తలకో మొక్క..ఊరికో వనం
తలకో మొక్క..ఊరికో వనం | ఫణీంద్ర కుప్పిలి గత నాలుగు రోజులుగా ఎక్కడ చూసినా .. “నిప్పులు కక్కుతున్న సూరీడు..భానుడి ప్రతాపానికి విలవిల లాడుతున్న జనాలు..” లాంటి మంచి టైమింగ్, రైమింగ్ ఉన్న క్యాప్షన్లతో జనాల్ని ఊదరగొదుతున్నారు.. అయినా ఎంతసేపూ..సూరన్నని ఆడిపోసుకునే బదులు..అసలు భానుడి ఈ ప్రతాపానికి కారణం ఎవరని? ఏ ఒక్కరూ ఆలోచించరే... మనం అభివృద్ధి పేరుతో కనబడిన ప్రతి చెట్టుని తెగ నరికేసి..అంగుళం ఖాళీ లేకుండా కాంక్రిటుతో పరిచేసి.. కనుచూపు మేరలో కనీసం పచ్చ గడ్డిని మొలవనివ్వకుండా చేసేయడమే కాకుండా.. కారుల్లో..బైకుల్లో తెగ తిరిగేసి.. రోజంతా ఏ.సిలు ఫ్రిజ్ లు..మోటార్లు.. హీటర్లు.. ఒకటేంటి నానా రకాలుగా వాడేసి.. వాతావరణాన్ని వోల్ మొత్తంగా బొగ్గు పులుసుతో నింపేసి.. మన నెత్తిన మనమే కుంపటిని రాజేసుకుని.. ఇపుడు ఏ.సి రూంలో తీరిగ్గా కూర్చుని.. ”అబ్బ..ఈ వేడిని భరింలేకపోతున్నాం..” అంటూ దీర్ఘాలు పోవడం మరీ విడ్డూరం.. వెనకటికొకడు..” పచ్చదనం-ప్రాముఖ్యత పై మీటింగ్ ని..పదెకరాల తోటని నరికైనా సరే..భారీగా పెడతానని మంగమ్మ శపదం చేసాడంట..” ఇలా మనం కోట్ల టన్నుల కొలది భూవాతావరణాన్ని బొగ్గ...