ఫీల్డ్ ట్రిప్..


ఫీల్డ్ ట్రిప్..| ఫణీంద్ర కుప్పిలి

                    రేపు పొద్దున్నే షార్ప్ గా🙄ఎనిమిదింటికి ఫీల్డ్ ట్రిప్ కి బయలుదేరాలని.. మా హైకమాండ్ ఆదేశించడంతో.. మేమంతా యాజ్ యూజువల్ గానే.. యకాయకిన తొమ్మిదిన్నరకు రెఢీ😂😀అయిపోయాం.. సమరసింహారెడ్డి సినిమాలోని టాటా సుమోల కాన్వాయ్ లా.. అదెక్కడ దొరికాయో గానీ.. బిచాణా ఎత్తేసిన చావర్లే కంపెనీ.. ట్రవేరాల కాన్వాయ్ లో పోలోమని బయలుదేరాం.. బళ్లు బయటకి చూడాటానికి బానే ఉన్నాయి గానీ.. ఒక్క డోర్స్ మాత్రం.. కాస్తా గాఠ్ఠిగా లాగితే.. ఊడొచ్చి డోర్ తో సహా క్రిందపడేలా ఉన్నాయి అంతే😀..

ఇక ఎప్పటిలానే.. మా గ్యాంగ్ లీడర్😂 ఆఙ్ఞ మేరకు.. మా బ్యాచ్ అంతా ఒకే బండిలో కూర్చున్నాం.. ముందు దగ్గర్లోని గుడికి తీసుకుని వెళతాం అని చెప్పడంతో.. కాసేపు భక్తి భావంతో ఉండాలనే మా ప్రయత్నానికి గండికొడుతూ.. డ్రైవర్ మాంచి మాస్ మసాలా సాంగ్ వేయడంతో😳..అదేదో సినీమాలో హీరో అన్నట్లు..బయటికి ఆఫీసర్లు లాగా టకప్ లేసి బిల్డప్ కాస్త గాఠ్ఠిగానే ఇచ్చినప్పటికీ.. లోపల మాత్రం ఒరిజినాలిటీ అలాగే ఉండటంతో.. ఎంతో సేపు ఆగలేకపోయాం.. ఇహ అంతే.. మా సింగర్ కం మ్యూజిక్ డైరెక్టర్😂రంగంలోకి దిగడంతో.. ఆ డొక్కు బండి సౌండ్స్ ని కూడా డామినేట్ చేస్తూ..గ్రూప్ సాంగ్ తో హోరెత్తించామ్..

ఈ పాటల హోరులోనే..వెళ్లాల్సిన ఊరు తెలియకుండానే వచ్చేసింది.. ఇక అక్కడ దిగిన వెంటనే.. ఫోటో సెషన్ కి క్యూ కట్టిన మేము.. ఒకే కాంప్లెక్స్ లో ఉన్న  ఓ అరడజను దేవాలయాల్ని ఏకబిగిన చుట్టేసామ్.. ఆ తర్వాత దగ్గర్లోని మరో గుడిని దర్శించుకునే సరికి..మిట్ట మధ్యాహ్నం అయిపోయింది.. దాంతో కనీసం ఆ రోజన్నా.. మా మెస్ బారినుండి తప్పించుకోవచ్చనే ఉద్దేశ్యంతో😀😀దగ్గరలో జరిగే అన్నదానానికి వెళ్తే.. పుణ్యం పురుషార్థం.. రెండూ దక్కుతాయనే ప్రపోజల్ని.. మా హైకమాండ్..నిర్ద్వంద్వంగా తోసిపుచ్చడంతో.. నీరవ్ మోడీ దెబ్బకు.. కుప్పకూలిపోయిన స్టాక్ మార్కెట్ లా.. మేమూ కుప్పకూలిపోయాం😂😂

దాంతో చేసేది లేక షెడ్యూల్😲 ప్రకారం మా క్యాంపస్ కి అనుకునే ఉన్న 'జీడీ మామిడి పరిశోధన🤔 స్థానాని'కి చేరుకున్నాం.. రోజూ దానిముందు నుండే తిరిగే మేము..దాన్నే ఫీల్డ్ ట్రిప్ లో భాగంగా వెళ్లడం ఓ పెద్ద హాచ్చర్యం😀. బయట నుండి భారీ బిల్డింగ్.. పెద్ద బోర్డ్..అందంగా బారులు తీరిన క్రోటన్స్ ని చూసిన మేము.. ఏదేదో ఉహించేసుకుని లోపలకి అడుగుపెట్టాం.. లోపల వెళ్లి చూసేసరికి.. ఫ్లాప్ సినిమాతో వెలవెల బోయిన మల్టీప్లెక్స్ థియేటర్ లా ఉంది😀😀.. మొత్తానికి ఒక పేద్ద రూములో ఓ చిన్న బెంచీపై ఓ నాలుగు పుంజీలు(..పుంజీ అంటే నాలుగు) పావుకేజీ ప్యాకెట్లలో జీడిపిక్కలు తప్ప మరింకేమీ లేవు😥...అప్పటికే ఒకవైపు ఆకలితో అలమటిస్తున్న మాకు..పుండు మీద కారం చల్లినట్లు😠..అక్కడ నర్సరీలో ఓ అరగంట లైవ్ పెర్ఫార్మన్స్ చూపించడం ఒకెత్తు అయితే.. ఆ మహావిన్యాసాన్ని వీడియోలో  బందించటం మొత్తం ట్రిప్ కె హైలైట్..

ఆ తర్వాత యాజ్యుజవల్ గా ఓ నాలుగు మెతుకులు తిని..హాస్టల్ కి చేరి అలా నడుం వాల్చామో లేదో.. ఏదో ఫైర్ అలారం లా..మా వార్డెన్ విజిల్ వేయడంతో😭😭. కాస్త అయిష్టంగానే.. మిగిలిన ట్రిప్ కి బయలుదేరాం.. అయితే ఈసారి మా బ్యాచ్ లో ఓ రెండు వికెట్లు డౌన్ అయిపోయాయి.. మిగిలిన మేము ఉసూరుమంటూ..మళ్లీ సేమ్ బండిలో బయలుదేరాం..అయితే ఈసారి విజిట్ చేయాల్సిన ప్లేస్..డ్రైవర్ ఐదో గేర్ వేసేలోపే వచ్చేయడం మరో పెద్ద విశేషం😗..మళ్లీ అందరం పోలోమని దిగి.. లోపలకు వెళ్లాం..

అదో ఫుడ్ సైన్స్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్.. అక్కడి స్టూడెంట్స్.. న్యూట్రిషన్ పేరుతో.. నచ్చిన వాటిని సచ్చినట్లు(..మీరు కరెస్టు గానే చదివారు) కలిపేసి.. చిత్ర విచిత్రమైన పేర్లు పెట్టేసి.. వాటిని మా మీదకు వదిలే ప్రయత్నం కొంచెం గాఠ్ఠిగానే చేశారు😁😁.. ఎలాగోలా అక్కడి నుండి తప్పించుకుని.. అదే క్యాంపస్ లో ఉన్న ఐస్ క్రీమ్ ప్లాంట్ కి వెళ్లాం.. మొత్తానికి పెద్ద రిస్క్ లేకుండానే..ఓ ఐస్ క్రీమ్ కప్పుతో బయటపడ్డాం..

మధ్యలో వేరే వాటిని చూడాల్సి ఉన్నప్పటికీ.. ఈసారి మా మాటను మన్నించి.. డైరెక్ట్ గా ది పేమస్ 'సూర్యలంక  బీచ్' వైపు సర్రున మా కాన్వాయ్ సాగిపోతోంది.. ఈలోగా చిన్నగా వర్షం మొదలవడంతో.. మాలో సన్నగా భయం మొదలైంది.. గతంలో ఓసారి.. ఇలాగే ఎగబడి వెలితే.. బీచ్ కి తాళం చూసి షాక్ కి గురయ్యాము.. అయితే మా డ్రైవర్ మాత్రం ఏమాత్రం తగ్గకుండా.. 'నా చెంపకు సెలవీయకు..' అంటూ పాటెట్టి కిర్రెక్కించాడు.. దాంతో మాలోని భయంకర సింగర్స్ మరోమారు మేల్కొండంతో.. బండిలో మరోసారి రచ్చ రచ్చ అయిపోయింది.. అయితే ఈసారి హాచ్చర్యంగా..ఎపుడూ సీరియస్ గా ఉండే మా అన్న..  ఈ.వి.వి మరియు రాఘవేంద్రరావుని.. ఒకే ఫ్రేములో ఇరికించి విశ్వరూపం చూపించాడు😀

మొత్తానికి మెల్లగా బీచ్ కి చేరుకున్నాం..
ముందే మాంచి సరంజామాతో వచ్చిన మా మిత్రులు సముద్రంలో దిగి మునుగుతోంటే.. జీవితంలో మొట్ట మొదటిసారి పద్ధతిగా.. దూరంగా కూర్చుని చూడాలని నిర్ణయించుకున్నా.. అయితే మా వాళ్ళు మెల్లగా ముగ్గులోకి లాగడంతో..ఇక మనలోని ఒరిజినాలిటీ బయటకొచ్చేసింది.. ఇగ చూసుకోండి.. భీభత్సం గా ఎంజాయ్మెంట్ అయిపోయింది..మా మిత్రుడొకుడు తన బాడీతో సముద్రం ముందు విన్యాసాలు చేయడంతో😂😂మనోడి దెబ్బకు సముద్రం సిగ్గుతో చచ్చి ఓ వందడుగులు వెనక్కి పారిపోయింది🤣🤣
మా ఎంజాయ్మెంట్ ని చిత్తు చేస్తూ.. 'పార్కులోని లవర్స్ ' ని వెంటబెట్టినట్టుగా.. పోలీసోడు చాలా పద్ధతిగా లాఠీ పట్టుకుని వెంటబెట్టడంతో.. చేసేదిలేక ఒడ్డు మీదకి పరుగెత్తామ్..సందట్లో సడెనియా లాగా.. ఆ అవతారాలతోనే ఫోటో సెషన్ ఒకటి.. మళ్లీ చిన్నగా వర్షం మొదలవడంతో.. అదే గుడ్డలతో లగెత్తుకుంటూ వెళ్లి బండిలో కూర్చున్నాం.. ఈసారి మా డ్రైవర్ సిట్యుయేషన్ కి తగినట్లు..మాంచి వర్షం సాంగ్స్ వేయడంతో.. డోర్స్ ఊడొచ్చేలా డప్పులు మోత మోగించేసాం..

అప్పటికే అందరం సముద్రంలో గెంతి.. వర్షానికి తడిచి.. వరద బాధితుల్లా తయారైనా.. మా హైకమాండ్ మాత్రం షెడ్యూల్ లో మిగిలిన వాటినీ చూడాలని పట్టుబట్టడంతో.. ఇక చేసేది లేక.. స్వాతంత్ర్యోద్యమ కాలం నాటి టౌన్ హాల్ కి వెళ్లాం.. వెళ్ళామా..ఫోటో దిగామా.. వచ్చామా.. అని లేకుండా.. పైకప్పు కూలిపోయేలా.. స్లొగన్స్ ఇచ్చి మరీ వచ్చాము😀😀.. అప్పట్లో కాసులకు కక్కుర్తి పడకుండా కట్టించబట్టి సరిపోయింది.. అదే ఇప్పటి దేశబత్తులు కట్టుంటే..మా అరుపుల ధాటికి అది కుప్ప కూలిపోయుండేది😀😀

అక్కడితో ఆగకుండా ఇంకా వ్యవసాయ కళాశాల సందర్శన అంటే..మా వాలాకాల్ని చూసి ఎక్కడ ఎంటబెడతారో అని భయంతో పాటూ.. అప్పటికే బాగా తడిచిన బట్టల వలన..లోపల 'రకరకాలుగా' ఉండటంతో😂😂బయటే ఒక ఫొటోవు దిగి 'మమ' అనిపించేసి.. గోడకు కొట్టిన బంతిలా హాస్టల్ కి వచ్చిపడ్డాం..

02.08.2018

పాప్యులర్ పోస్టు

ఎన్ని'కల' భోజనంబు | ఫణీంద్ర కుప్పిలి

(అ)పుత్రస్య గతిర్నాస్తి..

మొబైలోపాఖ్యానం