పెద్ద పండగ | ఫణీంద్ర కుప్పిలి
పెద్ద పండగ | ఫణీంద్ర కుప్పిలి చిన్నప్పుడు పెద్ద పండగ అదే.. సంక్రాంతి వచ్చిందంటే అందరూ అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్తే.. మేము మాత్రం.. మా తాతయ్య నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళం.. అది మా ఊరి నుండి ఓ పది పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పల్లెటూరు.. ఆఫ్కోర్సు మాది కూడా పల్లెటూరే అయినప్పటికీ.. కొంచెం పెద్ద ఊరు😀.. మేము.. మా ఇద్దరు చిన్నాన్న వాళ్ళ కుటుంబాలు.. దగ్గర్లోనే ఉండే మా మేనత్త వాళ్ల కుటుంబం.. భోగికి ముందు రోజే వీలైనంత వరకు చేరుకునేవాళ్లం.. మా ఊరు నుండి అంత దగ్గరగా ఉన్నప్పటికీ ఆ రోజుల్లో పెద్దగా రవాణా సౌకర్యం ఉండేది కాదు ..ఆ ఊరుకి వెళ్ళటానికి రోజులో కేవలం రెండు లేదా మూడు ట్రిప్పులు మాత్రమే ఒక డొక్కు ప్రైవేటు బస్సు తిరిగేది.. ఆ బస్సు ఎపుడూ ఒక జీవిత కాలం లేటు.. ఇహ దాని పరుగు తల్చుకుంటే ఇప్పటికీ చలి జ్వరం వచ్చేస్తుంది.. అందుకే దాన్ని మేము ముద్దుగా పోతుల బండి😁 అని పిలుచుకునే వాళ్ళం.. ఇహ మేము పండగకి నాలుగు రోజుల ముందే మా తాతయ్య గారూ మమ్మల్ని రమ్మని కబురు పెట్టేవాళ్ళు.. మా తాత గారు రోజులో వచ్చే ప్రతీ బస్సుకు దిగుతామేమో అని ఇంటి న...