కొన్ని సార్లు మనం మన చుట్టూ జరిగే అన్యాయాల్ని, అక్రమాల్ని అడ్డుకోవడంలో విఫలం కావచ్చు... కానీ దాన్ని ఎలాగైనా ఎదుర్కొని అడ్డుకోవాలన్న తపనే మన సాధించిన గొప్ప విజయం అవుతుంది..
గురువు తనకు అత్యంత ప్రియమైన శిష్యుడినే కఠినమైన పరీక్షలకు గురిచేసి చివరికి తను ఆర్జించిన సర్వ జ్ఞానాన్ని ధారపోస్తాడు.. అలాగే భగవంతుడు కూడా తనకు అత్యంత ప్రీతిపాత్రమైన భక్తుడినే కష్టాల కొలిమిలో వేసి చివరికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు..
అవకాశాలు అనేవి అందమైన గులాబీలు వంటివి.. ఓర్పు సహనంతో ముందుకెళ్తే వాటిని మనం సద్వినియోగం చేసుకోగలుగుతాం.. ఆలోచన లేకుండా అత్యుత్సాహం కనపరిస్తే.. సమస్యల సుడిగుండంలో చిక్కుకుంటాం..