అంతర్యాత్ర | ఫణీంద్ర కుప్పిలి

 అంతర్యాత్ర | ఫణీంద్ర కుప్పిలి 


ఒక్కో చేదు జ్ఞాపకం జతపడి 

బ్రతుకు కన్నీళ్ల సంద్రంగా మారుతోంది..

మనసులోని అలజడులు సుడిగుండాలై 

జీవనయానాన్ని అతలాకుతలం చేస్తున్నాయి..

దిక్కు తోచక ఒంటరిగా నడి సంద్రంలో 

నిలబడిన నేను..


మౌనమైన రాత్రులలో విన్న కథల్లా

నా మనసులోని గాయాలు మాట్లాడుతున్నాయి.. 

ప్రతి కన్నీటి చుక్కలోనూ

ఒక దీప్తిమంతమైన ధైర్యపు వెలుగు రేఖ ప్రజ్వలిస్తోంది..


కష్టాలకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ

వాటి నుండి నేర్చుకున్న పాఠాలతో..

నిన్నటి చీకటి నుండి రేపటి వెలుగుకు

వంతెనను నిర్మించుకుంటున్నాను..


మళ్లీ నవ్వగలిగే ' నేను'ని ఆవిష్కరించుకుంటూ..

రేపటి ఆశామోహాల తెరచాపని అడ్డుపెట్టి

నిర్విరామంగా ముందుకు సాగిపోతున్నాను..


22.08.2025

పాప్యులర్ పోస్టు

ఎన్ని'కల' భోజనంబు | ఫణీంద్ర కుప్పిలి

(అ)పుత్రస్య గతిర్నాస్తి..

మొబైలోపాఖ్యానం