నో న్యూ రిజల్యూషన్స్ దిస్ ఇయర్..
నో న్యూ రిజల్యూషన్స్ దిస్ ఇయర్.. | ఫణీంద్ర కుప్పిలి
"మనకంటే రాజకీయ నాయకులే బెటరేమో🤣
అలవికాని హామీలను ఐదేళ్లకొక్కసారి గుప్పిస్తే.
మనమేమో ప్రతీ సంవత్సరం అమలు చేయని రిజల్యూషన్స్ తో సంబరపడుతుంటాం"🤣🤣
సో..నో న్యూ రిజల్యూషన్స్ దిస్ ఇయర్..
అని కొంచెం గట్టిగానే నిర్ణయించుకున్నా..
కానీ 'ఎంకి పెళ్లి.. సుబ్బి చావుకొచ్చినట్లు..' మావాడు ఈ మధ్య కొత్తగా మొదలెట్టిన గోళ్ళు కొరుకుడు కార్యక్రమం.. నా పీకమీదకొచ్చింది😀..
అదేంటో గానీ.. ఎన్నింటినో మార్చుకోగలిగిన నేను.. చినప్పటి నుండి.. ఎంతో శ్రద్ధగా సాధన చేసిన.. ఈ గోళ్ళు కొరుకుడు మహా వ్రతాన్ని.. నేను ఎంత వదిలించుకుందామన్న.. అది మాత్రం ఎంతో విశ్వాసంగా నన్నే అంటిపెట్టుకుని ఉంది😀.. ఏదో అవసరార్ధం.. మధ్య మధ్యలో చాలాసార్లు.. మానేసిన.. అది మూన్నాళ్ల ముచ్చటిగానే ముగిసిపోయేది😀😀.. చివరికి కొరికి..కొరికి.. వేళ్ళు సైతం సగం అయిపోయాయి😁..
మనకు మందు..బీడీ..చుట్ట..సిగరెట్లు లాంటివి మంచి అలవాట్లు లేకపోయినప్పటికీ.. ఇది మాత్రం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది.. 'ఏ అలవాటు లేనోడు.. అసలు మనిషే కాదు..'అని నా మిత్రుడు తరచుగా అంటుండేవాడు.. మనకు ఎలాగూ మిగతావి లేవు.. సర్లే..కనీసం ఇదైనా ఉండని.. అని కొనసాగిస్తూ వస్తున్నాను.. మా ఆవిడ మాత్రం పెళ్ళైనప్పటి నుండి .. ప్రతి రోజూ.. ఏదో ఒక విశేష తిధి/వారం పేరు చెప్పి.. మాన్పించే ప్రయత్నాలు అనేకం చేసినప్పటికీ.. చివరకు తనకు నిరాశే మిగిలింది..
అదేంటో 'సిరులు అబ్బకపోయినా.. సీడలు అబ్బుతాయన్నట్లు. ' ఇన్నాళ్టికి మావాడికి ఇది.. వంశపారంపర్యంగా అబ్బినట్లుంది😁.. ఇటీవలే ఓ శుభ ముహూర్తాన మావాడు సైతం.. సేమ్ టు సేమ్.. నాలాగే.. ఈ గోళ్ళు కొరుకుడు మహావ్రతాన్ని శ్రద్ధగా సాధన చేయడం మొదలెట్టాడు.. దాన్ని చూసి బాధపడాల్సింది పోయి.. మా ఆవిడ ఓ నాలుగు రోజుల్నుండి తెగ ఉబ్బి తబ్బిబ్బు అయిపోతోంది.. '..వర్మ సినిమా లాగా అసలేం జరుగుతోందో అర్థం కాక..'నాకు అంతా అయోమయంగా అనిపించసాగింది😁..
అయితే నిన్నటి నుండి.. దాని సంతోషానికి కారణం మెల్లగా అర్థం కాసాగింది.. నేను ఇంట్లో ఉన్నప్పుడు మావాడి పేరుతో.. తెలుగులో ఉన్న అన్ని బూతుల్ని ప్రయోగించడం మొదలెట్టింది.. మా వాడికి సైతం.. వాళ్ళ అమ్మ తిట్లు లోని అంతార్థం అర్థం అయిందో ఏమో కానీ.. నాకు కాదు అన్నట్లు.. ఎంజాయ్ చేయసాగాడు😁.. బహుశా తెలుగులోని తిట్లు అన్నీ కంప్లీట్ అయిపోయాయో ఏమో గాని.. ఈమధ్య మా ఇంట్లో 30రోజుల్లో తమిళం.. మలయాళం లాంటి పుస్తకాలు తారసపడటంతో😤.. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో..
మళ్లీ ఈ సంవత్సరం కొత్తగా మరోసారి.. అమలు చేయని రిజల్యూషన్ ని కొంచెం గట్టిగానే తీసుకున్నా😀😀.. దానితో పాటు.. కనీసం ఈ ఏడాది అయినా 'కరోనా కాలర్ ట్యున్.. కాకుండా 'ఏ కరీనా కాలర్ ట్యునో.. ' పెట్టుకునే మహాద్భాగ్యాన్ని కల్పించాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తూ..
అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు 💐💐