నిహిలిజం | ఫణీంద్ర కుప్పిలి

నిహిలిజం| ఫణీంద్ర కుప్పిలి


చిరునగవు ఎమోజీల తెరల చాటున దాగి,

హృదయం 'హార్ట్ రియాక్షన్'లో తాత్కాలికంగా ఆగి,

శూన్యాన్ని ' ఇన్స్టాగ్రామ్ ' స్టోరీలో మెరిసేలా దాచే యువతరం..


​స్క్రీన్ కాంతిలో మెరిసే ఈ జీవన చిత్రం,

స్వయంగా పోస్ట్ చేస్తూ, అప్పటికప్పుడే డిలీట్ చేస్తూ,

ప్రతిభ, భావోద్వేగం కేవలం 'టెంపరరీ ఫైల్'..


​పాత నమ్మకాలు, నోటిఫికేషన్లు లేని మూలలు,

'ఓల్డ్ అకౌంట్‌'లు అప్‌డేట్ కాని జ్ఞాపకాలు,

నూతన తత్వాలు, క్షణికమైన 'వన్-టైం పాస్‌వర్డ్‌'లు..


​"జీవిత పరమార్థం ఏమిటి?" అనే ప్రశ్న ఎందుకు?

సర్ఫింగ్‌ నెట్‌వర్క్‌ 'ఎర్రర్' చూపుతూ తిరస్కరిస్తుంది,

లోడ్ అవుతున్న ఆత్మ - నిరంతర 'బఫరింగ్' స్థితి మాత్రమే..


​ఈ భవిష్యత్ ఫ్లాష్ డ్రైవ్‌లో నిల్వకాని సత్యాలు,

ప్రేమ, అర్థం, దేవుడు - 'అన్ఇన్‌స్టాల్' అయిన పాత ఫోల్డర్‌లు,

ఈ జన్మ ఒక విస్తారమైన 'క్లౌడ్ స్టోరేజీ', 

శూన్యం తప్ప మరేమీ లేదు,

డౌన్‌లోడ్ కాని అనుభూతుల అంతులేని 'ఎంప్టీ ట్రాష్'..


16.10.2025

పాప్యులర్ పోస్టు

ఎన్ని'కల' భోజనంబు | ఫణీంద్ర కుప్పిలి

(అ)పుత్రస్య గతిర్నాస్తి..

మొబైలోపాఖ్యానం