Posts

Showing posts from May, 2022

పెట్రోల్ బంకు | ఫణీంద్ర కుప్పిలి

పెట్రోల్ బంకు | ఫణీంద్ర కుప్పిలి               పొద్దున్నే తొందరగా ఎలా లేవాలా అని  ప్లానులు మీద ప్లానులు ఏస్కుని పడుకునే సరికి తెల్లవారు జాము అవడంతో ఉదయం యధావిధిగా లేటుగా లేవడమయింది..👻 దాంతో లేస్తానే అన్ని ఆఫీసు వాట్సాప్ గ్రూపుల్లో ఓసారి కలియతిరిగి.. అందరికీ అన్ని అప్పగింతలు చేసేసరికి.. మిట్ట మధ్యాహ్నం🌞 అయిపోయింది.. అప్పటివరకు పని హడావుడిలో ఉండటం తో ఉదయం నుండి ఏమీ తినలేదన్న విషయమే మర్చిపోయాను.. నేను మర్చిపోయినా కూడా..నా 'గ్యాస్ట్రిక్'🔥 మిత్రుడు మాత్రం మధ్య మధ్యలో గుర్తుచేయడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తూనే ఉన్నాడు.. సరే ఓ నాలుగు మెతుకులు ఎంగిలిపడి బయలేదరదామనుకుంటే..  ఆరోజు ఖచ్చితంగా అటెండ్ కావాల్సిన పెళ్లి ఫంక్షన్ ఒకటి ఉందనే విషయాన్ని మావాళ్ళు గుర్తు చేసేరు..                  మనకు ఈ పెళ్ళిభోజనాలు సెక్షన్ అంటేనే ఇబ్బంది.. ఎందుకంటే అక్కడ వాళ్ళు నోరు తిరగని నానా రకాల వంటకాల్ని ప్లేట్లో కుమ్మరించేసి.. కలగాపులగం చేసేస్తే.. ఏది తినాలో ...