Posts

Showing posts from August, 2018
భర్త :  ఏమేవ్.. నేనలా బ్యూటీ పార్లర్ కి వెళ్ళొస్తా.. భార్య : మీరు బ్యూటీ పార్లర్ కి ఎందుకండీ? భర్త : రేపు శ్రావణ శుక్రవారం కదా.. భార్య : అయితే.. మీరు ఏమన్నా పేరంటానికి వెళతారా?😲😲 భర్త : అదేం లేదే.. రేపు నువ్ కాళ్ళకి దణ్ణం పెట్టేటపుడు ఎలాగూ ఫోటో తీస్తావుగా.. నీ సెల్ఫీ లో కాళ్ళు బాగా పడొద్దూ.. 😀😂

నా స్వప్నం..

నా స్వప్నం | ఫణీంద్ర కుప్పిలి నేనొక కలగంటున్నాను.. ఒక మాజీ మంత్రి తనకి  రావాల్సిన పింఛను డబ్బు కోసం ఆఫీసు ముందు నిల్చున్నట్లు.. నేనొక కలగంటున్నాను.. ఒక మంత్రి గారి కారు రోడ్డు దాటుతున్న ఒక ముసలి అవ్వ కోసం సిగ్నల్స్ వద్ద ఠక్కున ఆగినట్లు.. నేనొక కలగంటున్నాను.. తనకు పుట్టబోయే బిడ్డ సీటు కోసం ఒక గవర్నమెంట్ బడి ముందర బారుతీరిన లైన్లో నిల్చున్నట్లు.. నేనొక కలగంటున్నాను.. ఒక సర్కారీ దవాఖానాలో సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు అర్ధరాత్రి దాటే వరకూ డ్యూటీ చేస్తున్నట్లు.. నేనొక కలగంటున్నాను.. ప్రభుత్వ కార్యాలయాల్లో చేతులు తడపకుండానే చకా చకా ఫైల్స్ కదులుతున్నట్లు.. నేనొక కలగంటున్నాను.. ఒక సోదరి అర్థరాత్రి నిర్భయంగా తన ఇంటికి చేరుకున్నట్లు.. నేనొక కలగంటున్నాను.. దేశం లో రాజకీయపార్టీలు నోట్లు పంచకుండానే ఓట్లడిగి గెల్చినట్లు... నేనొక కలగంటున్నాను.. కుల మత వర్గ భేదాలు లేని భారతావని నా జీవిత కాలం లోనే సాకారమయినట్లు...

అనగనగా ఆదివారం..

అనగనగా ఆదివారం..                         ఎపుడో అర్థ పుష్కర కాలం కిందట రావాల్సిన మా రిజల్ట్స్..అన్ని పురిటి నొప్పుల్ని దాటుకుని .. మా చేతికి పోస్టింగ్ ఆర్దర్లు వచ్చేసరికి..సగం మంది మగాళ్ళకి నూనె ఖర్చు తగ్గి..రంగు ఖర్చు పెరిగిపోయింది😂😂 మొత్తానికి బ్రహ్మచారులుగా ఉన్నపుడు పొందాల్సిన ట్రైనింగు..అంకుల్స్ (..ఆంటీ)😀😀గా మారాక మొదలైంది.. దాంతో బాధ్యతలు పెరిగి.. ఎపుడెపుడు ఇంటికి వెళదామా అని.. పేరోల్ కోసం ఎదురు చూసే జీవిత ఖైదీ లా..రెండో శనివారం కోసం ఎదురుచూడ సాగాం.. ఆదివారం నాడు మాంఛి నాటు కోడి పలావు ని సిద్ధం చేసుకుని.. భోజనానికి కూర్చునే సరికి.. ఉరుము లేని వర్షం లా వచ్చిన అతిథులు..ముక్క కూడా మిగల్చకుండా.. తినేసినట్లుగా.. మా రెండో శనివారం కాస్తా.. అస్సలు వినలేని క్లాసుతో కొట్టుకుపోయింది😢😢..దాంతో.. చేతిలోని లాలీపాప్ లాక్కుంటే.. చిన్న పిల్లోడికి కలిగిన ఫీలింగ్ తో ఉసురుమంటూ.. శనివారం గడిపాము.. ఆదివారం నాడు ఉదయం.. ఫ్యాక్టరీ సైరన్ లాంటి..మా వార్డెన్ వాయిస్ కి తుళ్ళిపడి ల...