...బతుకు బండి
...బతుకు బండి | ఫణీంద్ర కుప్పిలి అది మంచి వేసవి మధ్యాహ్నం.. సూర్యుడు ప్రకోపానికి పిట్ట కూడా లేని రోడ్డు.. నల్లటి తాచుపాములా మెరుస్తోంది..అభివృద్ధి దెబ్బకు.. మహా వృక్షాలన్నీ నేలకొరిగాయి.. వాటి స్థానంలో కోట్లు ఖర్చు పెట్టి నాటిన క్రోటన్స్.. గుక్కెడు నీళ్ళకి నోచుకోక.. తడారిపోయి..బిక్క మొహం వేసాయి.. అలాంటి ఎడారిని తలపిస్తున్న రోడ్డు పై ఒక పాత టాటా మ్యాజిక్..కబేలాకి తరలించడానికి సిద్ధంగా ఉన్న పశువులా.. మెల్లగా సాగుతోంది.. ఆ బండిలో వెనకాల ఒక కుటుంబం కూర్చుంది..బహుశా ఎక్కడికో వలస వెళ్తున్నట్లుగా ఉన్నారు.. దేశంలోని పేదరికమంతా ఆ కుటుంబంలోని ఆడమనిషిలో కనిపిస్తోంది.. ఆమె ఒంటిపై కాణీ ఎత్తు బంగారం కాదు కదా..కనీసం గురివింద గింజంత వెండి కూడా లేదు.. కనీసం సరైన బట్టలు కూడా వేసుకోలేని పరిస్థితి.. ఆ ఎండ వేడిని తట్టుకోలేక నెత్తిన కొంగు వేసుకుని..ఓ మూలగా కూర్చ...