జీవిత పరమార్థం
జీవిత పరమార్థం | ఫణీంద్ర కుప్పిలి గతం చేసిన గాయాలకు.. పరిణితి అనే మలాము పూసి భౌతికవాద విజయాల మాటున అను నిత్యం కృత్రిమత్వాన్ని చిందిస్తూ.. నలుగురిలో.. గుండె లోతుల్లోని బాధల్ని మునిపంటితో బిగువబట్టి.. లేని చిరునవ్వుని ముఖాన్ని పులుముకుని.. ఏడ్వలేక నవ్వుతూ..నవ్విస్తూ.. ఏకాంతంలో.. గుండెలు అవిసేలా రోధిస్తూ.. మరింతగా కుచించుకుపోతూ.. ఆలోచనల్లో అంతర్ముఖంగా.. జీవిత పరమార్థాన్ని దర్శిస్తూ.. జీవన యానంలో భిన్న పార్శ్వాల మధ్య.. సమతా స్థితిని సాధించడం కోసం అనునిత్యం చేసే పోరాటం లోనే మానవ మనుగడ నిలిచి ఉంది.. 24, డిసెంబరు 2016