పెట్రోల్ బంకు | ఫణీంద్ర కుప్పిలి
పెట్రోల్ బంకు | ఫణీంద్ర కుప్పిలి
పొద్దున్నే తొందరగా ఎలా లేవాలా అని ప్లానులు మీద ప్లానులు ఏస్కుని పడుకునే సరికి తెల్లవారు జాము అవడంతో ఉదయం యధావిధిగా లేటుగా లేవడమయింది..👻 దాంతో లేస్తానే అన్ని ఆఫీసు వాట్సాప్ గ్రూపుల్లో ఓసారి కలియతిరిగి.. అందరికీ అన్ని అప్పగింతలు చేసేసరికి.. మిట్ట మధ్యాహ్నం🌞 అయిపోయింది.. అప్పటివరకు పని హడావుడిలో ఉండటం తో ఉదయం నుండి ఏమీ తినలేదన్న విషయమే మర్చిపోయాను.. నేను మర్చిపోయినా కూడా..నా 'గ్యాస్ట్రిక్'🔥 మిత్రుడు మాత్రం మధ్య మధ్యలో గుర్తుచేయడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తూనే ఉన్నాడు.. సరే ఓ నాలుగు మెతుకులు ఎంగిలిపడి బయలేదరదామనుకుంటే.. ఆరోజు ఖచ్చితంగా అటెండ్ కావాల్సిన పెళ్లి ఫంక్షన్ ఒకటి ఉందనే విషయాన్ని మావాళ్ళు గుర్తు చేసేరు..
మనకు ఈ పెళ్ళిభోజనాలు సెక్షన్ అంటేనే ఇబ్బంది.. ఎందుకంటే అక్కడ వాళ్ళు నోరు తిరగని నానా రకాల వంటకాల్ని ప్లేట్లో కుమ్మరించేసి.. కలగాపులగం చేసేస్తే.. ఏది తినాలో తెలియని పరిస్థితి.. సరేలే ఏదో ఒకటి మింగి..ఆత్మారావుడ్ని శాంతింపజేద్దామని కారుని ముందుకు దూకించా.. హంతే.. కారులోని అలెర్ట్ 🔔తెగ మోగుతోంది.. ఏంటబ్బా.. కొంపదీసి సీటు బెల్ట్ గాని పెట్టుకోలేదా అని ఓసారి తడిమి చూసుకున్నాను😁
కుక్క మెడలో గంటలా అది పెట్టేసే ఉంది.. ఇవాన్ పావులోవ్ కండిషనింగ్ సూత్రంలా.. కారు ఎక్కుతానే ఆటోమేటిక్ గా పెట్టేసుకుంటా.. ఇంకెందబ్బా అని తీక్షణంగా చూసా.. ఇంకేముంది.. 'ఒరేయ్ జఫ్ఫా.. నీ ఆకలి మాట అటుంచి.. ముందు నా సంగతి చూడు.. లేదంటే నడి రోడ్డుపై నిల్చోబెడతా జాగ్రత్త😫 'అంటూ కార్ ఫ్యూయల్ ఇండికేటర్ కుంచెం గాఠ్ఠిగానే వార్నింగ్ ఇచ్చింది.. దాంతో బ్రమ్మి టైవులో తుళ్లుపడి కారుని అయిష్టంగానే దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్ ⛽వైపు తిప్పాను..
అయిష్టంగా ఎందుకంటే.. ఆ బంకులో పెట్రోల్ పెద్దగా బాగోదని.. మైలేజీ పెద్దగా రాదని బయట పబ్లిక్ టాకు.. దానికితోడు మనం పని లేకపోయినా కూడా ఓ పది కిలోమీటర్లు ఎక్కువే తిరిగి వచ్చే రకం కానీ.. మైలేజీ దగ్గరికి వచ్చేసరికి మాత్రం 'వీలైనంత తక్కువ జీతం ఇచ్చి వీలైనంత ఎక్కువ పని రాబట్టుకోవాలనుకునే పక్కా పెట్టుబడిదారు టైపు మనం..😇 అందువలన ఓ నాలుగు లీటర్లు కర్సు అయినా పర్లేదు.. ఎక్కువ మైలేజీ ఇస్తాదనే(?) బంకులోనే ఎపుడు కొట్టిస్తా.. అదేంటో నాకు అదో తుత్తి.. సేటీస్ స్ఫెక్షన్ 😜😁కానీ ఇపుడు అంత చాదస్తంకి పోతే.. మొదటికే మోసం వస్తుందని.. సెలవుల తర్వాత మొదటిరోజు బడికి తోలుకెళ్లే పిల్లాడిలా.. కారుని ఆ బంకు వైపు తిప్పా😭
అక్కడ ఆ బంకులో ఇంకో దరిద్రం ఏంటంటే.. చివరికి రోడ్డు పక్కన జొన్నపొట్టలు అమ్మేవాడు కూడా ఫోన్ పేలు వాడుతున్న ఈరోజుల్లో కూడా..ఆడి దగ్గర కార్డులు గీర్డులు జాన్తా నై.. కరెన్సీతోనే చమురు వదిలిస్తాడు😠.. పైగా ఊరు మధ్యలో ఉండటంతో ఏరోజు భత్యం (చమురు) ఆరోజే వేయించుకునే బ్యాచే ఎక్కువ.. అందువలన కుంచెం రద్దీగానే ఉంటుంది.. దాంతో అక్కడ పెట్రోల్ పొసే వాళ్లకు కూడా ఓ చిన్నపాటి సేలిబ్రిటీలే.. అందువలన వాళ్ళు ఎవడి కోసం వెయిట్ చేయరు అన్నట్లు ఉంటారు..
అప్పటికే ఓ డజను మంది బల్లోళ్ళు రాజమౌళి సినిమా రిలీజ్ రోజు టిక్కెట్ల కోసం వెయిట్ చేస్తున్నట్లు క్యూ కట్టున్నారు.. పొరపాటున బండి ఆపకుండా వెయిట్ చేస్తే కనుక.. ఆడు పొసే పెట్రోల్.. అక్కడ క్యూలోన వెయిటింగ్ కే కాలిపోతుంది.. దాంతో నాకు మరింత చికాకుగా ఉంది.. మరోవైపు కడుపులో 'జూలోని అన్ని జంతువులు కలిసి రన్నింగ్ రేస్ పెట్టేస్తున్నాయి'🐁🦏.. ఇది ఇప్పట్లో తెమిలే వ్యవహారం కాదని.. 'సూపే బంగారమయేనే శ్రీవల్లి..'పాటని పెట్టుకుని.. కళ్ళుమూసుకున్నా😴
ఇంతలో సడెన్ గా కారు అద్దాలపై సప్పుడు సేయడంతో.. కొంపదీసి 'శ్రీవల్లి' గాని గాజుల సప్పుడు సేస్తుందా అని తుళ్లుపడి లేచి చూసేసరికి ఇంకేముంది..అంత మందిని వదిలి..'ఎంత కొట్టమంటారు సారూ..😲 అని అడిగేసరికి.. కనీసం డబ్బులున్నాయో లేదో అని చూసుకోకుండా.. 'ఫు..ల్.. ట్యాం..క్..' అని ఆశ్చర్యంతో కూడుకున్న గౌరవం వలన వచ్చిన సిగ్గుతో అనేశా..🙄
ఎందుకంటే ఎక్కడలేని రూల్సు పాటించే అతను.. అంతమంది లైన్లో ఉండగా..అంత గౌరవంగా పిలిచి మరీ ఆడిగేసరికి..'ఇది కలయా..నిజమా..'అని హారన్🎷 మోగించి మరీ కన్ఫర్మ్ చేసుకున్నా..హంతే.. వాడు.. కొట్టడం మొదలెట్టాడు.. మీటర్లో రీడింగ్ పి.టి.ఉష 🏃కంటే స్పీడ్ గా పరుగులు తీస్తోంది😜 నా గుండె దానికి రెట్టింపు వేగంతో కొట్టుకుంటోంది😤.. అదేంటో 'బకాసురుడి కడుపు' లాగా ఎంత పోసిన నిండదు.. నిండిన కూడా అంతలోనే ' బ్రేవ్' మని త్రేమ్చేస్తుంది😁.. మొత్తానికి ఎలాగోలా దాని బాన పొట్ట నిండింది.. ఓ రెండు 'గులాబీ గాంధీ'లను వాడి చేతిలో కుక్కి.. ఏదో ఆడు ఫ్రీగా పోసినంత ఆనందంతో కారు యాక్సిలరేటర్ ను కసితీరా కుమ్మాను..
మొత్తానికి ఆరోజంతా ఆడు ఇచ్చిన వీఐపీ ట్రీట్మెంట్ తో ఓపక్క ఉబ్బితబవవుతున్నా..ఏదో మూల ఒక చిన్న డౌటనుమానం కొడుతూనే ఉంది.. మొత్తానికి ఎక్కడ బడితే అక్కడ తిరిగి రాత్రికి ఇంటికి చేరా.. ఫ్రెష్ అయి టీవీ పెట్టేసరికి.. క్రింద 'నిర్మలమ్మ ప్రవచనాలు' యమా స్పీడ్ గా స్క్రోల్ అవుతున్నాయి.. ఒక్కసారిగా నేను సంతోషంతో కూడుకున్న విచారంలో మునిగిపోయా..😶 ఇంతకీ విషయమేంటంటే.. నోట్ల రద్దు తర్వాత జనాల్ని అంతలా షాక్ కి గురిచేస్తూ.. పెట్రోల్ పై 'పది తగ్గింపు' బంపర్ ఆఫర్ ని మోడీ మామ ప్రకటించాడు..
అది చూసేసరికి అంతవరకు ఉన్న ఉత్సాహం..'నానా బాధలు పడి..తిరనాళ్ళలో లావుపాటి పర్సును కొట్టేసిన జేబుదొంగ.. మాంచి వూపులొ పర్సు తెరిసి చూసేసరికి..' నేనే రాజుని..నేనే మంత్రిని అంటూ అంత వరకు ఫెళలాడుతూ వగలుపోయి..నమో దెబ్బతో కిల్లీలు కట్టడానికి కూడా పనికిరాకుండా పోయిన ఓ నాలుగు వెయ్యి నోట్లు కబడేసరికి.. కరెంట్ షాక్ కొట్టిన కాకిలా గిలగిలా కొట్టుకుని పడిపోయినట్లు🤥 నాలోని ఊపు కాస్తా హుష్ కాకి అయింది.. అప్పటికి కానీ నాకు తత్వం బోధపడలేదు ' పెట్రోల్ బంకోడి దగ్గర మూడొందలెట్టి మరీ మర్యాదని కొనుక్కున్నానని.. '😢