Posts

Showing posts from January, 2020
మనిషి జీవితం ఒక లోలకం వంటిది.. అది ఆశ..నిరాశ ల మధ్య నిరంతరం ఊగిసలాడుతూ ఉంటుంది.. ఆశ చావనివ్వదు.. నిరాశ బ్రతకనివ్వదు..

తను లేకపోతే మనం లేము..| ఫణీంద్ర కుప్పిలి

తను లేకపోతే మనం లేము..| ఫణీంద్ర కుప్పిలి ముద్ద పెట్టి ముద్దు చేసే అమ్మగా.. వెనకుండి నడిపించే ఇల్లాలిగా.. అంతులేని ప్రేమని కురిపించే సోదరిగా.. అల్లరితో మురిపించే అమ్మాయిగా.. మన జీవితంతో తన జీవితాన్ని.. అణువణువు పెనవేసుకున్న ఆమె.. మననుండి కోరుకునేది మాత్రం.. కాసింత ప్రేమ.. కూసింత స్వేచ్ఛ.. తగిన గుర్తింపు.. మనమిపుడు పాటుపడాల్సింది.. స్త్రీల అభివృద్ధి కోసం కాదు.. స్త్రీలు నడిపించే అభివృద్ధి కోసం.. తన నుండి సృష్టించబడిన సగం మంది చేతిలో.. తాను అనుక్షణం నగుబాటుకి గురౌతున్నా.. తనెంతో సహనంతో.. అంతులేని ఓరిమితో.. నిరంతరం ప్రేమను కురిపిస్తూనే ఉంది.. ఎందుకంటే.. తను లేకపోతే మనం లేము..