Posts

Showing posts from October, 2025

కన్నీటి చివరి బిందువు | ఫణీంద్ర కుప్పిలి

  కన్నీటి చివరి బిందువు | ఫణీంద్ర కుప్పిలి  అస్థిర పరిస్థితుల అల్లకల్లోలానికి రేపటి ఆశల మోహపు దీపం కొడిగడుతోంది.. గుండెల్ని పిండి చేసే బాధల సమ్మెట దెబ్బలకు ఆత్మస్థైర్యం తునాతునకలవుతోంది.. కంటి నుండి రాలిన కన్నీటి బిందువులు గత జ్ఞాపకాల నదిలో మునిగిపోతున్నాయి... మదిలో మెదిలే మధుర క్షణాల ప్రతిరూపం నేటి వేదనల దావానలం ముందు మసకబారుతోంది... చేతికి అందని కాలపు వలయంలా సుఖం దరి చేరకుండా దూరం పయనిస్తోంది... శ్వాసించే ప్రతి క్షణం ఒక భారమై మరణం కోసం ఎదురుచూసే దేహంలా జీవిస్తోంది... మౌనంగా సాగే ఈ శూన్య పోరాటంలో నిస్సత్తువతో నేలకొరిగే ఆశే నా మిగిలిన ఆస్తి... 11.10.2025