Posts

Showing posts from April, 2019

...హెయిర్ కటింగ్ | ఫణీంద్ర కుప్పిలి

...హెయిర్ కటింగ్ | ఫణీంద్ర కుప్పిలి '...మరీ అలా బూచోడి లాగా 🤓 అంతెత్తు జుట్టు వేసుకుంటా తిరగకపోతే వెళ్లి కటింగ్ వేయించుకు రావచ్చు కదా.. వారం రోజులలో పెళ్లి కూడా ఉంది ఇప్పుడు చేయించుకుంటే.. అప్పటి సరికి బాగా వస్తుంది అంటూ..' అని మా ఆవిడ పొద్దున్నుండి నసపెడుతుంటే.. ఇక తప్పేలా లేదు అనుకుంటూ..రాత్రి ఎనిమిదింటికి ఓ మాసిన బనీను ఒకటి మీద వేసుకుని బయలుదేరా.. అదేంటో.. నాకు హాస్పిటల్ అన్నా..హెయిర్ సెలూన్ అన్నా విపరీతమైన వణుకు.. ఆరెండింటి తోనూ నాకున్న అనుభవాలు అలాంటివి.. సాధారణంగా మనలో చాలా మంది..ఆసుపత్రి అంటే భయపడటం సహజం..మరి నా కటింగ్ గోల ఏంటి అని అనుకుంటున్నారా.. కొంచెం ఓపిక పడితే మీకు అర్థమవుతుంది😀 మొత్తానికి మా ఆవిడ పోరు పడలేక..పక్క వీధి చివర్లో ఉన్న ఓ సెలూన్ లోకి భయం భయంగా.. చిన్న పిల్లోడు మొదటి సారి బడిలోకి అడుగు పెట్టినట్లు..☹️ అడుగు పెట్టా.. అంతే.. లోపలున్న '..మా మల్లేశం'.. మంత్రి మహాశయుడు.. గభాలున నన్ను ఓ పెద్ద తిరుగుడు కుర్చీలోకి కూలదోశాడు.. '..ఏటయిపోనారు బాబు.. అప్పుడెప్పుడో.. కొత్త ఆమాసకి..కటింగ్ ఏశాను..మళ్లీ మీరు మారు అవుపడలేదు.. ఏటయిపోనారేటి?..' అ...

(అ)పుత్రస్య గతిర్నాస్తి..

"(అ)పుత్రస్య   గతిర్నాస్తి .‌.‌."| ఫణీంద్ర కుప్పిలి అదో గవర్నమెంట్ ఆఫీసు.. అక్కడ ఆఫీసర్ సీట్లో ఒక కుర్రాడు ఠీవిగా కూర్చుని.. చాలా హుషారుగా తన పని చేసుకుంటున్నాడు.. ఇంతలో అటెండర్ వచ్చి.. సార్ మిమ్మల్ని కలవడానికి..మీ నాన్న గారు వచ్చారు..అని చెప్పాడు.. దాంతో అదోలా అతనివైపు చూసి లోనికి పంపించమన్నట్లు సైగ చేశాడు.. కాసేపటికి ఒక అతను..బాగా మాసిపోయిన బట్టల్లో లోపలికి వచ్చి ఎదురుగా నిల్చున్నాడు.. కనీసం కూర్చోమని కూడా అనకుండా '..ఇక్కడకు ఎందుకొచ్చావ్..' అని చిరాకుగా మొహం పెట్టి అడిగాడు..              అతను అదేమీ పట్టించుకోకుండా..' ఫోన్ చేస్తే..లిఫ్ట్ చేయడం లేదు..'మాట పూర్తికాకుండానే..'నీలాగా నేనేమి పనీపాట లేకుండా..ఖాళీగా ఉన్నానా?..' అని ఇంకేదో అనబోతుంటే..'అలా అని కాదురా..నీకు ఇంతకుముందే చెప్పాను కదరా..ఇంటి మీద డబ్బు ఇచ్చిన వాడు..ఇప్పటికే నీ కొడుక్కి ఉద్యోగ వచ్చి చాలా ఏళ్ళయింది..పెళ్లి కూడా చేశావ్.. ఇంకెప్పుడు నా అప్పు తీరుస్తావ్? లేదంటే బాకీ కింద ఇల్లు అమ్మేయ్..'అని రోజూ ఇంటికొచ్చి గొడవ చేస్తున్నాడురా.. నువ్వు తల్చుకుంటే..ఆ బాకీ తీర్చడం పెద్ద...