నో న్యూ రిజల్యూషన్స్ దిస్ ఇయర్..
నో న్యూ రిజల్యూషన్స్ దిస్ ఇయర్.. | ఫణీంద్ర కుప్పిలి "మనకంటే రాజకీయ నాయకులే బెటరేమో🤣 అలవికాని హామీలను ఐదేళ్లకొక్కసారి గుప్పిస్తే. మనమేమో ప్రతీ సంవత్సరం అమలు చేయని రిజల్యూషన్స్ తో సంబరపడుతుంటాం"🤣🤣 సో..నో న్యూ రిజల్యూషన్స్ దిస్ ఇయర్.. అని కొంచెం గట్టిగానే నిర్ణయించుకున్నా.. కానీ 'ఎంకి పెళ్లి.. సుబ్బి చావుకొచ్చినట్లు..' మావాడు ఈ మధ్య కొత్తగా మొదలెట్టిన గోళ్ళు కొరుకుడు కార్యక్రమం.. నా పీకమీదకొచ్చింది😀.. అదేంటో గానీ.. ఎన్నింటినో మార్చుకోగలిగిన నేను.. చినప్పటి నుండి.. ఎంతో శ్రద్ధగా సాధన చేసిన.. ఈ గోళ్ళు కొరుకుడు మహా వ్రతాన్ని.. నేను ఎంత వదిలించుకుందామన్న.. అది మాత్రం ఎంతో విశ్వాసంగా నన్నే అంటిపెట్టుకుని ఉంది😀.. ఏదో అవసరార్ధం.. మధ్య మధ్యలో చాలాసార్లు.. మానేసిన.. అది మూన్నాళ్ల ముచ్చటిగానే ముగిసిపోయేది😀😀.. చివరికి కొరికి..కొరికి.. వేళ్ళు సైతం సగం అయిపోయాయి😁.. మనకు మందు..బీడీ..చుట్ట..సిగరెట్లు లాంటివి మంచి అలవాట్లు లేకపోయినప్పటికీ.. ఇది మాత్రం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది.. 'ఏ ...