మౌనపు రాగం | ఫణీంద్ర కుప్పిలి
మౌనపు రాగం | ఫణీంద్ర కుప్పిలి ఏకాంతమే ఇప్పుడు నా సఖి నిశ్శబ్దమే నా ప్రేయసి హృదయాంతరాళంలో ఖాళీతనమే దేవుడయ్యాడు నింగిని చూసినప్పుడు కన్నీటి జడివాన నేలని తాకినప్పుడు నీడల భాష ఈ రెండింటి మధ్య నిలబడిన నేను అర్థంలేని పాటలో మునిగిపోయాను జ్ఞాపకాల పురాతన గ్రంథంలో కొన్ని పుటల్ని కాలం చించేసింది కొన్ని మాత్రం కళ్ళు మూసిన క్షణంలో అగ్నిపర్వతాలై గుండెను బద్దలు చేస్తున్నాయి.. ఒక కుర్చీ నా కథను చెబుతుంది.. ఒక గాజుపాత్ర నా గతాన్ని గుర్తుచేస్తుంది.. ఒక అపూర్ణమైన గీతం అనంతమైన మౌనంలో కరిగిపోయింది కాల చక్రం స్తంభించిపోలేదు.. కానీ ఆ ప్రతి సెకను శబ్దంలో నా ప్రాణం ఒక పాత పుస్తకంలా దుమ్మెత్తుకుంటూ మసకబారుతోంది ఈ ఏకాంత భారమే నా దేవుడు ఈ నిశ్శబ్దమే నా మంత్రం నా మౌనంలోని గావుకేకలు ఎవరికీ వినిపించని ప్రార్థనలు ఎదురుచూపులన్నీ అలసిపోయాయి తలుపులు తాళాలు వేసుకున్నాయి నా అంధకారమే ఇప్పుడు వెలుగు నా వేదనే ఇప్పుడు నా గొంతు ప్రేమ అనే పదం దాని అర్థాన్ని కోల్పోయింది స్నేహం అనే భావం నేపథ్యంలో కనిప...