి కాల్ చేసినపుడు..కాల్ లిఫ్ట్ చేయటం ఏమాత్రం లేటయినా సరే.. భరించలేక పోవడం సరికదా..ఆ ఆమ్మాయిపై విరుచుకు పడేవాడు.. దానితో వారిద్దరి మధ్య మెల్లగా అనుమానాలు.. అపార్థాలు మొదలయ్యాయి.. మనోడు తనపై అజమాయిషీ చేయాలని ప్రయత్నిస్తున్న కొలదీ.. ఆమెలో తిరుగుబాటు ధోరణి పెరగసాగింది..
ఇక లాభం లేదనుకుని.. మనోడు ఆ గవర్నమెంట్ జాబ్ ని వదిలేసి.. తనకి దగ్గరగా ఉండటం కోసం.. బ్యాంకులో ఆఫీసరుగా జాయిన్ అయ్యాడు.. ఈలోగా తన చదువు పూర్తి చేసుకుని.. వేరే సిటీలో సాఫ్టువేరు ఉద్యోగంలో జాయిన్ అవటంతో.. మరోమారు మనోడు డిప్రెషన్ కి లోనయ్యాడు.. తాను తనకి దూరం అయివుతుందనే బాధలో..పూర్తిగా మద్యానికి బానిసయ్యాడు.. విపరీతమైన అభద్రతాభావానికి లోనవటంతో.. ఆమెను అనుమానంతో..నిరంతరం టార్చర్ చేయటం మొదలు పెట్టాడు.. ఆమె ఈ టార్చర్ ని భరించలేక.. అవాయిడ్ చేయటం మొదలు పెట్టింది.. ఇది రోజురోజుకి మరింత బిగుసుకుపైవడంతో.. పూర్తిగా ఇద్దరి మధ్య రిలేషన్ దెబ్బతిని.. బ్రేక్ అప్ వరకు వెళ్ళింది..
దాంతో మనోడి జీవితం పూర్తిగా అదుపు తప్పిపోయింది.. ఒకవైపు ఉద్యోగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో... బ్యాంకు వాళ్ళు టెర్మినేట్ చేసేశారు...మరోవైపు విపరీతమైన తాగుడు వలన తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు.. ఇక త్రాగితే చచ్చిపోతావని డాక్టర్లు చెప్పడంతో..డీ ఆడిక్షన్ సెంటర్లో జాయిన్ చేసినా ఫలితం శూన్యం.. దాంతో ఫ్రెండ్స్ ఒక్కొక్కరు దూరమవసాగారు.. చివరికి ఇంట్లో వాళ్ళు సైతం విసిగి వేసారిపోయి విడిచి పెట్టేసారు..
నేను చిన్నప్పటి నుండీ ఎంతగానో అభిమానించే స్నేహితుడు.. కళ్ళముందే ఇలా జీవితాన్ని నాశనం చేసుకోవడం చూసి తట్టుకోలేక పోయేవాడిని..ఒకప్పుడు అతని తెలివి తేటలకి..సమర్థతకి ఫిదా అయిపోయే నేను.. ఇపుడు వాడిని భరించలేని స్థితికి చేరుకున్నా.. వాళ్ళ ఇంట్లో వాళ్ళు సైతం.. నేను ఎపుడైనా ఓసారి ఇంటికి వెళితే.. వాడిని ఫ్రెండ్సే చెడగొట్టినట్లు.. వాళ్ళింట్లో వాళ్ళు నిందిస్తుండటం తో మెల్లగా అవాయిడ్ చేయటం మొదలు పెట్టా... అవసరమైన సమయంలో నేను..మనోడిని అవాయిడ్ చేస్తున్నానని గిల్టీ ఫీలింగ్ మాత్రం నిరంతరం నన్ను వెంటాడుతుండేది.." నిప్పులు చిమ్ముకుంటూ.. నింగికి నేనెగిరిపోతే.." అనే శ్రీశ్రీ పదాలు గుర్తుకొస్తుండేవి.. ఈలోగా ఆ అమ్మాయి వేరే అతన్ని పెళ్లి చేసుకుని ఫారిన్ లో సెటిల్ అయిపోయింది..నేను కూడా పెళ్లి చేసుకుని.. సంసారం లో పడ్డాక..ఇంచుమించుగా రాజుని మర్చిపోయా..
ఇలా రాత్రంతా రాజు ఆలోచనలతోనే గడిచిపోయింది..టైమెంతయింది అని కూడా చూడాలనిపించలేదు..కానీ అప్పటికే బాగా అలసిపోయి ఉండటంతో.. అప్రయత్నంగానే నిద్రలోకి జారుకున్నా.. రాత్రి సరిగా నిద్రపోకపోవడంతో... ఉదయాన్నే లేవలేకపోయాను.. అదీకాక ఒంట్లో బాగా నీరసంగా ఉండటంతో.. ఆరోజు ఆఫీసుకి రాలేనని బాస్ కి ఫోన్ చేసి చెప్పి..బద్ధకంగా.. అలాగే బెడ్ పైన దొర్లసాగాను.. మొబైల్ ఫోను కంటిన్యూయాస్ గా రింగ్ అవుతుండటంతో.. ఎవరా అని చూసే సరికి.. ఒక పాత స్కూల్ ఫ్రెండ్ కాల్ చేస్తున్నాడు.. ఎప్పుడూ కాల్ చేయని వాడు.. ఇప్పుడెందుకు సడెన్ గా కాల్ చేస్తున్నాడో.. నాకు అప్పటికే బాగా తెలుసు కాబట్టి కాల్ లిఫ్ట్ చేయాలనిపించక.. మొబైల్ ఫోన్ ని సైలెంట్ మోడ్ లో పెట్టి.. నేను ఫ్లైట్ మోడ్ లోకి వెళ్లిపోయా...
- ఫణీంద్ర కుప్పిలి
26 జనవరి, 2018.